ఇప్పుడు చైనా ప్రపంచానికి ఎంతటి ప్రమాదకారో అర్థమయ్యాక… అందరూ ఏవగించుకుంటున్నారు దాన్ని…! ప్రపంచాధిపత్యం కోసం అది ఎంతకైనా దిగజారగలదు… మన పురాణాల్లోని రాక్షసజాతి అది… మన దేశంలో దాని తోకపార్టీలు కొన్ని ఉంటయ్, ఆహా చైనా ఓహో చైనా అంటుంటారు ఆ ఎర్ర మేధావులు… మోకాళ్లలో ఉన్నాసరే, డొల్లగా ఉన్నా సరే, ఆ బుర్రలు చాలా పెద్దవి కాబట్టి, దాన్ని పక్కన పెడితే… ఓ విషయం చెప్పుకోవాలి… హంగరీ అని ఓ కంట్రీ ఉంది… దాని రాజధాని బుడాపెస్ట్… చైనా దేన్నీ వదలదు కదా… అప్పుడెప్పుడో అక్కడ ఓ యూనివర్శిటీ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఆ దేశం… ఆ వర్శిటీ నిర్మాణంలో ఉంది… కానీ రోజులు మారాయి… చైనా అంటేనే జనం ఏవగించుకునే సిట్యుయేషన్… ఆ బుడాపెస్ట్ సిటీ పాలకవర్గం తమ నిరసనను ఎలా వ్యక్తీకరించిందీ అంటే…
నాలుగు రోడ్లకు చైనా ఏమాత్రం ఇష్టపడని నాలుగు పేర్లను పెడుతోంది… ఒరేయ్, మమ్మల్ని వదిలేయండ్రా అని ఓ సంకేతం… అది చైనా, అవన్నీ ఏం పట్టించుకోదు… పట్టించుకుంటే దాన్ని చైనా అని ఎందుకంటారు..? ప్రపంచానికే ప్రథమ శత్రువు అది… కరోనాను కాదు, ఇంకేదైనా తయారు చేసి మరీ వదలగలదు అది… జిన్‌పింగ్ అనబడే ఓ నయా హిట్లర్ ఏదైనా చేయగలడు… పైగా తనను ఎవడూ దించేయకుండా మొత్తం చైనా రాజ్యాంగాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కదా… మన మోడీ జాన్ జిగ్రీ దోస్త్… ఆ రోడ్ల తాజా ప్రతిపాదిత పేర్లు ఏమిటీ అంటారా..? 1) దలై లామా… చైనా కొండచిలువలా మింగేసిన టిబెట్‌కు ఆధ్యాత్మిక, పాలక అధినేత… ఒక వీథికి ఆ పేరు పెట్టేస్తున్నారు… మీరు పైన చూస్తున్న ఫోటో అదే…
Ads
పర్‌ఫెక్ట్ నిరసన… మరో బజారుకు హాంగ్ కాంగ్ పేరు పెడుతున్నారు… చైనా దుర్నీతికి మరో ఉదాహరణ హాంగ్ కాంగ్… అది మరో ప్రొటెస్టు… మూడో బజారు పేరును ‘వుయ్‌గర్ అమరుల రోడ్’ అని పెడుతున్నారు… వుయ్‌గర్ ముస్లింల మీద చైనా అమానవీయ పోకడలకు ఇది ప్రొటెస్టు… వుయ్‌గర్ ముస్లింల మీద చైనా అణిచివేత అందరికీ తెలిసిందే, మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు… నాలుగో బజారు పేరు బిషప్ జీ షింగువాంగ్ వీథి… ఈ పేరున్న కేథలిక్ పూజారిని చైనా జైలులో పారేసింది… వావ్, ఇదీ ప్రొటెస్టు అంటే… దేశంలోని లిబరల్స్, సోకాల్డ్ మోకాలి బుర్రల మేధావులు తెగ గింజుకుంటున్నారు… నో, నో, ఎవరెన్ని చేసినా సరే, ఈ ఫుడాన్ యూనివర్శిటీ ప్రాజెక్టు విషయంలో వెనుకంజ లేదు అంటోంది చైనా… అలా అంటేనే అది చైనా… చైనా అంటేనే అది… అది ప్రపంచానికే విలన్ ఈరోజు… ఎలాగూ ప్రపంచం మీదకే కరోనాను వదిలిన చైనావోడా..? ఫాఫం, ఆ చిన్న దేశం హంగరీని వదిలేయవచ్చు కదరా అన్నామనుకొండి…. నో, నో, అది మా యూనివర్శల్ పాలసీకే వ్యతిరేకం అంటుంది చైనా… ఎస్, దటీజ్ చైనా… మరి మన దేశంలో ఆ చైనాను తెగ కీర్తించేవాళ్లను ఏమనాలి అంటారా..? మీ ఇష్టం…!!
Share this Article