తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు… స్టార్ హోటల్ లో, అమెరికాలో చప్పట్ల మత్తు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
—————————————-
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించడంతో పాటు వై యస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేసే నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులకు టిడిపిలో విశేష గౌరవం లభించేది . తానాకు నాయకత్వం వహించిన వారిలో ఎక్కువ మంది టీడీపీ అభిమానులు , వీరిలో కొందరు ఆంధ్రాలో టీడీపీ టికెట్ల కోసం గట్టిగా ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు . వీరిలో ఎక్కువ మంది సమైక్యాంధ్ర కోరుకున్న వారు . తానా సభలకు తరుచుగా టీడీపీ మంత్రులను , నాయకులను పిలిచేవారు .
Ads
********
మన ముందున్న వారే ప్రపంచం అనుకుంటే చావు దెబ్బ తింటాం . బోగస్ స్కీముల వాడి లక్ష్యం హోటల్ లో ఉన్న ఆ కొద్ది మందే కాబట్టి వారి ముందు చప్పట్లు కొట్టించి బోల్తా కొట్టించవచ్చు . కానీ కోట్లమందిని పాలించాలి అనుకునే వాళ్ళు కొద్ది మంది చప్పట్లనే అందరి చప్పట్లు అనుకుంటే దెబ్బ తింటారు . వైస్ రాయ్ హోటల్ సమావేశంలో కొద్ది మంది చప్పట్లనే ప్రజలందరి చప్పట్లుగా నమ్మించాలి అని చూసిన బాబుకు 2004 ఎన్నికల ఫలితాలతో విషయం తెలిసి వచ్చింది . తానా సభలో చప్పట్లకు మురిసిపోయిన నాగంకు తెలంగాణ వచ్చాక విషయం అర్ధమైంది . తానాలో కుర్రాళ్ళ చప్పట్లకు రేవంత్ కు అప్పటికప్పుడు సంతోషం కలిగినా … కాలం సమాధానం చెబుతుంది …. – బుద్దా మురళి
Share this Article