మొన్నామధ్య అనురాగ్ కశ్యప్ అనబడే ఓ వెకిలి దర్శకుడు హీరోయిన్ తాప్సి స్తనాలపై చేసిన వెగటు వ్యాఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ కశ్యపుడి కథేమిటా అని చెక్ చేస్తుంటే… మరో ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఒక్క కశ్యప్ మాత్రమే కాదు… తనతోపాటు రాజ్‌బబ్బర్, ఆయన భార్య నదిర, విశాల్ భరధ్వాజ్, నవాజుద్దీన్ సిద్దిఖి ఎట్సెట్రా 172 మంది బాలీవుడ్ పర్సనాలిటీలు ప్లస్ కొందరు ఇతరులు నెలనెలా 50 వేల పెన్షన్లు పొందారట…
షాకింగ్‌గా ఉందా..? అంతేమరి… ప్రజాధనాన్ని ఎవరికిపడితేవాళ్లకు అప్పనంగా ఇచ్చేయడం ఉత్తరప్రదేశంలో అలవాటే… ఈ వివరాలు ఎలా బయటికి వచ్చాయి అంటే… బరేలికి చెందిన మహమ్మద్ ఖాలిద్ జిలానీ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ 2017లో సమాచార హక్కు కింద అడిగాడు… తను ఈ వివరాలన్నీ వచ్చాక సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓ లెటర్ పెట్టాడు… అనర్హులకు ఇలా పెన్షన్లు ఇవ్వడం ప్రజాధన దుర్వినియోగమే అవుతుందనీ, ఈ స్కీమ్ ఎత్తిపారేయాలని, ఏదైనా నిజమైన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆ డబ్బు వెచ్చించాలని కోరాడు…
యోగి వెంటనే స్పందించి ఆ పెన్షన్లపై వేటు వేశాడు… అంటే బుల్‌డోజర్‌తో ఆ స్కీమ్‌ను తొక్కిపారేశాడు అప్పుడే… బుల్‌డోజర్ బాబా రద్దుల ప్రతాపం అప్పట్నుంచే మొదలైందన్నమాట… అదీ బాలీవుడ్ ప్రముఖులతో… వాళ్లంతా రుసరుసలాడారు… యోగి కదా, ఎహెఫొండి అనేశాడు… జిలానీ సేకరించిన వివరాల్లో ఆశ్చర్యం ఏమిటంటే… జాహిద్ హసన్ అని ఎమ్మెల్సీ ఉండేవాడు, తనకు ఎలాగూ పలు అలవెన్సులు వస్తాయి… తనకు కూడా ఉర్దూ సాహిత్యకారుల జాబితాలో చేర్చేసి పెన్షన్ ఇచ్చేవాళ్లు…
Ads
నిజానికి ములాయం సింగ్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ఈ స్కీమ్ ఉంది… స్కీమ్ పేరు యశ్ భారతి సమ్మాన్… సినిమా ప్రముఖులు, జర్నలిస్టులు, క్రీడాకారులు, సాహిత్యకారులు ఎట్సెట్రా… తరువాత మాయావతి సీఎం అయ్యాక ఈ దిక్కుమాలిన స్కీమ్ ఏమిటి అంటూ రద్దు చేసిపారేసింది… తరువాత అఖిలేష్ సీఎం అయ్యాక పునరుద్ధరించాడు… 2017లో యోగి మొత్తం ఆ స్కీమ్‌నే వైండప్ చేశాడు… ఇదీ ఆ పెన్షన్ల కథాకమామిషు… నెలనెలా పెన్షన్లే కాదండోయ్, 11 లక్షల నగదు, శాలువా, ఓ సర్టిఫికెట్ (??)తో సత్కరించేవాళ్లట కూడా…
ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి… ఈ పెన్షన్లను తిరస్కరించిన వాళ్లూ ఉన్నారు… వారిలో కొందరు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, షబానా ఆజ్మీ, ఫ్లూట్ ప్లేయర్ హరిప్రసాద్ చౌరాసియా, షూటర్ జస్పాల్ రాణా… ఒకే బచ్చన్ కుటుంబం నుంచి ముగ్గురికి పెన్షన్లు ఇవ్వబోయారన్నమాట… వారెవ్వా…!! అన్నట్టు, ఇదే యోగి ప్రభుత్వం వాజపేయి పేరిట రాజ్యసంస్కృతి పురస్కారాలను ఆ యశ్‌భారతి స్కీమ్ ప్లేసులో ప్రవేశపెట్టింది… ఎంపిక చేసినవాళ్లకు ఒకేసారి 5 లక్షల చొప్పున ఇచ్చి ప్రభుత్వం తరఫున సన్మానిస్తారన్నమాట… నో పెన్షన్స్…!!
Share this Article