.
“ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్?
*ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్!
పుష్ప2 సినిమాలో ఈ డైలాగ్ ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎందుకన్నారు… ఏమో సినిమా చూసినవాళ్లకు మాత్రం తెలియదు గానీ… సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ చేయబడుతోంది…
Ads
బన్నీ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ దీన్ని జోరుగా షేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… ఒకవేళ నిజంగానే యథాతథంగా ఈ డైలాగ్ పెట్టి ఉంటే మటుకు ట్యాంకర్ పెట్రోల్ పోసినట్టు మండేదేమో…
అసలే మెగా క్యాంపుకీ, బన్నీకి నడుమ మంట అస్సలు చల్లారడం లేదు… ఈ నేపథ్యంలో పుష్పరాజ్ ఆ మాటంటే ఇంకేమైనా ఉందా..? అవి నేరుగా చిరంజీవిని, రాంచరణ్‌ను, పవన్ కల్యాణ్‌ను తృణీకరించినట్టే… అవమానించినట్టే…
చెప్పను బ్రదర్ అని అప్పుడెప్పుడో స్టేజీ మీద అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించడానికి తిరస్కరించాడో ఆనాటి నుంచీ బన్నీకి, మెగా క్యాంపుకీ నడుమ దూరం పెరుగుతూనే ఉంది… ఇరువైపులా ఆ అగాథాన్ని పూడ్చే ప్రయత్నాలు, ఆలోచనలు కూడా లేవు…
నంద్యాల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి బన్నీ వెళ్లడం.., మనవాడు, పరాయోడు అని నాగబాబు చేసిన ఒక అపరిణత ట్వీట్ మరింతగా మంటలు రాజేశాయి… పుష్ప2 రిలీజు నాటికి ఈ వైరం చల్లారలేదు… సరికదా బాయ్‌కాట్ పుష్ప2 అనే పిలుపుల దాకా వెళ్లిపోయింది…
తమ తమ అభిమాన హీరోల వారీగా ప్రేక్షకులు చీలిపోవడం, తిట్టుకోవడం సౌత్ ఇండియా ఇండస్ట్రీల్లో కామనే… సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ పోరాటాలకు అదే వేదికయింది… విచిత్రంగా టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, మహేశ్‌బాబు, బన్నీ, రాంచరణ్ ఫ్యాన్స్ నడుమ కాదు… కులాల వారీ హీరోల ఫ్యాన్స్ నడుమ కాదు… ఒకే కుటుంబానికి చెందిన మెగా, బన్నీ ఫ్యాన్స్ నడుమ వైరం పెరగడం ఆశ్చర్యం…
అల్లు అరవింద్ గానీ, చిరంజీవి గానీ దీన్ని చల్లార్చడానికి పెద్దగా ప్రయత్నించింది కూడా ఏమీ లేదు… పవన్ కల్యాణ్ కూడా బన్నీ మీద ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడలేదు ఇప్పటికి… కాకపోతే చిరంజీవి పుష్ప టీమ్‌ను ఇంటికి పిలిచి అభినందించడం సరైన చర్యే… అల్లు అర్జున్ వెళ్లి ఉంటే ఈ మంటలు, ఈ వైరానికి తాత్కాలికంగా విరామం పడేదేమో…
చిరంజీవి పిలిచాడో లేదో, పిలిచినా అర్జున్ వెళ్లలేదో తెలియదు… ఓ సందర్భం చూసి చిరంజీవే మెగా, అల్లు కుటుంబ సభ్యులందరినీ పిలిచి, ఓ ఆత్మీయ భేటీ నిర్వహిస్తే… ఆ ఫోటోలు, ఆ వీడియోలు జనంలోకి వెళ్తే ఈ ఫ్యాన్స్ తన్నులాటలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో..!!
Share this Article