Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది గుంటూరోళ్ల సినిమా… కృష్ణ- శ్రీదేవి జోడీ విహారానికి ఆరంభం…

November 3, 2024 by M S R

ఇది గుంటూరు జిల్లా వాళ్ళ సినిమా . ఈ టైటిల్ని ఎంచుకున్నందుకు హీరో కృష్ణని , నిర్మాత దర్శకులను మెచ్చుకోవాలి . బుర్రిపాలెం నుండి బయలుదేరిన హీరో కృష్ణ తాను పుట్టిపెరిగిన ఊరి పేరు కలకాలం సినిమా ప్రపంచంలో నిలిచిపోయేలా ఈ టైటిల్ని ఎంచుకున్నారు .

బుర్రిపాలెం గుంటూరు జిల్లాలోని తెనాలి పక్కన . అష్టకష్టాలు పడి ఈ సినిమాను దర్శకుడిగా పూర్తి చేసిన బీరం మస్తాన్ రావు  గుంటూరు వాడు . సినిమా ఔట్ డోర్ షూటింగ్ చాలా వరకు బుర్రిపాలెంలో తీసారు . ఇంక ఈ బుర్రిపాలెం బుల్లోడు సినిమా గుంటూరు జిల్లా వాళ్ళది కాక మరి ఎవరిది అవుతుంది చెప్పండి .

కృష్ణ శ్రీదేవిల జోడీ ప్రభంజనం ఈ సినిమాతోనే మొదలయింది . ఈ సినిమా తర్వాత 30 సినిమాలలో కలిసి నటించారు . నవంబర్ 16 , 1979 న వచ్చిన ఈ సినిమా పూర్తి వినోదాత్మక చిత్రంగా హిట్టయింది . వంద రోజులు ఆడింది . కృష్ణ చాలా హుషారుగా , ఫుల్ జోషులో నటించిన సినిమా . శ్రీదేవి అల్లరి పిల్లగా చాలా హుషారుగా నటించింది . కృష్ణతో జోడి అందంగా ఉంటుంది .

Ads

ఈ సినిమా ప్లాట్ లైనుని బీరం మస్తాన్ రావు అందిస్తే జంధ్యాల , సత్యానందులు కధను తయారు చేసారు . జంధ్యాల డైలాగులను కూడా వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . పాటలను అన్నింటినీ వేటూరే వ్రాసారు .

బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడిన నా జీవన బృందావనిలో ఆమని హృదయంలో నిను చూసిన తొలి ఆశలు పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . బుర్రిపాలెం బుల్లివాణ్ణి నేనే , చిన్నది కాదమ్మో భల్ చిచ్చర పిడుగమ్మో పాటల్లో ఇద్దరూ ఇరగతీసారు .

ఈ సినిమాలో కృష్ణ లెక్చరర్ . శ్రీదేవి గేంగ్ టీజ్ చేసే పాట బాగా అల్లరిగా ఉంటుంది . పంతులు పంతులు పావు శేరు మెంతులు పాట హుషారుగా ఉంటుంది . ఈ సినిమాలో నాగభూషణం , అల్లు రామలింగయ్యలు మాడాలుగా మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు మా దగ్గర ఏముందో మీది మీదికొస్తారు అంటూ డాన్స్ చేసే గ్రూప్ డాన్స్ పాట ప్రత్యేకం . ఇంక జయమాలిని , కృష్ణల పాట లంగరు చిన లింగయ్య కూతుర్ని అబ్బయ్యా కోటిలింగాల రేవు కాడ జాతర్ని అబ్బయ్యా . ఇద్దరూ అదరగొట్టేస్తారు .

బీరం మస్తాన్ రావు కె బాపయ్య , కె రాఘవేంద్రరావుల శిష్యుడు . ఆ సెగ పాటల చిత్రీకరణలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది . ముఖ్యంగా నా జీవన బృందావనిలో ఆమని హృదయం పాట చిత్రీకరణలో రాఘవేంద్రరావు స్టైల్ కనిపిస్తుంది . సినిమాకు ఐకాన్ పాట .

కృష్ణ , శ్రీదేవిలతో పాటు సత్యనారాయణ , నాగభూషణం , పండరీబాయి , అల్లు రామలింగయ్య , గిరిబాబు , జయమాలిని ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో సత్యనారాయణ పాత్ర కీలకం . చాలా బాగా నటించారు . సినిమా , పాటలు యూట్యూబులో ఉన్నాయి .

కృష్ణ , శ్రీదేవి అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . పాటలన్నీ చాలా హుషారుగా ఉంటాయి . కృష్ణ అభిమానులు డాన్స్ చేస్తారు . A complete entertaining , feel good and musical hit . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు     (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions