కూల్ డ్రింక్స్ మంచివి కావు… ఎందుకు..? వాటిల్లో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటాయి కాబట్టి…! నిజానికి ఆ డ్రింక్స్ తయారీకి వాడే నీటిలోనే ఆ అవశేషాలు ఉంటాయి… మరీ అంత డేంజర్ కాదు… అలాంటి అవశేషాల్ని మనం కూరగాయలు, పంటల నుంచి కూడా స్వీకరిస్తున్నాం… తప్పనిసరై… కానీ కూల్ డ్రింక్స్‌లో ఉన్నది మరో విషం… కెఫిన్… నిజమే… మనం తాగే కాఫీలో ఉండే కెఫీనే…
మీరెప్పుడైనా థమ్సప్ వంటి డ్రింక్స్ ప్రకటనల కింద వివరణల వంటి డిస్‌క్లెయిమర్స్ పబ్లిష్ చేస్తారు… కనీకనిపించకుండా… అఫ్‌కోర్స్, కనిపించకూడదనే…! కొత్త థమ్సప్ చార్జ్ ప్రకటన దిగువన ఉంది గమనించండి… ‘‘ఇది కెఫినేటెడ్ పానీయం, ఒక సర్వింగులో 38.8 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది… (సర్వింగ్ అంటే 250 మిల్లీలీటర్లు…)… పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు, కెఫీన్ పడని సున్నితమైన వ్యక్తులకు ఇది సిఫారసు చేయబడదు… ప్రతిరోజూ 500 మిల్లీలీటర్లకు మించి ఉపయోగించరాదు’’ అని ఉంటుంది…
ఎందరికి తెలుసు ఈ విషయం… ఈ విషం..! లీటర్ల కొద్దీ తాగేస్తూనే ఉన్నారు… లీటర్ల కొద్దీ డ్రింక్ ఇంటికి తీసుకురావడం, అదొక అలవాటుగా తాగేయడం… ఇక పార్టీల్లో చెప్పనక్కరలేదు… అంటే ఎంత విషాన్ని మనం మన దేహాల్లోకి పంపిస్తున్నట్టు..?! ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఆరోగ్యవంతులైన మనుషులకు కూడా రోజుకు హాఫ్ లీటర్ కూల్ డ్రింక్ కూడా హానికరమే…!!
Ads
Though adults can safely consume up to 400 mg of caffeine per day, according to the Mayo Clinic, kids and teens age 12-18 should limit their intake to 100 mg per day. The American Academy of Pediatrics (AAP) recommends that children younger than 12 should not consume caffeine at all….
చదివారు కదా… అసలు 12 ఏళ్ల లోపు పిల్లలకు కెఫిన్ అలవాటు చేయడమే ప్రమాదకరం అంటున్నాయి నిపుణుల సంఘాలు… 10 మిల్లీ గ్రాములా, 20 మిల్లీ గ్రాములా లెక్కే అనవసరం… అది ఏ మోతాదైనా సరే, అది పిల్లల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని తేల్చిచెబుతున్నాయి…
కొన్ని ఎనర్జీ డ్రింక్స్‌లో ఏకంగా 500 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుందట… ఇక అవి పిల్లలకు ఏ రీతిలో ప్రమాదకరమో మీరే ఆలోచించండి… గర్భిణులు, మహిళలు, వృద్ధుల సంగతి అటుంచితే మంచి స్టామినా ఉన్న యువ పురుషులకు కూడా 400 మిల్లీగ్రాముల కెఫీన్ దాటితే డేంజర్ అట… రోజువారీ కాఫీ సేవనంతో ఎంత శరీరంలోకి చేరుతుందో పక్కన పెడితే… ఒకే ఒక్క కాన్సంట్రేటెడ్ ఎనర్జీ డ్రింక్ కూడా నష్టదాయకమే అన్నమాట…
కొందరు పేరుకు మద్యం సేవించరు… కానీ పబ్బుల్లో, క్లబ్బుల్లో, పార్టీల్లో టిన్లకు టిన్నులు ఎనర్జీ డ్రింక్స్ సేవిస్తుంటారు… ఈలెక్కన ఎంత విషాన్ని వాళ్లు చేజేతులా దేహంలోకి పంపిస్తున్నట్టు… నిజానికి ఎనర్జీ డ్రింక్స్‌కన్నా ఒక కోణంలో మద్యం బెటర్… (అఫ్ కోర్స్, మద్యం ఎలా డేంజరో, చుక్క మద్యం కూడా కేన్సర్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో WHO మొన్న ఏదో ప్రకటనలో హెచ్చరించింది తెలుసు కదా… అది వేరే కథ… ) చాలామందికి జీర్ణం కాని విషయం ఏమిటంటే… ఈ డ్రగ్స్, ఈ మద్యం, ఈ ఎనర్జీ డ్రింక్స్‌కన్నా మోతాదు మించని గంజాయి చాలా నయం… అది ఇంకో కథ…
కొందరు ఆధునిక తల్లులైతే గ్రైప్ వాటర్ పట్టించినట్టే పసిపిల్లలకు కూడా ఆనందంగా కూల్ డ్రింక్స్ అలవాటు చేస్తుంటారు… మరి ఇలాంటి డ్రింక్స్‌ను మన హీరోలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు..? మీడియా ఆ ప్రకటనల్ని ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాయి..? ప్రభుత్వం ఎందుకు చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది… డబ్బులు… డబ్బులు… ప్రజారోగ్యం ఎవడికి కావాలి..?!
Share this Article