ఓటీటీల్లో ఎప్పుడైనా చూడదగిన వెబ్ సీరీస్, సినిమాలు వంటి కంటెంటు మాత్రమే ఉండాలని ఏముంది..? టీవీల్లో వచ్చే రియాలిటీ షోలు కూడా రన్ చేయొచ్చు… ఎస్, తెలుగు వినోద చానెళ్లలో వచ్చే మ్యూజిక్, కామెడీ, డాన్స్, కుకింగ్, ఫన్నీ గేమ్స్, చిట్‌చాట్ వంటి అన్ని అంశాల రియాలిటీ షోలను ఆహా ఓటీటీ వాళ్లు అడాప్ట్ చేసేసుకుంటున్నారు… ఏమాటకామాట… ఖర్చు బాగానే పెడుతున్నారు… మెయిన్ స్ట్రీమ్ టీవీ చానెళ్లలోకన్నా నాణ్యతతో షోలు రన్ చేస్తున్నారు…
మంచి ఉదాహరణ… కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్… నిజానికి జబర్దస్త్ తరహాలో ఓ మూస ఫార్మాట్‌కు పోలేదు… ఈటీవీని కాపీ కొట్టి ఆల్‌రెడీ మాటీవీ, జీటీవీ చేతులు, మూతులు కాల్చుకున్నయ్… స్టాండప్ కామెడీ ప్లస్ గ్రూప్ కామెడీని కొత్త తరహాలో ప్రజెంట్ చేస్తున్నారు… నిజానికి స్టాండప్ కామెడీ షోను ఈటీవీ ప్లస్‌లో జాతిరత్నాలు పేరిట రన్ చేస్తున్నారు… కానీ పరమ నాసిరకం… దాంతో ఆహా వాళ్ల కామెడీ స్టాక్ షోను పోల్చలేం…
ఇందులో సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి హోస్టులు… ఏకంగా దర్శకుడు అనిల్ రావిపూడిని మెయిన్ జడ్జి కుర్చీలో కూర్చోబెట్టారు… (చైర్మన్ పోస్టు)… ఫస్ట్ ఎపిసోడ్‌లో మెరిట్ ఉన్న కమెడియన్లు వేణు, అవినాష్, సద్దాం తదితరులు ఇరగదీశారు… రాను రాను ఎలా ఉంటుందో చెప్పలేం గానీ లాంచింగ్ పర్లేదు… అసలు కామెడీ ఫార్మాట్ మార్చడమే దాని సక్సెస్‌కు బాటలు వేసినట్టు… జస్ట్, జబర్దస్త్‌లో ఉన్నట్టు ర్యాగింగులు, బాడీ షేమింగులు, బూతులు, అసభ్యత లేకుండా చూడగలిగితే చాలు…
Ads
ఖర్చుకు వెనకాడటం లేదు… ఇండియన్ ఐడల్ షోకు థమన్, శ్రీరామచంద్ర, నిత్యామేనన్, సింగర్ కార్తీక్‌ల సేవల్ని వాడుకున్నారు… హిట్ షో… డాన్స్ ఐకాన్ కూడా ఇతర డాన్స్ షోలతో పోలిస్తే నాణ్యతతో ఉన్నట్టు అనిపించింది… ఏకంగా రమ్యకృష్ణను పట్టుకొచ్చారు ఈ షో కోసం… శేఖర్ మాస్టర్, ఓంకార్, మోనాల్ తదితరులు సరేసరి… ఎవరికీ తక్కువ రెమ్యునరేషన్లు ఉండవు… ఐనా అల్లు అరవింద్ భరిస్తున్నాడు…
ఇక అన్‌స్టాపబుల్ వేరే లెవల్… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… బాలయ్య ఆ చాట్ షోకు పర్‌ఫెక్ట్ న్యాయం చేశాడు… ఎటొచ్చీ సెకండ్ సీజన్ గాడితప్పింది పలురకాలుగా… అఫ్‌కోర్స్, చక్కదిద్దుతారేమో… చెఫ్ మంత్ర అనే వంటల ప్రోగ్రామ్‌ను మంచు లక్ష్మి కూల్‌గా చేసుకుంటూ పోతోంది… దానికంటూ ఓ సెక్షన్ వ్యూయర్స్ ఉంటారు… కాకపోతే యాంకర్ ప్రదీప్‌తో చేసిన సర్కార్ మాత్రం పెద్ద ఇంప్రెసివ్ అనిపించలేదు… పైగా రెండు సీజన్లు… ఓ పనిచేయండి అల్లు అరవింద్ భయ్యా… స్టార్‌మాటీవీలో బిగ్‌బాస్ షో చిరాకుగా ఉంది… రేటింగ్స్ లేవు… పరమ దరిద్రంగా ఉంది ఈసారి సీజన్… అలాంటిది ప్లాన్ చేయండి… కాకపోతే కాస్త కొత్తదనం… కంటెస్టెంట్లను మారుమూల తండాల్లో వదిలేసి, 100 రోజులు ఉంచేయడం వంటివి… లేదా రిస్కీ సాహసయాత్రలు… అదీ రియాలిటీ షోలలో టీవీలతో పోటీపడటం అంటే… కెన్ యూ..?!
Share this Article