Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి కేఏపాల్‌కే దక్కలేదు… సీనియర్ నరేష్‌కు సగౌరవంగా దక్కింది…

March 2, 2022 by M S R

ఓ ట్వీట్ కనిపించింది… మన సినిమాల్లో నటిస్తుంటాడు కదా… నరేష్… సీనియర్ నరేష్ అంటుంటారు కదా… విజయనిర్మల కొడుకు… సూపర్ స్టార్ కృష్ణకు కొడుకులాంటివాడు… ఆ ట్వీట్‌లో ఏమన్నాడంటే… ‘‘నైక్ ఎయిర్ షూస్ కోసం గంట సేపట్నుంచి తిరుపతిలో తిరుగుతున్నా, కానీ దొరకడం లేదు, మళ్లీ హైదరాబాద్ వెళ్లాల్సిందే ఇక వీటికోసం…’’ నెటిజన్లు రకరకాలుగా ఈ ట్వీట్‌ను ట్రోల్ చేస్తున్నారు… మనం ఇప్పుడు వాటిల్లోకి పోవడం లేదు… కానీ…

ఆ ట్వీట్‌లో ఆకర్షించింది ఏమిటంటే… తన పేరుకు ముందు ఉన్న అక్షరాలు… హెచ్.ఈ… డీఆర్… వీకే అంటే తన ఒంటిపేరులో భాగం… యాక్టర్ తన వృత్తి… అవి వదిలేస్తే ఈ హెచ్.ఈ, డీఆర్ ఏమిటి..? సాధారణంగా మన సొసైటీలో బాగా అధికారిక మర్యాదలు దక్కాల్సిన వాళ్లకు, ఉన్నత పోస్టుల్లో ఉన్నవాళ్లను పేరుకు ముందు హిజ్ ఎక్సలెన్సీ అని వ్యవహరిస్తుంటాం… రాస్తుంటాం… ఉదాహరణకు గవర్నర్లు గట్రా… అలా వాడేందుకు కూడా నిర్ణీత ప్రొటోకాల్ ఉంటుంది… మరి ఈ నరేషుడు ఇలా ఎలా రాసుకున్నాడు..?

naresh

Ads

ఇప్పుడే కాదు, ఎప్పుడూ అలాగే రాసుకుంటాడు… అప్పట్లో చంద్రబాబుకు మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హోదాలో రాసిన లెటర్ ప్యాడ్ చూడండి… దిగువన సంతకం పెట్టే దగ్గర కూడా ఈ హెచ్.ఈ పెట్టేశాడు… మరి ఇంతకీ ఈయన హిజ్ ఎక్సలెన్సీ అనిపించుకునే ఏ పోస్టులో ఉన్నాడు..?

maa

ఏమీ లేదు… వికీపీడియాలో ఓ వివరణ కనిపిస్తుంది… 2018లో ఐసీడీఆర్‌హెచ్‌ఆర్‌పీ (international-commission-of-diplomatic-relations-human-rights-and-peace) నుంచి హిజ్ ఎక్సలెన్సీ టైటిల్ మరియు పీహెచ్‌డీ పొందాడట… అది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థ అట… ఓహో, ఐరాస ఈ దందాలు కూడా చేస్తుందా..? ఎవరికైనా సరే, ఇలా హిజ్ ఎక్సలెన్సీ టైటిళ్లు ఇచ్చేస్తుందా..?

ఇదేదో తేడాగా ఉన్నట్టుంది అని చెక్ చేస్తే… సదరు సంస్థ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే… వెంటనే యాంటీ వైరస్ దాన్ని ఓపెన్ చేయకుండా అడ్డుపడింది… అంతటి ప్రమాదకరమైన సైట్ అట… licensed Commission of International Diplomacy of this Independent Sovereign Inter Governmental Organization, with universal jurisdiction of the international law, Consisting of Sovereign subjects of international law, thereby processing inherent capacity for diplomatic relations అని ఇంగ్లిష్ వివరణ… సదరు సంస్థ చీఫ్ కూడా దీన్ని అర్థమయ్యేలా చెప్పగలడు అనుకోను…

ఐనా… మానవ హక్కులు, దేశాల దౌత్య సంబంధాలు, శాంతి కోసం ఈయన ఉద్దరించింది ఏముందని సదరు సంస్థ ఆ కిరీటం పెట్టింది..? ఈయన ఇప్పుడు ఏ పార్టీయో తెలియదు గానీ కొన్నాళ్లు బీజేపీలో మాత్రం ఉన్నాడు… (ఇలాంటి టైటిళ్లు ఇస్తే గిస్తే కేఏపాల్ గట్రా ఎన్ని కేరక్టర్లు లేవు..?) అప్పుడు ఏమైనా విశ్వశాంతి కోసం, మానవ హక్కుల కోసం ప్రపంచ స్థాయిలో బాగా పాటుపడి ఉంటాడా..? కావచ్చు… అవునూ, ఇదంతా బాగా ఖర్చయ్యే వ్యవహారమా హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ నరేష్ వీకే గారూ…?! చివరగా చిన్న సూచన :: హిజ్ ఎక్సలెన్సీ అనే పదాల్ని ఎవరైనా మనల్ని ఉద్దేశించి గౌరవించే పదాలు… అదీ అర్హులయితేనే… అంతేతప్ప మనకు మనమే రాసుకుని, మనమే తొడుక్కునే, రాసుకునే భుజకీర్తులు కావు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions