.
. ( జగన్నాథ్ గౌడ్ ) .. …. డోనాల్డ్ ట్రంప్ ఆధునిక అలెగ్జాండర్ అవుతాడా..?
జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్య రెండింటి మీద కన్ను వేశాడు.
1. గ్రీన్ ల్యాండ్ దేశం
2. పనామా కాలువ
Ads
గ్రీన్ ల్యాండ్ అనేది విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో 12 వ అతిపెద్ద దేశం, అంటే గ్రేట్ బ్రిటన్ కంటే 10 రెట్లు పెద్దది. కానీ జనాభా 60 వేలు. అంతే.., అంటే కొండాపూర్ కంటే కూడా తక్కువ.
ఉత్తర ధ్రువానికి ఆనుకునే ఉండే ఈ అతి పెద్ద ద్వీప దేశం అత్యంత శీతలమైనది. 80% భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది కానీ అపారమైన ఖనిజాలు, లోహాలు ఉన్న దేశం. పైకి మాత్రం భవిష్యత్ లో చైనా, రష్యా నుంచి రక్షించుకోవాటానికి విమాన స్థావరాల కోసం, నావికా స్థావరాల కోసం స్ట్రాటజిక్ గా అమెరికాకి ఉపయోగపడుతుంది,
అందుకే మేం గ్రీన్ ల్యాండ్ దేశాన్ని కొంటాం అని చెప్తున్నాడు. ఒకవేళ అమెరికా గ్రీన్ ల్యాండ్ ని స్వాధీనం చేసుకుంటే ఇంకో లక్ష సంవత్సరాల వరకు అమెరికాకి ఎలక్ట్రిసిటీ సమస్య ఉండదు మరియూ అమెరికానే ఇంకో లక్ష సంవత్సరాల వరకు అగ్రరాజ్యంగా ఉండగలదు. కారణం అపారమైన యురేనియం మరియూ అత్యంత విలువైన లోహాలు, ఖనిజాలు ఉన్న ప్రాంతం గ్రీన్ ల్యాండ్.
యురేనియం ఉపయోగించి న్యూక్లియర్ పవర్ సహాయంతో ఎలెక్ట్రిసిటీ మరియూ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయొచ్చు. ఇంకా అధునాతన టెక్నాలజీకి అవసరమయ్యే అన్ని లోహాలు, ఖనిజాలు గ్రీన్ ల్యాండ్ లో లభ్యమవుతాయి.
అలెగ్జాండర్ అంటే ప్రపంచాన్ని జయించటానికి చాలా రాజ్యాల మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ దేశాన్ని స్వాధీనం చేసుకుంటే చాలు, ప్రపంచాన్ని అంతా అమెరికా గుప్పెట్లో ఇంకో లక్ష సంవత్సరాలు ఉంటుంది.
పనామా దేశంలో ఒక 80 కిలోమీటర్ల కాలువ – పనామా కాలువ. కానీ ఈ చిన్న కాలువ వలన పెద్ద పెద్ద ఓడలకి, నౌకలకి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది. పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది ఈ కాలువ.
అమెరికా తూర్పు వైపు నుంచి పశ్చిమం వైపు ఓడలు, నౌకల ద్వారా రవాణా జరగాలంటే దక్షిణ అమెరికా చుట్టూ తిరిగి రావాలి. కానీ ఈ కాలువ త్రవ్వటం వలన దాదాపు 10,000 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది. ఓడలు, నౌకలు ద్వారా జరిగే అంతర్జాతీయ వ్యాపారం లో దాదాపు 10% ఈ చిన్న కాలువ ద్వారా జరుగుతుంది.
అమెరికా చాలా సుంకాలు కట్టి తమ సరుకు రవాణా చేస్తుంది. ఈ ఒక్క కాలువ దగ్గర సుంకాలు కట్టకుండా తమ రవాణా చేసుకోగలిగితే అమెరికా వ్యయం చాలా తగ్గుతుంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ పనామా కాలువ మాకు కావాలి, అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించి అయినా ఆ కాలువని దక్కించుకుంటాం అని ఘీంకరిస్తున్నాడు.
చైనా వాళ్ళు ఈ పనామా కాలువ ద్వారానే ఉత్తర అమెరికాకి, దక్షిణ అమెరికాకి తమ సరుకు రవాణా చేస్తున్నారు. రెండు ఓడ రేవులని కూడా కట్టించారు చైనా వాళ్ళు పనామాకి దగ్గర్లో. ఇంకా పసిఫిక్ మరియూ అట్లాంటిక్ మహాసముద్రాల మీద చైనాకి గట్టి పట్టు ఉంది.
డోనాల్డ్ ట్రంప్ ఒకవేళ పనామా కాలువని చేజిక్కించుకోగలిగినా ఇంకో పది వేల సంవత్సరాల వరకు అమెరికా నే అగ్ర రాజ్యంగా కొనసాగుతుంది, ప్రధానంగా పసిఫిక్ మరియూ అట్లాంటిక్ మహాసముద్రాల మీద చైనా మీద పై చేయి సాధిస్తుంది, ఇంకా సుంకాలు కట్టకుండా తమ సరుకు రవాణా అవుతుంది, ఇతర ఖండాలకి తమ సరుకు ఎగుమతి అవుతుంది….. – రోమన్ తత్వవేత్త
Share this Article