…… నిజమే… కేసీయార్ చెప్పినట్టు బీజేపీపై యుద్ధం చేయాల్సిందే… అందరమూ సమర్థించాల్సిందే… అది కేసీయార్ మీద ప్రేమతోనే కానవసరం లేదు… బీజేపీకి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి… కాంగ్రెస్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది… కానీ ఇప్పటికీ నార్తరన్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దానికి ఉన్న కేడర్ సామాన్యం కాదు… బీజేపీ మీద వ్యతిరేకత పెరిగితే ఏం జరుగుతుందో పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక చెప్పాయి… సరే, అందులో ఎన్ని చేజారిపోయాయి అనేది వేరే విషయం…
కానీ ఒక జాతీయ పార్టీకి ప్రత్యామ్నాయం మరో జాతీయ పార్టీ అవుతుందే తప్ప… ప్రాంతీయ పార్టీల కూటమి పరిష్కారం కాదు, ప్రత్యామ్నాయమూ కాదు, అసలు దేశప్రజలకు ప్రాంతీయ పార్టీల మీద నమ్మకమూ లేదు… కుటుంబం, బంధుప్రీతి, అవినీతి గట్రా చాలా కారణాలున్నయ్… లెఫ్ట్ పని అయిపోయింది… కాంగ్రెస్ చేతకావడం లేదు… మరెలా..? ఇదే అసలు ప్రశ్న…
కేసీయార్ ఘడియఘడియకూ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి అంటాడే తప్ప… తను సీరియస్‌గా అందులోకి దిగేదీ లేదు… ఇప్పుడు చెబుతున్న డిసెంబర్ భేటీ కూడా జరిగేదీ లేదు… గ్రేటర్ ఎన్నికల తరువాత అన్నీ గాయబ్… అన్నింటికీ మించి తనను మమత, స్టాలిన్, కేజ్రీవాల్, అఖిలేష్ నమ్మాలని కూడా ఏమీలేదు… ఎవరి ప్రయోజనాలు వాళ్లకుంటయ్… ఏ రాష్ట్ర పరిస్థితులు ఆ రాష్ట్రానికే యూనిక్.,. పైగా అందరూ లీడర్షిప్ కోరుకునేవాళ్లే… కేసీయార్ పిలవగానే వచ్చేసి, మోడీ మీద జంగ్ సైరన్ ఏమీ మోగించరు వాళ్లు…
Ads
ఇప్పుడే చంద్రబాబు మీదకు మన ఆలోచనలు మళ్లుతయ్… జగన్ దెబ్బకు కుదేలైపోయి, చిన్నాచితకా ఏపీ ఇష్యూస్ మీద కాన్సంట్రేట్ చేస్తూ, ఏవో తిప్పలు పడుతున్నాడు గానీ… తను సీరియస్ ఎఫర్ట్ పెడితే… కేసీయార్ చెప్పే ప్రాంతీయ పార్టీల సమాఖ్యను తను సాకారం చేయగలడు… కానీ బాగా డిమోరల్ అయి ఉన్నాడు…
నిజంగానే తను గత ఎన్నికల్లో తన ఓటమి తీవ్రతను మరిచిపోయి, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఏదైనా చేయగలడు… కానీ భయం..? ఇదే అదునుగా మోడీ కొరడా తీసుకుని వెంటపడతాడేమో అని సందేహం… అందుకే ఫుల్ డిఫెన్సులో పడిపోయాడు… నిజానికి తనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలను ఒక్క బ్యానర్ కిందకు సమీకరించే శక్తియుక్తులు ఉన్నయ్… కానీ కేసీయార్, జగన్ దెబ్బలకు ఆత్మవిశ్వాసం కోల్పోయాడు… అడుగు ముందుకేయలేని దురవస్థ…
తనకు ఏపీలో ఓ స్ట్రాంగ్ బేస్ ఉండి ఉంటే, తను ధైర్యంగా ముందుకు అడుగులు వేసేవాడేమో… కానీ ఏపీలో బేస్ కకావికలం అయిపోతోంది… చిన్న చిన్న ఇష్యూస్‌కు తన శక్తిని వృథా చేస్తున్నాడే తప్ప… జాతీయ స్థాయి ఆలోచనలు, ఆచరణ జోలికి పోవడం లేదు… మరి బీజేపికి ఆల్టర్నేట్ ఏముంది..? ఏమీలేదు… ప్రస్తుతానికి కాంగ్రెస్ చక్కబడాలని ఆశించడమే తప్ప ఇక యాంటీ-బీజేపీ ఆలోచనపరులు ఆశపడటానికి ఏమీ లేదు… అది ఒక రియాలిటీ… కాదు, అదే రియాలిటీ….
Share this Article