.
ముందుగా ఓ వార్త చదువుదాం… పడీ పడీ నవ్వుకోకుండా కాస్త తమాయించుకుంటూ, ముందైతే చదవండి…
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు…
Ads
బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు…
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించామని… ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు…
వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు…
రెడ్డి గారూ… అదే నిజమైతే సోకాల్డ్ రేవంత్ రెడ్డిలు, తెలంగాణ ముఖ్యమంత్రులు కావాలని ఆశపడే కేటీయార్‌లు, హరీశ్‌లు, పాత ముఖ్యమంత్రి కేసీయార్, కవిత ఎట్సెట్రా అందరూ రాజకీయాల్లో నుంచి రిటైర్ కావడం బెటర్…
మరీ ముఖ్యంగా కేసీయార్… నేను తోపు, నేను తురుము… అంతటి కూలేశ్వరాన్ని రెండుమూడేళ్లలో కంప్లీట్ చేశాను అంటాడు కదా… నదికి కొత్త నడకలు నేర్పిన ట్రెండీ భగీరథుడిని అంటాడు కదా… మరెందుకు ఈ ఉప్పల్ ప్రాజెక్టును మరిచిపోయాడు..? జాన్‌జిగ్రీ దోస్త కిషన్ రెడ్డి కోసమా..,?
కంట్రాక్టులు, కమీషన్లు దంచుకోవడమే మాత్రమే ప్రజాసేవ, రాజకీయాలు అన్నట్టుగా తయారైన ఈ రోజుల్లో…. ది గ్రేట్ గడ్కరీ నితినుడు ఈ ఒక్క చిల్లర ప్రాజెక్టుపై ఎందుకు చేతులెత్తేశాడు..? ఎంటైర్ తెలంగాణ బీజేపీ తలవంచుకుంది ఇన్నేళ్లూ ఎందుకు…?
ఎస్, తెలంగాణ సమాజం ది గ్రేట్ కోమటిరెడ్డికి ఓ పరీక్ష పెడుతోంది… నిజంగానే, నీకు చేతనైతే, వచ్చే దసరా నాటికి ఈ బృహత్తర, మెగా ప్రాజెక్టు గనుక పూర్తి చేయగలిగితే…. అర్జెంటుగా రాహుల్ గాంధీ అనే విజనరీ లీడర్ నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాడు…
ఏమో పొరపాటున తను పవర్‌లోకి వస్తే గనుక నిన్ను రైల్వే, రోడ్డు, ఎయిర్ రవాణాలకు సంయుక్త మంత్రిని చేస్తాడేమో… ఫాఫం… బొడ్రాయి గనుక ఉండి ఉంటే, ఎంటైర్ ఉప్పల్ ఏరియా ఆ బొడ్రాయి పక్కన నీ విగ్రహం పెడతారు రెడ్డి గారూ… పక్కా…
ఏమో, సోకాల్డ్ తీన్మార్ మల్లన్న కూడా వచ్చి అలుముకుంటాడేమో నిన్ను… తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు అనే పద్యం గుర్తొస్తుందా..? అవును, ఇదీ ఓ అంతరిక్ష ప్రాజెక్టుకన్నా క్లిష్టం… నాకెందుకు బ్రదర్, ఆ దిక్కుమాలిన ఘనత ఏదో ది గ్రేట్ బీజేపీ కేంద్ర సర్కారే తీసుకోనీ… జై కిషన్ రెడ్డీ అని నిఖిల తెలంగాణాలోకం నినదించనీ… సోకాల్డ్ 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ ఏరియాకు వస్తే తలలు, కాలర్లు ఎత్తుకుని తిరగనీ అంటావా..? అలాంటప్పుడు ఈ వచ్చే దసరా చాలెంజులు విసరకూడదు… ఎందుకంటే..?
హైపర్ లూప్ ప్రాజెక్టులు అర్జెంటుగా చేపట్టి అమెరికాకు అరగంటలో వెళ్లొచ్చు… అంతెందుకు..? చంద్రుడిపైకి కూడా గంటన్నర సేపట్లో వెళ్లిరావచ్చు… నో, ఏనాటికీ పూర్తికాని, ఎవరూ చేయలేని… ది గ్రేట్ మోడీ, కేసీయార్, చంద్రబాబులకూ చేతకాని ఈ ఉప్పల్ ఫ్లై ఓవర్ మానవ నాగరికతకు, సాంకేతికతకు పెను సవాల్… అందుకే చాలెంజులు వద్దు సారూ…!!
Share this Article