ఒక చిన్న ప్రశ్న…. గత గ్రేటర్ ఎన్నికల ముందు విశ్వనగరం చేస్తా, స్వర్గాన్ని నేల మీదకు దింపుతా, అరచేతిలో వైకుంఠం చూపిస్తా వంటి ప్రామిసులు చేసిన కేసీయార్ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటూ అది ఫ్రీ, ఇది ఫ్రీ అని ఏదేదో చెప్పాడు… అయ్యా సారూ, నువ్వు ఏదీ చేయవు గానీ, నీ ఒవైసీ నువ్వూ కలిసి ఉద్దరించేది ఏమీ లేదు గానీ… ఆ ఎల్ఆర్ఎస్ రద్దు చేయగలవా అని అడుగుతున్నారు జనం… ఆ సెగ ప్రచారం కోసం వీథివీథి తిరుగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు నేరుగానే తగులుతోంది…
నేను పెద్ద హిందువునోచ్… నన్ను నమ్మండోచ్… కాకపోతే మా చినజియ్యర్ మీద, మా పెద్ద స్వరూపుడి మీద ఒట్టు దేవుడోయ్ అని చెప్పుకున్నా సరే… జనం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు… కాకపోతే అమరావతి ఇష్యూలో జగన్‌కు సపోర్ట్ చేస్తున్నదనే అంశంలో బీజేపీ పట్ల సెటిలర్స్‌లో బీజేపీ మీద కోపం కనిపిస్తోంది… కానీ అదే జగన్‌కు కేసీయార్ జాన్ జిగ్రీ కదా మరి… ఇదే బీజేపీకి జనసేన సపోర్ట్ కదా మరి… సో, సెటిలర్స్ మొగ్గు ఎటువైపో ఖండితంగా ఎటూ తేలడం లేదు…
ధరణి దారుణ ఫెయిల్యూర్, ఎల్ఆర్ఎస్… ఇవి నగరంలోని అనేకమందిని టీఆర్ఎస్ కు వ్యతిరేకులను చేశాయి… మజ్లిస్‌తో దోస్తీ సరేసరి… మొన్నటి వరదల్లో ఎవరూ పట్టించుకోని వైనం, వరదసాయం పేరిట అక్రమాలు, వోట్ల బేరాల్లాగే పంపిణీలు కూడా కొత్త వ్యతిరేకులను తయారు చేస్తున్నాయి… దీనికితోడు బీజేపీ అభ్యర్థులు ఈసారి ఇల్లిల్లూ తిరుగుతున్నారు… సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా పనిచేస్తోంది… దానికి కౌంటర్‌గా టీఆర్ఎస్ సోషల్ మీడియా కొత్త టీం కూడా బాగా పనిచేస్తోంది… కానీ..?
Ads
నగరమంతా ఫ్రీ వై-ఫై, నీళ్లు ఫ్రీ, సెలూన్లకు కరెంట్ ఫ్రీ వంటి వరాలు కురిపించాడు కేసీయార్… కానీ గత అయిదేళ్లలో ఇవన్నీ ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబు లేదు… మాట్లాడితే దుర్గం చెరువు వేలాడే వంతెన తప్ప ఇంకేముంది..? రోడ్డు మీదికొస్తే చాలు రకరకాల వయోలేషన్స్ చూపిస్తూ పోలీసులు వాహనదారులను వాయించి పడేస్తున్నారు… పాతబస్తీలో ఏమీ పనిచేయని రూల్స్ రెగ్యులేషన్స్ మాకే ఎందుకు అనేది ఇతర ప్రాంతాల కోపం… అసలు మేనిఫెస్టోలు చదివి, అర్థం చేసుకుని వోట్లేయడం అనేది నగరంలో ఏమీ ఉండదనేది ఓ సర్రియల్ ఫ్యాక్ట్… ఓ ఉదాహరణ ఏమిటంటే..? సెలూన్లకు చౌకకరెంటు అని గతంలోనూ చెప్పారు కదా, అమలైందా..? మరి మళ్లీ ఎందుకీ కొత్త హామీ… ఇలాగే…
ఇవి మొన్నటి ఎన్నికల ముందు కేసీయార్ చేసిన వాగ్దానాలే… సరే, ఎప్పుడైతే కాంగ్రెస్ బాగా దెబ్బతింటున్నదో, అది బీజేపీ వైపు పాజిటివ్ అవుతున్నది… మునుపు లేని జోష్ ఏదో వారిని కదిలిస్తోంది… బహుశా బీజేపీలోని కేసీయార్ మిత్రులు అనివార్యంగా తగ్గాల్సి రావడం వల్ల కావచ్చు… అయితే నో డౌట్… గ్రేటర్ ఎన్నిక నిజానికి నిఖార్సయిన ఎన్నిక కాదు… ఎక్స్ అఫిషియో వోట్లదే నిర్ణాయకశక్తి… జనం రెచ్చిపోయి ఏ ముప్ఫయ్యో నలభయ్యో, యాభయ్యో బీజేపీకి డివిజన్లు కట్టబెట్టినా సరే, ఆ మేయర్ పీఠం వాళ్లకేమీ దక్కదు… వందకుపైగా గెలిస్తే తప్ప ఆ కుర్చీ దొరకదు… సో, మజ్లిస్ చేయూతతో గానీ, సొంతంగానే గానీ మళ్లీ కేసీయార్ టిక్ పెట్టిన నాయకురాలే మేయర్ కుర్చీ ఎక్కడం ఖాయం... అయితే… గతంలో గెలిచిన 99 డివిజన్లకు ఏం తగ్గినా సరే… అది తనకు నామర్దాయే, అప్రతిష్టే… ఆ నంబర్ దాటగలడా..? ఎక్కడ ఆగిపోతాడు… మోడీ ఏ నంబర్ సాధిస్తాడు..? అదీ ఈ ఎన్నికలో అందరూ ఎదురు చూస్తున్న ఫలితం…
Share this Article