ఎన్నికలకు ఇన్నిరోజులు ముందుగా సర్వే అంటే… అది స్థూలంగా ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తుందే తప్ప, అవి యథాతథంగా ఎన్నికల్లో కనిపించాలని ఏమీ లేదు… అలాగే శాంపిల్ పరిమాణం, శాంపిల్ నాణ్యత, మిక్స్, ఖచ్చితత్వం కూడా ఏ సర్వేకైనా ముఖ్యం… ఇండియాటీవీ దేశ్‌కీఆవాజ్ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ సర్వే ఫలితాలను ప్రసారం చేస్తోంది… ఇది రాష్ట్రాల వారీగా వోట్ల శాతం తీసుకుని, వాటి ఆధారంగా సీట్లను అంచనా వేసింది…
అందుకే దాని ఖచ్చితత్వాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేం… ఒకటీరెండు శాతాల తేడాలే ఫలితాల్ని అటూఇటూ తిప్పేస్తుంటాయి… అయితే స్థూలంగా పైపైన చూసినప్పుడు, ప్రత్యేకించి సౌత్ స్టేట్స్ సర్వే ఫలితాలపై ఓ లుక్కు వేసినప్పుడు రఫ్‌గా ఈ సర్వే ప్రజల మూడ్‌కు తగినట్టే ఉందని అనుకుందాం… కానీ ఓవరాల్‌గా బీజేపీ సాధించగలదని చూపిస్తున్న సీట్ల సంఖ్య అసాధారణం అని కూడా అనిపిస్తోంది…
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 326 సీట్లు వస్తాయని ఈ సర్వే రిజల్ట్… మొత్తం ఎన్‌డీఏకు 362 సీట్లు… అదేసమయంలో యూపీయేకు 97 వస్తాయట… అందులో స్టాలిన్ వాటా 25 సీట్లు… కాంగ్రెస్ సొంతంగా కేవలం 39 సీట్లు మాత్రమే గెలుస్తుందట… అంటే దేశం ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ సాధించినట్టేనని, ఇన్నేళ్లుగా దేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇక నామావశిష్టమే అని ఈ సర్వే చెప్పదలిచిందా..? సర్వే ఉద్దేశమే అదా..?
Ads
ఎన్‌డీఏ, యూపీఏ గాకుండా ఉన్న ఇతర పార్టీలు 84 సీట్లు గెలుస్తాయట… అందులో మమత వాటాయే 26… అంటే చిన్నాచితకా పార్టీలన్నీ కలిపి, కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని ప్రయత్నించినా సరే… వాళ్ల సీట్ల సంఖ్యతో మోడీని కుర్చీ నుంచి కిందకు కూల్చేయడం సాధ్యం కాదు అని ఈ సర్వే చెబుతోంది… కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం…
మమత రాష్ట్రంలో బీజేపీ పప్పులు ఇప్పటికీ ఉడకడం లేదు… ఓ నాలుగు ఎంపీ సీట్లు ఎక్కువే గెలవబోతోంది మమత… అవి కోల్పోనుంది బీజేపీ… సీపీఎం పత్తా లేదు…
గుజరాత్, గోవా బీజేపీ స్వీప్… మహారాష్ట్రలో బీజేపీ ఎదిగి 48కు 26 సాధించొచ్చు… ఠాక్రే శివసేన 3, షిండే శివసేన 11 గెలుస్తాయి…
రాజస్థాన్ బీజేపీ స్వీప్… మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒకటి, బీజేపీ 28… చత్తీస్‌గఢ్‌లో బీజేపీ 10, కాంగ్రెస్ ఒకటి…
బీహార్‌లో 40 కు 21… జార్ఖండ్‌లో 14కు 13… ఒడిశాలో 21 కు 11…
హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ స్వీప్… పంజాబ్‌లో ఆప్‌కు 7 వస్తాయట, అదే సమయంలో ఢిల్లీలో బీజేపీ మొత్తం 7 సీట్లనూ కైవసం చేసుకోనుంది…
జమ్ము-కశ్మీర్‌లో బీజేపీ 3 సీట్లు… హర్యానాలో బీజేపీ 9, కాంగ్రెస్ ఒకటి… ఉత్తరాఖండ్ బీజేపీ స్వీప్…
ఇంట్రస్టింగ్ స్టేట్‌లో యూపీలో 80 కు 76 వస్తాయట… (మొన్నటికిమొన్న బీజేపీ చాలా అసెంబ్లీ సీట్లు కోల్పోయిందని గుర్తుంచుకోవాలి ఇక్కడ…) బీఎస్పీ జీరో… ఎస్పీ 2… కాంగ్రెస్ రెండు… ఎస్పీ ఇక కోలుకోదు… బీఎస్పీ చాప్టర్ దాదాపు క్లోజ్… గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ సూచనలు కనిపించాయి…
మరి సౌత్ మాటేమిటి..?
బీజేపీకి మింగుడుపడనిదే సౌత్ కదా… మరి రేపు..? అంతే… సేమ్… కాకపోతే కాస్త బెటర్… అదీ తెలంగాణలో… 17 సీట్లకు గాను టీఆర్ఎస్ 8, దాని దోస్త్ పార్టీ మజ్లిస్ ఒకటి… బీజేపీ 6, కాంగ్రెస్ ఒకటి… (ఒకటి తక్కువుంది సర్వే లెక్కల్లో…) మరీ కాంగ్రెస్ ఒకటికి పడిపోతుందా..? అది ఎందుకో నమ్మబుల్‌గా లేదు… కర్నాటకలో 28 కు బీజేపీకి 23, కాంగ్రెస్ 4, కుమారస్వామి ఒకటి… ఇక్కడ కూడా కాంగ్రెస్ అంత బలహీనంగా ఏమీ లేదు…
ఆంధ్రప్రదేశ్‌లో 19 వైసీపీ, టీడీపీ ఆరు… అంటే టీడీపీ పుంజుకుంటున్నట్టేనా..? జగన్ పాపులారిటీ పడిపోతోందా..? తమిళనాడులో మాత్రం స్టాలిన్ పాతుకుపోయినట్టే ఉన్నాడు… 39 సీట్లకు గాను 25 సీట్లు సొంతంగా గెలుచుకుంటాడట… 13 సీట్లు ఎఐఎండీకే, వస్తే గిస్తే బీజేపీకి ఒకటి… కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, ఇతర నాన్-బీజేపీ పార్టీలు స్వీప్ చేస్తాయి… బీజేపీ మళ్లీ తెల్లమొహం… సో, ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే..? సౌత్ ఇప్పటికీ బీజేపీకి ప్రవేశం లేని దుర్గమే… మరి మిగతా సర్వే ఫలితాలు..? ముందే చెప్పుకున్నాం కదా… ఒపీనియన్ సర్వే ఫలితాలకు, అసలు ఫలితాలకు నడుమ బోలెడు తేడాలు ఉండే అవకాశాలే అధికం అని…!!
Share this Article