ప్రాణాలకు తెగించి లక్షలాది మంది ప్రజలు పారిపోతున్నారు, దేశాల ఎంబసీలు మూసేస్తున్నారు, ఆడవాళ్లు గజగజ వణికిపోతున్నారు… అప్పుడే ఆడవాళ్లపై తాలిబనిజం వార్తలు బయటికొస్తున్నాయి… ఒక చీకటియుగంలోని అప్ఘన్ వేగంగా నడుస్తోంది… అదంతా వోకే… అమెరికాకు ఓ చేదుమరక… బోలెడుమంది సైనికుల మరణం, బోలెడు డబ్బు నిరుపయోగం… ఇదీ సరే… పాకిస్థాన్ అర్జెంటుగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి రెడీ… చైనా తాలిబన్లతో దోస్తీకి రెడీ… రష్యా డబుల్ రెడీ… సో, ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త బెడద… కానీ ఎలాగూ భరించక, పోరాడక తప్పదు… పక్కలో బల్లేలు… అదేసమయంలో ఒకటి ఆశించాలి ఇండియా… ఓ భేదోపాయానికి పదును పెట్టాలి… దాని పేరు గ్రేటర్ అఫ్ఘనిస్తాన్… ఇది పాత భావనే… కానీ దానికిప్పుడు మెరుగుపెట్టాలి… అంతే… అసలేమిటి ఈ అఖండ అఫ్ఘనిస్తాన్, పోనీ పష్తూనిస్తాన్ అందాం… ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ గ్రేట్ అఫ్ఘనిస్తాన్ అందాం… ఇది అర్థం కావాలంటే… పాకిస్థాన్, చైనా, అప్ఘనిస్తాన్ బోర్డర్లు… పష్తూన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను గుర్తించాలి…
పైన మ్యాప్ చూడండి… పష్తూన్ల ఏరియాల్లోనే తాలిబన్ల ప్రాబల్యం… వాళ్లు అప్ఘనిస్తాన్‌లోనే కాదు… పాకిస్థాన్‌లోని కీలకప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉన్నారు… వాళ్లదే ప్రాబల్యం… అప్పట్లో ఏదో డ్యురాండ్ లైన్ అంటూ ఓ విభజన రేఖ గీసేసి, పాకిస్థాన్, అప్ఘనిస్తాన్ వేర్వేరు అన్నారు గానీ… ఈరోజుకూ వజిరిస్తాన్, ఖైబర్ కనుమలు గట్రా ఉగ్రవాదులదే రాజ్యం… పాకిస్థాన్‌ది నామ్‌కేవాస్తే పెత్తనమే… ప్రత్యేకించి గుట్టలు, కొండలతో నిండిన గిరిజన తెగల ప్రాంతాల్లో పాకిస్థాన్ అధికారం చెలాయింపు పెద్దగా ఏమీ ఉండదు… ఏళ్లుగా అమెరికా, నాటో దళాలు అప్ఘన్‌లో తిష్టవేసినా… తాలిబన్ల వ్యూహాత్మక ప్రాంతాల్లోకి పోయిందీ లేదు, పోరాడిందీ లేదు… అసలు ఆ భౌగోళిక సంక్లిష్టత, టెరేన్ అమెరికాకు అర్థమైతే కదా… తాలిబన్లు తమదైన కాలం వచ్చేవరకూ వెయిట్ చేశారు… వాళ్లకూ పోయిందేమీ లేదు… అనేక ప్రాంతాల్లో వాళ్లదే రాజ్యం… పన్నులు, ఓపియం, హెరాయిన్, ఇతర దేశాల నుంచి విరాళాలు, వసూళ్లు… వాళ్లు కూడా వేల కోట్ల బడ్జెట్‌తో ఓ దేశంలాగే చెలాయించారు… ఇప్పుడు ఏకంగా ఇక అప్ఘన్ మొత్తాన్ని మళ్లీ ఆక్రమించేశారు…
Ads
ఒకసారి విస్తరణ అంటూ స్టార్టయ్యాక తాలిబన్లు ఎక్కడివరకూ వ్యాపించాలని అనుకుంటారు అనేదే ఇప్పుడు ప్రశ్న… పాకిస్థాన్‌లాగా లిబరల్ ఇస్లామిక్ పాలసీలు కాదు… తాలిబనిజం అంటేనే పూర్తి ఇస్లామిక్ రాజ్య స్థాపన కోరుకునే సిద్ధాంతం… ఒకవేళ పష్తూన్లు అధికంగా ఉండే వజీరిస్థాన్, ఇతర గిరిజన ప్రాంతాల్ని ఆక్రమిస్తే… పాకిస్థాన్ చేయగలిగేది ఏమీ లేదు… నిజానికి అఖండ అప్ఘన్‌లో ఈ అంశమూ ఎంతోకాలంగా చర్చల్లో ఉన్నదే… అసలు తాలిబన్లు డ్యురాండ్ లైన్ గౌరవిస్తే కదా… అలాగే పాకిస్థాన్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్న బెలూచిస్తాన్‌కు కూడా తాలిబన్లు మద్దతు పలికితే… ఇక పాకిస్థాన్‌లో మిగిలేది పంజాబ్, సింధు ప్రాంతాలు… సో, ఇండియా కోరుకోవాల్సింది ఇదేనా..? వాడి ముడ్డి కింద సెగ తగిలితే తప్ప వాడికి బుద్ది రాదు అనుకోవాలా..? లేక అప్ఘన్లు మరింత బలపడకూడదని కోరుకోవాలా..?
అసలు కథ చైనాతో… అదిప్పుడు సంబరపడుతోంది… పాకిస్థాన్, రష్యా, చైనా కలిసి గంతులేస్తున్నయ్… అర్జెంటుగా తాలిబన్లను హత్తుకుంటున్నయ్… మన మంత్రి జైశంకర్, మన అజిత్ ధోవల్ దౌత్యాలు ఫెయిల్… చర్చలు, సంప్రదింపులు, అధికార మార్పిడి, బలగాల ఉపసంహరణ వంటి ఏ అంశంలోనూ మనల్ని తలదూర్చనివ్వడం లేదు మన చిరకాల మిత్రదేశం రష్యా…, కానీ ఒకవేళ తాలిబన్లు గనుక కాబూల్‌లో కాస్త స్థిరపడి, చైనా మీద కన్నేస్తే అప్పుడు ఉంటుంది తమాషా… పైన మ్యాప్ చూడండి… అప్ఘన్‌కూ చైనాకు మధ్య బోర్డర్… ఓ సన్నని వఖాన్ కారిడార్ అనే ప్యాసేజీ ఉంటుంది… అది నేరుగా చైనాలోని జింజియాంగ్ ప్రావిన్సులోకి దారి తీస్తుంది… ఆ ప్రావిన్సు కథ తెలిసిందే కదా… వుయ్‌గర్ ముస్లింలు ఎక్కువ… వాళ్లు ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారనే సందేహాంతో లక్షల మంది కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిర్బంధించి వాళ్లను చైనీకరిస్తోంది… వాళ్ల మెదళ్లను ట్యూన్ చేస్తోంది… అత్యాచారాలు, అరాచకాల మీద బోలెడు వార్తలు… ఈస్ట్ తుర్కిస్తాన్ దేశం కావాలని అక్కడ పోరాటం సాగుతోంది… East Turkistan Islamic Movement (ETIM)… వాళ్ల మీద తాలిబన్లకు సానుభూతి ఉంది… రేప్పొద్దున సహకారమూ అందుతుంది… అప్పుడు చైనా సీటు కింద కూడా సెగ గట్టిగానే తగులుతుంది… అయితే… ఇవన్నీ పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత కాశ్మీర్, మన కాశ్మీర్ పరిసరాలే… ఎటొచ్చీ తనకు అలవాటైన అప్ఘన్ రాజకీయం ప్లే చేస్తూ రష్యా కాస్త సేఫ్… ఎలాగూ ఇస్లామిక్ ప్రభావం ఉన్న తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి తన పాత ప్రాంతాలన్నీ ప్రత్యేక దేశాలయ్యాయి… అవే అప్ఘన్‌కూ రష్యాకు నడుమ ఉన్నయ్… అన్నట్టు… రష్యాకు, అప్ఘన్‌కూ నడుమ ఉండే తజికిస్థాన్ ఇండియాకు మిత్రదేశమే… ఆ దేశంతో తాలిబన్లకు పడదు… సో, ఆ ప్రాంత రాజకీయాల్లో మనకు అడ్డా ఆ దేశమే…!! ఇండియా విదేశాంగ విధానానికి ఇప్పుడు ఓ విషమ పరీక్ష… RAW ఏజెంట్ల సామర్థ్యానికి కొదువ లేదు, కానీ కావల్సింది సరైన డైరెక్షన్…!!
Share this Article