నాగార్జునలో ఉన్న బ్యూటీ ఏమిటంటే..? ఈ వయస్సులో కూడా ఆ స్టామినా మెయింటెయిన్ చేయడం ఒక్కటే కాదు… బిగ్‌బాస్ హౌజులో ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడా పొల్లు మాట మాట్లాడడు… కానీ కమాండ్ ఉంటుంది… నవ్వే చోట నవ్వుతూ, సీరియస్‌గా ఉండేచోట అలాగే ఉంటూ… సరదాగా ఆడిస్తూ… పర్‌ఫెక్ట్ ప్రోగ్రాం హోస్ట్ తను…
సీనియర్ నటుడు, ఓ స్టూడియో అధినేత, ఇద్దరు హీరోల తండ్రి, ఈరోజుకూ కాస్తోకూస్తో హీరోగా డిమాండ్… అలా సహజంగానే నాగార్జున మాట్లాడుతుంటే హౌజులో ఉన్న కంటెస్టెంట్లు గౌరవాన్ని ప్రదర్శిస్తారు… అంత పెద్ద హీరో తమతో కలుపుగోలుగా వ్యవహరించే తీరుకు ఆనందపడతారు… సో, తనేదో బిగ్‌బాస్ హోస్టుగా ఫెయిలయ్యాడంటే తనే కారణమని చెప్పడం కరెక్టు కాదు… అదంతా బిగ్‌బాస్ టీం నిర్వాకం…
చెత్తా టీం వర్క్‌తో, పనికిమాలిన క్రియేటివిటీతో బిగ్‌బాస్ షోను భ్రష్టుపట్టించింది ఎవరు అంటే… దాని టీం..! అందులో నాగార్జున తప్పేముంది..? ఒక సినిమాలో హీరో తను, నిర్మాత వేరు, దర్శకుడు వేరు, ఇదీ అంతే… కాకపోతే బిగ్‌బాస్‌తో తనకు వేరే అనుబంధం, ఆదాయం ఏమిటంటే..? తన స్టూడియోలో సెట్… హోస్టుగా తనకు డబ్బు, ఆ సెట్టుకు డబ్బు… అందుకని వరుసగా చేస్తూ వెళ్తున్నాడు… నిజానికి వచ్చే సీజన్‌కు కూడా తనే ఆప్ట్… హిందీలో 9 సీజన్ నుంచి ఇప్పటి 16 దాకా సల్మానుడే హోస్ట్… అంతటి అమితాబుడు ఒకే సీజన్ చేయగలిగాడు… ఇన్నేళ్లు కౌన్ బనేగా కరోడ్ పతి చేస్తున్నా సరే… ఒక ఓటీటీ షోను కరణ్ జోహార్ భ్రష్టుపట్టించాడు…
Ads
కన్నడంలో వరుసగా 9 సీజన్లను కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్నాడు… బిగ్‌బాస్ అంటే సుదీప్ అంతే… హోస్టింగ్ అంటే ఓ కళ… తమిళంలో వరుసగా ఆరు సీజన్లకూ హోస్ట్ కమల్‌హాసన్… మలయాళంలో వరుసగా నాలుగు సీజన్లకూ హోస్ట్ మోహన్‌లాల్… సో, హోస్ట్ ఎంపిక చాలా కీలకం…
థూ, ఈ చెత్త టీంతో నా ఇజ్జత్ పోతోంది అని గనుక నాగార్జున అనుకునే పక్షంలో… ప్రేక్షకులకు మొనాటనీ వస్తుంది, బోర్ ఫీలవుతున్నారు అనుకునే పక్షంలో… ఎవరు ఆల్టర్నేటివ్..? బిగ్‌బాస్ అసలు టీం ముంబైలో ఉంటుంది… ఇక్కడ కొందరిని పెట్టి ఆట నడిపిస్తుంది… మొత్తం స్క్రిప్టెడే… రెండో సీజన్ చేసిన నాని ఠారెత్తిపోయాడు… ఒక దశలో సీజన్ నడుస్తుండగానే, ఎందుకు ఒప్పుకున్నానురా బాబూ అన్నట్టుగా తన ఫ్రస్ట్రేషన్ కనిపించింది… అనుకున్నట్టే మూడో సీజన్‌కు మాయం… అంతకుముందు ఫస్ట్ సీజన్ చేసిన జూనియర్ కూడా అంతేకదా…
మీలో ఎవరు కోటీశ్వరులు షోను, అదీ జెమిని టీవీలో చేయడానికి సిద్ధపడ్డాడు తప్ప జూనియర్ మళ్లీ బిగ్‌బాస్ వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు… నిజానికి ఇప్పుడు వినిపిస్తున్నట్టు బాలయ్య గనుక షో హోస్ట్ అయితే బిగ్‌బాస్ టీంలో ఒకరిద్దరికి మూడినట్టే లెక్క… 10 కోట్లు remuneration… బాలయ్య పక్కా అని ఒక వార్త కనిపించింది….
ఆ లెక్కన నాగార్జున చాలా మర్యాదస్తుడు… రానా పేరు ఒకటి బాగా వినిపిస్తోంది… తను చేయగలడేమో… నంబర్ వన్ యారి పేరిట చాట్ షో చేశాడు కదా, అనుభవం ఉంది… కాకపోతే బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో డీల్ చేయడం వేరు, ఒక గెస్టును టాకిల్ చేయడం వేరు…
ఆఁ ఏముంది, ఎవరైనా చేయగలరు అనేది కరెక్టు కాదు… రకరకాల మనస్తత్వాలున్న కంటెస్టెంట్లు, బయటతో కమ్యూనికేషన్ లేకుండా ఒకే ఇంట్లో ఉండీ ఉండీ, కాస్త మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది… కొందరిని చూశాం కదా, నన్ను బయటికి పంపించండ్రోయ్ అని శోకాలు పెట్టినవాళ్లను… సో, హోస్ట్ కమాండింగ్ కేరక్టర్ అయి ఉండాలి… రానా సరిపోతాడా..? కొంత యాటిట్యూడ్ సమస్య ఉన్నా సరే విజయ్ దేవరకొండ వంటి హీరోలు సూటవుతారా..?
Share this Article