షర్మిలకు ఒక సూటి ప్రశ్న…. నీ నాన్న రాజన్నరాజ్యం రాలేదు నిజమే… అది తెలంగాణలో మాత్రమేనా..? ఏపీలో కూడానా..? తెలంగాణలో పార్టీ పెట్టి, పాపం, తెలంగాణీయులు వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతుంటే మళ్లీ ఎందుకు కెలుకుతున్నట్టు..? ఏపీలో అంతా బాగుందా..,? మరి ఒక్క మాట ఏపీలో రాజన్నరాజ్యం వచ్చేసింది, ఇక తెలంగాణలోనే నేను దాన్ని సాధిస్తాను అని చెప్పొచ్చుగా… అంతెందుకు..? జస్ట్, ఒక్క క్లారిటీ… సంగమేశ్వరం లిఫ్టు అక్రమమా.,.,? కాదా..? పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు అన్యాయమా కాదా..? అంతెందుకు..? కృష్ణాపరీవాహకంలో 69 శాతం తెలంగాణాలోనే, ఏపీలో జస్ట్, 31 శాతం… అందులోనూ రాయలసీమలో 10 శాతం కూడా లేదు అంటున్నాడు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్… అంటే ఇన్నేళ్లూ నోరుమూసుకున్న కేసీయార్ నామ్కేవాస్తే చెబుతున్న సగం సగం అనే వాటాలూ ఢోకాబాజీ దుర్మార్గమే అనుకోవాలా..? స్ట్రెయిటుగా చెప్పు షర్మిలక్కా…!! తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన వైఎస్ తెలంగాణ ఆత్మబాంధవుడెలా అయ్యాడో చెప్పు ప్లీజ్…!! ఈరోజు కేసీయార్‌కు నీ మాటలు రుచించవచ్చుగాక… కానీ తెలంగాణ సమాజానికి కాస్త కన్విన్సింగుగా చెప్పక్కా…!! తెలంగాణకు నేను అడ్డం కాదు, పొడుగు కాదు అని వెక్కిరించిన మీ డాడీని తెలంగాణ ఎందుకు ప్రేమించాలి సిస్టర్..? తెలంగాణ ద్రోహులందరూ కేసీయార్ దోస్తులే అని ఓ సామెత… ఆ సూత్రంలో ఇమిడ్చి, మాకు మేమే చప్పట్లు కొట్టుకుని, జైరాజన్నరాజ్యం అని నినదించాలా..?!
హహహ… చుక్క నీటినీ వదలం, అదే సమయంలో ఇతర రాష్ట్రాల ప్రయోజనాల్ని అడ్డుకోలేం అనే నీ మాట దగ్గరే అర్థమైపోయింది… నీ రూట్స్, నీ పార్టీ తెరవెనుక టార్గెట్లు… ఏదో కుట్రపూరితాలు అని..! అప్పట్లో కొబ్బరిచిప్పల సిద్ధాంతం వల్లించిన చంద్రబాబుకూ ఈ మాటలకూ తేడా ఏముందసలు..? నీకూ నీ అన్నకూ గొడవలొస్తే, ఏదో విడిపోయి సొంతంగా బతుకుతున్న తెలంగాణ మీద మళ్లీ ఈ ప్రయోగాలు ఏమిటసలు..? ఏపీలో కదా తేల్చుకోవల్సింది..?! ఒకరినొకరు అలుముకుని, స్వీట్లు తినిపించుకునే జగన్, కేసీయార్ రెండు నిమిషాలు నీటి పంచాయితీల మీద మాట్లాడుకోలేరా అని నిందించడం కాదు, అంత పెద్దవే రెండు నిమిషాల్లో పరిష్కారమైతే, అన్నాచెల్లెళ్లు ఒక్క నిమిషం మాట్లాడుకోలేరా..? అదే పీకే, తప్పుడు ప్రచారాలు, అబద్ధాలతో జనాన్ని మోసగించే పీకే… దేశానికి ఓ పెద్ద థ్రెట్ పీకే… ఇప్పుడు నీకూ, నీ అన్నకూ ప్రధాన వ్యూహకర్త… అటు తాడేపల్లి ఇంటికీ, ఇక్కడ లోటస్ పాండుకూ మధ్య సంధానకర్త తను కాదా..? ఆయన ప్రియశిష్యురాలు ప్రియ నీకు వ్యూహకర్త… అర్థం కావడం లేదా తెలంగాణ జనానికి..? కనిపించని కుట్ర ఏదో కమ్ముకొస్తున్నదని…!!
Ads
కేసీయార్ మోసగాడు సరే… మరి అప్పట్లో మీ అన్నను మానుకోట రాళ్లతో తరిమిన తెలంగాణ జనం, అనగా టీఆర్ఎస్ ప్రేరేపిత ఉద్యమం ఇప్పుడు నిన్నెందుకు ఉపేక్షిస్తున్నది..? ఒక్క మాటా ఎందుకు మాట్లాడటం లేదు..? అర్థమైపోవడం లేదా..? వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ దోస్తానా..? తెర వెనుక జగన్… జగన్ దోస్త్ కేసీయార్… తోడుగా జగత్ కంత్రీ పీకే… అర్థం కావడం లేదా..? తెలంగాణ మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, గాయకులు తమ ఆత్మల్ని, తమ వెన్నెముకల్ని అడ్డంగా అమ్మేసుకుని డప్పులు కొడుతున్నంత మాత్రాన ఇంతగా అపహాస్యం చేయాలా తెలంగాణ సమాజాన్ని..?! జనం ఎవడూ నమ్మడం లేదు అని మీలో మీరే అంచనా వేసేసుకుని, ఇప్పుడు మీ అనుకూల, పాకుడురాళ్లు, పాదపూజల నాసిరకం కులగజ్జి సైట్లతో మళ్లీ తప్పుడు ప్రచారాలు… అబ్బే, జగన్, షర్మిల ఒక్కటి కాదు… ఇద్దరికీ మాటల్లేవు తెలుసా..? ముఖాలు కూడా చూసుకోవడం లేదు తెలుసా..? సాక్షికి యాడ్ ఇవ్వకపోవడమే సాక్ష్యం, వైఎస్‌కు నివాళ్లు అర్పించే టైములు వేర్వేరు… జగన్‌కు ఆహ్వానం లేదు అంటూ..! జనం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నాలు దేనికి..?! తెలంగాణ సమాజాన్ని పకపకా తెరవెనుక నవ్వుతూ అపహాస్యం చేస్తున్నారా..? కేసీయార్, జగన్ కలిసి… షర్మిలను ముందుపెట్టి…!! ఒక ఆట… పబ్జీ…!!
కేసీయార్ తాపీగా ఇన్నేళ్ల తరువాత నిద్రలేవడమే ఓ ఎత్తుగడ… జగన్‌తో నీళ్ల పంచాయితీ ఓ ఎత్తుగడ… షర్మిల మాటల పట్ల మౌనమూ ఓ ఎత్తుగడ… ఆ ఎత్తుగడల నడుమ తెలంగాణ మోసపోతూనే ఉంది… అప్పుడు ఉమ్మడి పాలనలో… ఇప్పుడు సొంత పాలనలో…!! ఈరోజు తెలంగాణ మేధావులు, మీడియా అమ్ముడుపోవచ్చుగాక… పాలకుడి కాళ్ల మీద పడి పాకుతూ, నాకుతూ, దేకుతుండవచ్చుగాక… తరతరాలుగా తెలంగాణ అనేక కుట్రలకు వేదిక కావచ్చుగాక… వివక్షలకు, వెటకారాలకు, ఘోర అవమానాలకు బాధితురాలు కావచ్చుగాక… ఆ జాబితాలో తాజాగా కేసీయార్ కూడా చేరి ఉండవచ్చుగాక… కానీ వరుస పరిణామాలు, తాజా రాజకీయాలు, రాజన్నరాజ్యాలు, తెరవెనుక కుట్రలు… అర్థమయ్యే రోజు రాకపోతుందా..? ఆత్మలకు జవాబులు ఇచ్చుకోలేక, తెలంగాణ సోకాల్డ్ మోకాలిబుర్రలు సిగ్గుపడి, తమకుతామే అపరాధ భావనలతో ఉరేసుకోకపోతాయా..?
Share this Article