Gurram Seetaramulu………… నువ్వు పుట్టిన కులం నిషిద్దం అయినచోట , నువ్వు పెరిగిన ప్రాంతం పాప పంకిలం అయిన చోట, నువ్వెన్నుకున్న సహచరి అంతరం అయిన చోట. అసమ విలువల తూకంలో నీ లింగ బేధం అబేధ్యం అయిన చోట, గర్వం, గౌరవం, మదం, అహంకారం, అసహనం సర్వవ్యాప్తం అయిన చోట, పాపపు ( ప్రాయశ్చిత్త ) కథలకు చోటెక్కడ ? ఎక్కడ ఉన్నాయి ఈ మూలాలు ?
ఒక కుటుంబం మానం, గౌరవం, మర్యాద, వీటిని పెంచి పోషిస్తున్నది ఆడవాళ్లే. వాళ్ళ శరీరాలలో రెండుకాళ్ళ మధ్యలో, పై ఎదలలో, మొహంలో, మాటలో భద్రపరుస్తున్నారు… పైవి ఏవీ చెడిపోవద్దు, ఆచారాలు ఇలానే ఉండాలి అని సమాజం అంటుంది…. ప్రాణం అయినా పోవచ్చు కానీ మానం మాత్రం పోవడానికి వీలు లేదు”
Ads
ఇప్పుడు ఆ మానమే ఒక పెట్టుబడి. ఆ మానమే ఒక అమ్మకపు సరుకు, ఆ మానమే గౌరవం , అంతస్తు…
ఒక గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్ వీళ్ళ ముఖాలను తెరమీద చూపించి సినిమా తీయగలరా ?
ఎస్.. తమిళ సమాజం ఈ అంతరాలను ఎప్పుడో దాటేసింది…
సుధా కొంగర, వెట్రిమారన్, విజ్ఞేశ్ శివన్, గౌతం వాసుదేవ మీనన్ ఆ సాహసం చేసారు, వీలుంటే చూడండి…
అయినవారి బ్రతుకులు మహానటులుగా, కానివారి బ్రతుకులు డర్టీ పిక్చర్లుగా… సిగ్గులేకుండా వెండి తెరమీద ఊరేగుతున్న చోట… పిట్ట గూడు లాంటి విగ్గు పెట్టి, దూడ పెదాలు, దొడ్డికాళ్లు ఊపుకుంటూ, ఇంత పొట్ట ముందుకేసి, మనవరాలి వయసున్న పద్దెనిమిది ఏళ్ళ పడుచు పిల్ల బుగ్గల మీద చిటికెన వేలుతో కామపు చెమటను చిలకరిస్తూ, చిలక కొట్టుడు కొట్టిన ఎంబసైల్ గాళ్ళను తెలుగుతనానికి చిరునామా చేసిన చోట Paava Kadhaigal’ లాంటి పాపపు ( ప్రాయశ్చిత్త ) కథలను ఆశించడం అత్యాశనే …
Share this Article