Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సపోజ్ మీరు మర్యాద రామన్న అయితే… ఏం తీర్పు చెప్పేవాళ్లు..?!

January 2, 2022 by M S R

మన పాత కథల్లో బోలెడు నీతులు, లెక్కలు, సమీకరణాలు, జీవితసత్యాలు, తెలివిని పెంచే చిట్కాలు, మెళకువలు… ప్రత్యేకించి మర్యాద రామన్న కథలు వంటివి…. అలాంటిదే ఇది కూడా… ఒకవేళ మీరు మర్యాదరామన్న ప్లేసులో కూర్చుని ఉంటే ఏం తీర్పు చెప్పేవాళ్లో ఓసారి సీరియస్‌గా ఆలోచించండి… తరువాత తాపీగా అసలు తీర్పు, అందులోని లెక్క సారాంశం కూడా చదువుకోవచ్చు… ఎంతసేపూ దిక్కుమాలిన సీరియస్ కథనాలేనా..? ఓసారి ఇదీ టేస్ట్ చేయండి…


మిత్రుడు Sridhar Bollepalli  పోస్ట్ యథాతథంగా…



ఇదీ లెక్క

Ads

ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. “మీ ఇద్దరితో పాటు నేను కూడా కూర్చోవచ్చా” అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరూ “అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చో” అన్నారు. ముగ్గురూ కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలివాన మొదలయ్యింది. వాళ్లు ఇక అక్కడ నుంచి వెళ్లిపోలేకపోయారు.

ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. “మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. అతడి దగ్గర మూడు, నాదగ్గర ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం” అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

అందుకు మూడోవ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. “మొత్తం ఎనిమిది రొట్టెల్లో ఒక్కోదాన్నీ మూడు మూడు ముక్కలుగా చేద్దాం. అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలనూ ముగ్గురం సమానంగా తిందాం” అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి, ఎనిమిది రొట్టెలనీ మూడు మూడు ముక్కలు చొప్పున చేసి, తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు.

తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ “మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి” అని చెప్పి, ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి “నా నాలుగు బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్లిపోతాను” అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి “నీవి మూడు రొట్టెలే, నావి ఐదు రొట్టెలు. కాబట్టి, లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి” అని అంటాడు.

ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారునాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి, తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు.

maryada ramanna

రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారికి కలలో దేవుడు కనిపించి, “ఏం తీర్పు చెప్పబోతున్నావ్” అని అడుగుతాడు. “నాకు రెండోవాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది” అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి “నువ్వు కథ సరిగా విన్నావా?” అని అడిగి,

“మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి” అని అంటాడు. న్యాయాధికారి “అదెలా” అని అడుగుతాడు.

.

.

.

.

.

.

“ఎలాగంటే, మొదటి వాడి దగ్గర ఉన్నవి మూడురొట్టెలు. వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదురొట్టెలు. వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. అయితే మొదటివాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 తానే తినేశాడు. కానీ రెండోవాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడోవాడికి పెట్టాడు. కాబట్టి ఏడునాణాలు రెండోవాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా” అని తేల్చేశాడు.

తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటివాడు “ఇతడే నయం. కనీసం 3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు” అని వాపోయాడు. అది విని న్యాయాధికారి ‘అతడికి ఒకటే ఎలా చెందుతుందో’ వివరించాడు.

మనం వేసుకునే లెక్కలు వేరు, అసలు లెక్కలు వేరు. ఎవడెంత బయటకి తీశాడన్నది ప్రధానం‌ కాదు. ఎంతవుంటే, అందులో ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నాం అన్నదే పరిగణనలోకి తీసుకోబడాల్సింది.

(మూడేళ్ల క్రితం పోస్టు. వాట్సప్ లో వచ్చిందే. భాష కాస్త సంస్కరించబడింది)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions