.
Jagannadh Goud
….. రష్యా వాళ్ళు క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కున్నారు అని తెలుగు పేపర్లతో పాటు, ఇండియా లో ఉన్న ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లల్లో వచ్చింది. 100% తప్పు.
ఏదైనా మందు, ట్యాబ్లెట్, వ్యాక్సిన్ లాంటివి పరిశోధనలో కనుక్కున్న తర్వాత మొదట లాబరేటరీ యానిమల్స్ మీద ప్రయోగిస్తారు. ఆ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ చేస్తారు.
Ads
ఫేజ్ 1 అనేది డోస్ ఎంత ఉంటే సరిపోతుంది అనేదాని గురించి చేస్తారు. ఎంత డోస్ అయితే సేఫ్ మరియూ భరించగలరు అనే దాన్ని మాత్రమే చూస్తారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారి మీద ప్రయోగిస్తారు. క్యాన్సర్ మీద చేసే క్లినికల్ ట్రయిల్స్ అయితే ఫేజ్ 1 కూడా పేషెంట్స్ మీదే ప్రయోగిస్తారు. ఎక్కువ భాగం 100 మంది లోపు మీదే చేస్తారు.
ఫేజ్ 2 లో ఫలానా మందు, ట్యాబ్లెట్ లేదా వ్యాక్సిన్ అనేది నిజంగా పని చేస్తుందా లేదా అనేది చూస్తారు. సాధారణంగా 100 నుంచి 1000 మంది మీద చేస్తారు.
ఫేజ్ 3 లో ఎక్కువ గ్రూపుల మీద, సాధారణంగా 1000 పైన మంది మీద చేస్తారు. ఇక్కడ అన్ని విషయాలు కన్‌ఫర్మ్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఫేజ్ 3a మరియూ 3b ఉంటుంది. కోవిడ్ సమయంలో ఫేజ్ 3a చేసాక వ్యాక్సిన్ అందరికీ వేశారు. ఆ తర్వాత ఫేజ్ 3b మీద నేను చాలా కాలం పని చేశాను; అప్పుడు వివిధ రోగాలు/ కండీషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా పని చేస్తుంది అనేది చూస్తారు.
ఇవన్నీ పక్కన పెడితే ఫేజ్ 1 లో 100 సక్సెస్ అయితే ఫేజ్ 3 పూర్తి చేసుకొని సక్సెస్ అయ్యేవి 4 నుంచి 5 మాత్రమే ఉంటై. రష్యా వాళ్ళ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంటిరోమిక్స్ అనేది ఫేజ్ 1 లో 48 మంది సేఫ్టీ మరియూ టోలరబిలిటీ (భరించగలిగే శక్తి) కోసం మాత్రమే చేశారు…
ప్రస్తుతానికి అయితే ఆ డోస్ బానే ఉంది అని మాత్రమే నిర్ధారణ అయ్యింది. ఫేజ్ 1 లో ఒక్క స్టడీ మాత్రమే అయ్యింది, అది కూడా ఇంకొన్ని స్టడీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఫేజ్ 1 లోనే, కాబట్టి ఫేజ్ 1 కూడా 100% పూర్తి అయ్యింది అనటానికి లేదు.
అది పని చేస్తుందా లేదా అనేది ఫేజ్ 2 లో మాత్రమే తెలుస్తుంది. ఫేజ్ 2 లో సక్సెస్ అయినవి కూడా 70 నుంచి 85% ఫేజ్ 3 లో పని చేయవు. ఫేజ్ 2 మరియూ ఫేజ్ 3 అనేది చాలా స్టడీస్ చేసి నిర్ధారిస్తారు…
ప్రపంచంలో 200 దేశాలు ఉంటే ఈ న్యూస్ మన ఒక్క దేశంలోనే ప్రాచూర్యంలో ఉంది. నిజానికి ఏ ఒక్క సైంటిఫిక్ కమ్యూనిటీలో కానీ, చివరికి రష్యా వార్తాపత్రికల్లో కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారు అని రాలేదు.
దయచేసి వ్యూస్ కోసం ఫేక్ వార్తలు రాయటం, ప్రచారం చేయటం ఆపండ్రా అయ్యా…
- (వేక్సిన్ అంటారు, 65- 70 శాతం కణితులు కుంచించాయీ అంటారు… వేక్సిన్ వేరు, మెడికేషన్ వేరురా అయ్యా…)
Share this Article