Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాబు గారూ బీకేర్‌ఫుల్… మీ దారిలో భద్రత ‘జెడ్ మైనస్’ అనిపిస్తోంది…

September 27, 2021 by M S R

బాబు గారూ… ఎందుకైనా మంచిది, కాస్త ఆ తాడేపల్లి ఇంట్లో నివాసం కొన్నాళ్లు మానెయ్… ఆ కేశినేని కాకపోతే మరొకరు, మీకు ఆశ్రయం కల్పించే ఇల్లే దొరకదా..? ఆతిథ్యం ఇచ్చే కార్యకర్తే దొరకడా..? మీకోసం ప్రాణాలిచ్చేవాళ్లు బోలెడు మంది… పైగా అదసలే విజయవాడ… మన అమరావతికి అనుబంధ నగరం… పైన అమ్మవారు, కింద కమ్మవారు అనే సూత్రం ఆధారంగా చెప్పడం లేదు గానీ బెజవాడలో పచ్చదనం ఎక్కువే సుమీ… ఐనా అప్పుడప్పుడూ మీరు తాడేపల్లికి చుట్టపుచూపుగా వెళ్లి రావడమే కదా, ఆ సమయానికి ఏ స్టార్ హోటల్‌లోనే వ్యవహారాలు నడిపిస్తే సరి… మీరు ఓ రేంజ్, ఓ లెవల్ మెయింటెయిన్ చేయాలి కదా సార్… హైదరాబాద్‌లో కోట్లకుకోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన భవనాన్ని వదిలేసి, ఆ తాడేపల్లి ఇంట్లో భయంభయంగా గడపడం దేనికి సార్..? అసలే జగన్ అక్కడ…! మన కేసీయార్‌కు కాస్త రాజకీయ మర్యాదలు, తన పాత బాస్ అనే గౌరవం గట్రా మీమీద ఉంటాయేమో గానీ, జగన్‌కు అలాంటి మొహమాటాలేమీ ఉండవ్… సో, హైదరాబాదే భద్రం… అవును సార్, మన ఈనాడులోనే రాశారు… ఫోటో కూడా వేశారు… మీరే చదవండి ఓసారి… ఇదుగో క్లిప్పింగ్…

zplus

రెండు కిలోమీటర్ల పొడవుండే కట్ట దారిలో… మీ ఇంటి సమీపంలోనే దారిలోనే… ఒకటీ అరా లైట్లు వెలుగుతున్నాయట,.. అసలు మీ ఇంటి నుంచి మంతెన వారి ఆశ్రమం దాకా నాలుగు రోజుల నుంచి అసలు లైట్లే వెలగడం లేదట… చివరకు మీ భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారట… కనీసం కొవ్వొత్తులు కూడా లేనట్టున్నయ్ వాళ్ల దగ్గర… జెడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడి పరిస్థితి ఇదా అని స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారట… బహుశా వాళ్లకూ డౌట్లు వచ్చేసినట్టున్నయ్ సారూ… చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని అడిగినా సరే సరైన జవాబులు రావడం లేదట… రాత్రిళ్లు వీథిదీపాలు ఆర్పేస్తున్నారంటే అనుమానించాల్సిందే బాబు గారూ… ఎందుకైనా మంచిది, మీ భద్రత సిబ్బంది వ్యక్తిగత వివరాలు కూడా ఓసారి చెక్ చేయండి సార్, ప్రత్యేకించి కులం…! అక్కడ ఢిల్లీలో మోడీ మిమ్మల్ని సహించడం లేదు, ఆయనకూ మీ భద్రత మీద సోయి లేదు, ఆ అమిత్ షా మీద అనవసరంగా రాళ్లు వేయించారు, ఆయనకూ కోపమే, ఆయన కూడా పట్టించుకోవడం లేదు, ఇక్కడ జగన్‌ను మీరు నమ్మలేరు… పేరుకే జెడ్ ప్లస్ గానీ అంతా జెడ్ మైనస్ అన్నట్టుగా కనిపిస్తోంది బాబు గారూ… కరోనా కాలంలో జూమ్ వీడియో కాల్స్‌తో నడిపించినట్టే కొన్నాళ్లు హైదరాబాద్ నుంచే కథ నడిపించేయండి సార్… ఇప్పుడెలాగూ ఏ ఎన్నికలూ లేవు… మళ్లీ ఎన్నికల నాటికి చూసుకోవచ్చు… జాగ్రత్త సార్, అసలే వీథిదీపాలు ఆర్పేస్తున్నారట…!!

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions