Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

థాంక్ గాడ్… యముడికీ చిత్రగుప్తుడికీ ‘మనోభావులు’ దొరికారు తాజాగా…

September 15, 2022 by M S R

ఓ వార్త చదువుతుంటే… ఇలాంటి మనోభావులు ఇన్నేళ్లూ ఎక్కడ నిద్రిస్తున్నారబ్బా అనిపించింది… ముందుగా ఆ వార్తేమిటో చదవండి… ‘‘బాలీవుడ్ నటులు సిద్ధార్థ మల్హోత్రా, అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం పేరు థాంక్ గాడ్… ఇందులోని కొన్ని సంభాషణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ న్యాయవాది హిమాంశు శ్రీవాత్సవ యూపీలోని జానపూర్ కోర్టులో ఓ పిటిషన్ వేశాడు… ఓ కేసు నమోదైంది…

‘‘అజయ్​ దేవ్​గణ్​ సూటు వేసుకున్నాడు.., చిత్రగుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశాడు… చిత్రగుప్తుడు అంటే పాపకర్మలు లెక్కించేవాడు… మనుషుల మంచీచెడూ రికార్డు చేసేవాడు… దేవుళ్లను అలా చూపిస్తే… అది మతం మనోభావాలను దెబ్బతీసినట్టు కాదా” అనేది సదరు లాయర్ హిమాంశు అభ్యంతరం… ఈయన స్టేట్‌మెంట్‌ను నవంబరు 18న కోర్టు రికార్డు చేయనుందని వార్త… అప్పటిలోగా సినిమా రిలీజ్, తాడోపేడో తేలిపోవడం పూర్తయిపోతయ్ అంటారా..? అది వేరే సంగతి…

ఇందులో రకుల్ ప్రీత్ హీరోయిన్… శుక్రవారం ట్రెయిలర్ రిలీజ్ చేశారు కదా… దాని ఆధారంగా హిమాంశు తన పిటిషన్ ఫ్రేమ్ చేసుకున్నాడు… కాస్త వ్యంగ్యం, కాస్త ఉద్వేగం, కాస్త కామెడీ మిక్స్ చేసినట్టుగా ఉంది ట్రెయిలర్… నిజానికి ట్రెయిలర్లు, ప్రోమోలు కట్ చేయడం దర్శకత్వంకన్నా క్లిష్టమైన ఆర్ట్… ఈ ట్రెయిలర్‌‌లో అంత పంచ్ ఏమీ లేదు… 3 నిమిషాల ట్రెయిలర్‌లో కొత్తదనం పెద్దగా ఏమీ కనిపించలేదు… ఏదో దిక్కుమాలిన వెబ్ సీరీస్ పోకడ తప్ప…

Ads

thank god

ప్రతి అంశానికీ మనోభావాల్ని లింక్ చేసి, వివాదాల్లోకి లాగడం చాన్నాళ్లుగా ఓ ట్రెండ్… ట్రెండ్ అనొచ్చా…? ఇంకేమైనా పదం ఉందా..? సర్లెండి, ప్రస్తుతానికి ఆ చర్చ వదిలేద్దాం… నిజానికి ఆ ట్రెయిలర్ మరీ వెగటుగా, చిత్రగుప్తుడి పాత్రను వెకిలి చేస్తున్నట్టుగా ఏమీ అనిపించలేదు… అది యమలోకం కూడా కాదు… మధ్యలో మృతుడి ఆత్మను ఆపేసి, మంచీచెడు లెక్కలు తేలుస్తున్నాడు చిత్రగుప్తుడు… ఆ తరువాత నరకానికా, స్వర్గానికా చెబుతాడన్నమాట… ఓ కొత్త ప్రయోగం… క్రియేటివిటీ…

కౌన్ బనేగా కరోడ్ పతి, కపిల్ శర్మ కామెడీ షో, ఇండియన్ ఐడల్ తదితర సెట్లన్నీ మిక్స్ చేసి ఓ కొత్త తరహా సెట్ వేసినట్టున్నారు… అజయ్ దేవగణ్ ఫుల్ సూట్‌లో ఉన్నాడు… మనోభావాలు దెబ్బతినేంత అభ్యంతరకరంగా ఏమీ లేదు… మన తెలుగు సినిమా ప్రబుద్ధుల్ని, సారీ, ప్రసిద్ధుల్ని ఓసారి గుర్తు చేసుకొండి… యముడిని ఎన్నిరకాలుగా భ్రష్టుపట్టించారు… నేల మీదకు లాక్కొచ్చారు, తిట్టారు, బెదిరించారు… చిత్రగుప్తుడినైతే జోకర్‌గా మార్చేశారు…

యముడిపై తిరుగుబాట్లు, ఓట్లు, సమ్మెలు కూడా… కొందరైతే పిచ్చి డ్రెస్సులు వేయించారు, ఆభరణాల్ని అమ్మించారు, హిమక్రీములు అంటూ ఎదవ పోకడలకు పోయారు… మరీ ఇంకో అంతర్జాతీయ స్థాయి బృహత్ దర్శకుడైతే నానా ఛండాలం పనులూ చేయించాడు యముడితో… చిత్రగుప్తుడితో కుట్రలు చేయించాడు… ఎవడికిష్టం వచ్చిన రీతిలో అలా యముడు, చిత్రగుప్తుల పాత్రలతో ఆడుకున్నారు… వీళ్ల లెక్కలన్నీ ఆ చిత్రగుప్తుడు రాసుకున్నాడో లేదో తెలియదు గానీ… హఠాత్తుగా వీళ్లిద్దరినీ ప్రేమించే మనోభావులు కనిపిస్తున్నారు… విశేషమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!
  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
  • ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
  • అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
  • పోలీసులది క్రౌర్యమే, తప్పే… మరి రౌడీ షీటర్లకు రాజకీయ ఓదార్పు..!?
  • ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions