మొన్న హరీష్ రావు ఏదో మీడియా చిట్‌చాట్‌లో చాలా బాధపడిపోయాడు… మన తెలుగువాళ్లు లేరా..? ఓ పంజాబీకి డీజీపి ఏమిటి అని…? మరి తమరు చేసిందేమిటి మాస్టారూ… ఓ బీహారీ సోమేశుడికి పట్టం కట్టి, మీకు కావల్సినవన్నీ అడ్డదిడ్డంగా చేయించుకుని… ఇప్పుడు మనవాళ్లు లేరా అంటావా..?
ఒక శివధర్‌రెడ్డి, ఒక ఆనంద్‌రెడ్డిలను మీరు కాదా దూరం చేసుకున్నది..? ఐనా ఆల్ ఇండియా సర్వీసుల్లో మనవాళ్లు, పరాయివాళ్లు అనే వెతుకులాట ఏమిటి..? ఏం, ఓ పంజాబీ వైశ్య డీజీపీ కాకూడదా..? ఎందుకు కాకూడదు..? సర్వీస్ లేదా..? సీనియారిటీ లేదా..? లేక మన కులం కాదులే అనే నిరాసక్తతా..? విమర్శా..? ఇదెక్కడి ధోరణి..? అక్కడికి లోకల్ రెడ్లకు అన్యాయం జరిగింది సుమా, ఈ రెడ్ల పాలనలో అని ఎత్తిపొడుపు పరోక్షంగా, రెచ్చగొడుతున్నట్టు..!
అబ్బే, మేం ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులకు వ్యతిరేకం కాదు, కానీ రేవంత్ రెడ్డి బీహారీ గ్యాంగులు అంటూ విమర్శించాడు కదా, మరి పంజాబీలు దేనికి అని ప్రశ్నించాడు హరీషుడు… అయ్యా, హరీష్ రావూ… రేవంత్ రెడ్డి అన్నది బీహారీ చెడ్డీ గ్యాంగుల గురించి కాదు, వాళ్లు నయం… మీరు నెత్తిన పెట్టుకుని మీ అక్రమాలన్నింటికీ రాజముద్ర వేయించుకున్న సదరు బీహారీ ఆఫీసర్ సోమేష్ కుమార్ గురించి…
Ads
ఇప్పుడు అర్థమవుతోంది కదా… జీఎస్టీ 1000 కోట్ల కుంభకోణంలో తను ప్రధాన పాత్రధారి… సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు… వాళ్లు మరీ అసెంబ్లీ ఎదురుగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో బంధించి ఇంటరాగేట్ చేస్తారని అనుకోలేం ఈ వ్యవస్థలో… చేయగలిగే అవకాశమే ఉంటే బీఆర్ఎస్ నాయకులు సాగించిన అరాచకాలెన్నో ఒక్క సీఐ బయటపెడతాడు…
ఇప్పుడు దాన్ని సీఐడీకి అప్పగిస్తారట… ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో కంపెనీలకు సంబంధాలు… తప్పు… దాంతో వచ్చేదేమీ లేదు… రేవంత్ రెడ్డి సలహాదారుల టీం సరిగ్గా లేదు… సోమేష్ కుమార్ అక్రమాలు మొత్తం బయటపడాలంటే సీబీఐ విచారణ కరెక్టు… కానీ, దానికి సిద్ధపడడు రేవంతుడు… తన చేతిలోనే విచారణ పగ్గాలు ఉండాలి… కానీ ఒక చీఫ్ సెక్రెటరీ ఎలా ఉండకూడదో భారతీయ సమాజానికి తెలియాలంటే సీబీఐ ఎంక్వయిరీయే కరెక్టు…
(మనవాళ్లే కీలక పోస్టుల్లో ఉండాలనుకుంటే… అదే హరీష్ వాదన అయితే మరి ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఎవరు..? మరో రెండు రాష్ట్రాలకు మన తెలుగువాళ్లే సీఎస్‌లు కదా… మరి ఆ రాష్ట్ర నాయకులూ ఇలాగే లోకల్ కావాలనుకుంటే మనవాళ్లకు ఎలివేషన్ ఎక్కడిది..?)
విస్తృతంగా చర్చ జరగాలి, ఐఏఎస్ అధికారుల అక్రమాల మీద… అవినీతి యవ్వారాల మీద… మరో పదిమంది ఐఏఎస్‌లకు ఓ పాఠంలా… ఓ హెచ్చరికలా… అది మన సీఐడీతో కానే కాదు… మన సీఐడీని ఆ పాత కేసీయార్ భ్రష్టుపట్టించేశాడు… తను పట్టుకున్న కేసులు, క్లియర్ చేసిన కేసులంటూ లేవు… ఏదో నామమాత్రం విభాగంలా మార్చేశాడు… ఈ స్థితిలో సోమేష్ కుమార్ మీద సమగ్ర దర్యాప్తును ప్రత్యేక సభాసంఘాలు, విచారణ కమిషన్లు అక్కర్లేదు, జస్ట్, సీబీఐకి ట్రాన్స్‌పర్ చేస్తే చాలు, జనానికి మేలు..!!
ఓ సోషల్ మిత్రుడు ఏమంటాడంటే..? ‘‘వెయ్యి కోట్ల GST అక్రమాలు… ఇది చిన్న బుడ్డ పరక… తవ్వితే వెయ్యి మంది తిమింగలాలు… లక్షల కోట్ల అక్రమాలు బయటపడతాయి …. ఇలాంటి వ్యక్తులకు అవినీతి డబ్బు సంపాదన తప్ప మరో వ్యాపకం లేదు … ఇతనిపై 180+ “ కోర్టు ధిక్కరణ “ కేసులు ఉన్నాయి … వాటిని తప్పించుకోవడానికి ప్రజా ఖజానా నుండి 59 కోట్లు కొట్టేయాలని కుట్ర పన్నితే … High Court లో PIL వేసి కక్కించారు … కేసీయార్ ఎంకరేజ్ చేసిన అవినీతి, అక్రమాల వ్యవస్థలో ఇలాంటి తిమింగలాలు ఎన్నో… అసలు ఇవన్నీ రేవంత్ రెడ్డి బయటపెట్టి, కొరడా పట్టుకోవడానికి అయిదేళ్లూ సరిపోవేమో..!!
Share this Article