.
కొన్నిసార్లు పోలీసులను కూడా మెచ్చుకునే సందర్భాలు వస్తుంటాయి… ఇది తెలంగాణ పోలీసులను అభినందించాల్సిన విషయమే… ఖచ్చితంగా…
సరే, ఈ కేసులు కోర్టుల్లో ఎలా కొట్టుడుపోతాయో తెలియదు కానీ… మేం సెలబ్రిటీలం, మేం దేవుళ్ల సంతానం, ఈ సమాజం మాకు సాగిలపడాల్సిందే, మేమే సుప్రీం అని మబ్బుల్లో తిరిగే కక్కుర్తిగాళ్ల అహాల్ని బ్లాస్ట్ చేసి, నేల మీదకు తీసుకొచ్చారు…
Ads
సో వాల్, మీరెవరైతే మాకేంటి, తప్పు చేస్తే ఎవడినైనా బుక్ చేస్తామనే ధోరణి కనబర్చినందుకు అభినందనలు… బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెడుతున్న నేపథ్యంలో… ఈ చిన్న చిన్న పిట్టలను, చిల్లర కక్కుర్తిగాళ్లను కాదు, కొడితే బిగ్ షాట్స్‌కు వెళ్లండి అని మొన్న ‘ముచ్చట’ స్టోరీ పబ్లిష్ చేసింది…
ఎస్, తెలంగాణ పోలీసులు అదే చేసి చూపించారు… ఏకంగా రానా నాయుడు, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత వంటి పెద్ద నటుల్ని కూడా బుక్ చేశారు… నిజంగా ఓ మాట చెప్పుకుందాం, రానాకు ఏం తక్కువ…? ఎందుకీ కక్కుర్తి..? విజయ్ దేవరకొండ అంత డిమాండ్ ఉన్న హీరో, ఏమిటి చిల్లరతనం..?
సరే, ప్రకాశ్ రాజ్ అంటేనే ఓ దేడ్ దిమాక్… తెల్లారిలేస్తే లక్ష నీతులు చెబుతాడు, దూరేవి ఇదుగో ఈ బెట్టింగ్ యాప్స్… ప్రేక్షకులు ఇంత ఇచ్చారు, ఐనా ఇదేం ముష్టి ఏరుకునే బతుకు ప్రకాశ్ రాజ్..? కేసులు బుక్కయిన వాళ్లలో శ్రీముఖి కూడా ఉంది… (మొన్నామధ్య రామలక్ష్మణుల మీద పిచ్చికూతలు కూసి లెంపలేసుకుంది కదా… ఆమే…)
అనన్య నాగళ్ల, శోభా శెట్టి, రీతూ చౌదరి, నిధి అగర్వాల్, అమృత చౌదరి, నయని పవని, పండు, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, ఇమ్రాన్, వాసంతి కృష్ణన్, నేహా పఠాన్, వర్షిణి, సిరి హన్మంతు, పద్మావతి, హర్ష సాయి, సన్నీ యాదవ్, సుప్రీత, విష్ణుప్రియ…… మొత్తం 25 మంది…
వీరిలో బిగ్‌బాస్ ద్వారా పాపులరైనవాళ్లు ఎక్కువ… ఆ షో ఇలాంటివాళ్ల ఇమేజ్ పెంచి సొసైటీ మీదకు వదులుతోంది… ఇదొక దరిద్రం… తగ్గేదేలే అని ఆకాశంలో తిరుగుతున్న బన్నీని జైలుకు పంపించి, నేల మీదకు దించిన తెలంగాన పోలీసులు, మంచు ఫ్యామిలీలో ఆల్రెడీ మూడు కేసులు పెట్టి, ఇప్పుడు మంచు లక్ష్మిని కూడా బుక్ చేసి, ఏకంగా ఇప్పుడు ఈ 25 మందిని బుక్ చేసి… బహుపరాక్ అనే మెసేజ్ ఇచ్చారు…
కాకపోతే మరీ అకున్ సభర్వాల్ టైపులో డ్రగ్స్ పిచ్చి కేసులు పెట్టి, రోజువారీ షో చేయడంకన్నా… ఈ బెట్టింగ్ యాప్స్ కేసును సైలెంటుగా… బహిరంగ ప్రదర్శనలు, ప్రచారాల కోసం వెంపర్లాడకుండా… కొనసాగిస్తే బెటర్… ఏపీలో సినీ కుటుంబానికి చెందిన సీఎం, సినిమా నటుడే డిప్యూటీ సీఎం… అక్కడేమీ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేం… (పోసాని కేసు డిఫరెంటు)…
బన్నీని అరెస్టు చేస్తే టాలీవుడ్ అంతా తన ఇంటి ముందు క్యూలు కట్టి… రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా, మేమంతా ఒకటే అని సందేశం ఇచ్చారు కదా… ఇప్పుడు రానా, విజయ్ దేవరకొండల మీద కేసులు బుక్కయ్యాయి…. స్పందన వేచి చూడాలి…!!
.
అవునూ ఈ లిస్టులో బేకార్ గాడు పల్లవి ప్రశాంత్ పేరు లేదేమిటో…
Share this Article