భారతదేశంలో కులం అనేది ఓ నిజం… కులపెత్తనం, కులవివక్ష కఠిన నిజాలు… ప్రతి రంగంలోనూ కులం ముద్ర ఉంది… ప్రత్యేకించి కులం లేకుండా రాజకీయం లేదు… రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు, సిద్ధాంతాలు, రాద్దాంతాలు అన్నింటినీ కులం శాసిస్తుంది… కులం లేకపోవడం అనేది ఎక్కడా లేదు, కాకపోతే కాస్త ఎక్కువా తక్కువా… ఆంధ్ర రాజకీయాల్లో కులమే ప్రధానం… చూస్తున్నదే కదా… మరీ అంతగా తెలంగాణలో కులం అనే అంశం పనిచేయదు అని ఎవరైనా అంటే, వాళ్లు భ్రమల్లో ఉన్నారని లెక్క… నిజాల్ని చూడలేని స్థితిలో ఉన్నారని లెక్క… టికెట్ల దగ్గర్నుంచి గెలుపు వ్యూహాల దాకా కులమే బేస్… ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్నే తీసుకుందాం… వోట్లేసేది పట్టభద్రులే కదా… టీచర్లే కదా… ఉద్యోగులే కదా… చదువుకున్నవాళ్లే కదా… వాళ్ల వోట్లనూ కులం దృష్టితోనే చూస్తున్నాయి పార్టీలు… హైదరాబాద్ స్థానానికి పీవీ బిడ్డ వాణిదేవిని ఎంపిక చేసిన టీఆర్ఎస్… బ్రాహ్మణ కార్డునే ఎక్కువగా వాడుతోంది… తెలంగాణలో బ్రాహ్మణ సంబంధ సంఘాలన్నీ ఆమె ఎంపిక రోజే మా బిడ్డ, మా మనిషి అని ఘోషించాయి… బీజేపీ అభ్యర్థీ అదే… వీళ్ల పోటీ మధ్యలో చిన్నారెడ్డికి రెడ్ల మద్దతు దొరుకుతోంది… పికప్ అయ్యాడు…
నల్గొండ-ఖమ్మం సీటులో ప్రధానంగా పోటీపడుతున్నది రెడ్లే… కులం లెక్కలే అన్నీ తేలుస్తున్నప్పుడు చెప్పుకోవడానికి మొహమాటాలు దేనికి..? టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి తన సాధనసంపత్తి మొత్తం వినియోగిస్తున్నాడు… తప్పదు, పోటీ ఇంతగా ఉంటుందని అనుకోలేదు… ఇది ప్రిస్టేజియస్ ఎన్నిక… తను స్వతహాగా రెడ్డి కాబట్టి నల్గొండ, వరంగల్ కొన్ని ప్రాంతాల్లో అడ్వాంటేజ్… మరి మిగతా చోట్ల… తను కూడా కులం కార్డు తీశాడు… తన సతీమణి నీలిమ కులం తెరమీదకు వచ్చింది… అది అసలే ఖమ్మం కదా… కమ్మ కార్డు బాగా పనికొస్తుంది… కానీ ఎక్కడా కులం పేరు రాయకుండా, ఆచి తూచి, జాగ్రత్తగా ఒక యాడ్ ప్రిపేర్ చేశారు… పైన కనిపించేది అదే… ఆమె తండ్రి ఇంటి పేరు… సూర్యదేవర… ఆమె తల్లిగారింటి పేరు వాసిరెడ్డి… వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించడం అంటేనే కమ్మ వోటర్లను అభ్యర్థించడం…
Ads
నిజానికి తప్పేమీ కాదు… అసలు కులమనేదే లేదనే హిపోక్రటిక్ భావన వేస్ట్… ముందే చెప్పుకున్నట్టు కులం అనేది ఓ నిజం… కులం లేకపోవడం అనేది ఓ అబద్ధం… ఐనా పొలిటికల్ ఫీల్డులో ఎన్నిక అంటేనే ఓ యుద్ధం… యుద్ధంలో ఎలా గెలిచావ్ అనేది కాదు, గెలిచావా లేదా అనేదే ముఖ్యం… ఒకసారి గెలిచాక మిగతావన్నీ జానేదేవ్… ఎవరూ పట్టించుకోరు… విజయం అన్నింటినీ కప్పేస్తుంది… తప్పడం లేదు… వ్యక్తులుగా కులాంతరమనే ఆదర్శాన్ని ప్రేమించిన జంట… రాజకీయ అవసరాలు వచ్చేసరికి మళ్లీ కులాన్నే నమ్ముకోవాల్సి రావడం… ఈ ప్రకటన కేవలం ఖమ్మం జిల్లా పేజీలకు మాత్రమే పరిమితం… ఎందుకంటే…? అది వరంగల్, నల్గొండ జిల్లాలకు పనిచేయదు… కమ్మం జిల్లాలోనే పనిచేస్తుంది… అదీ సంగతి…
Share this Article