మనం వేస్టనవసరంగా తెలుగు సినిమాల్ని, తమిళ సినిమాల్ని.., మన క్షుద్ర హీరోల పిచ్చి చేష్టల్ని, సూపర్ మ్యాన్ ఫైట్లని, తలతిక్క గెంతుల్ని, దిక్కుమాలిన కథల్ని, తోలుబొమ్మల హీరోయిన్లను, చెత్తచెత్త పాటల్ని చూసేస్తూ… తెగతిట్టేసుకుంటున్నాం, జుట్లు పీకేసుకుంటున్నాం… వీళ్లెప్పుడు మారతారో కదా అని తెగకన్నీళ్లు కార్చేస్తున్నాం గానీ…….. ది గ్రేట్ సల్మాన్ ఖాన్ నటించినట్టనిపించేసిన, ది గ్రేటర్ ప్రభుదేవా దర్శకత్వించిన, ది గ్రేటెస్ట్ జీగ్రూపు విడుదలించిన రాధే అనే సినిమా చూస్తే మన బాధ ఇట్టే మాయమైపోతుంది… మన […]
థాంక్యూ బ్రదర్… గంటన్నరతో ఆపేశావ్ సినిమా… నీకు భూతదయ ఎక్కువే…
‘‘గతంలో కాస్త సిన్సియర్ రివ్యూలు పెట్టే కొన్ని సైట్లు కూడా పర్లేదు అనేసరికి… నమ్మి మోసపోయి… థాంక్యూ బ్రదర్ అనే సినిమా చూడటం స్టార్ట్ చేశా… కాసేపటికే అర్థమైంది… వాళ్లు కూడా యాడ్స్‌తో మేనేజ్ చేయబడుతూ, డప్పు రివ్యూలు రాస్తున్నారు అని… మరీ ఈ సినిమా షార్ట్ ఫిలిమ్‌కు కాస్త ఎక్కువ సినిమా మాత్రమే అని… నిజానికి షార్ట్ ఫిలిమ్స్ కొందరు బాగా తీస్తున్నారు… మరీ ఇది ఏ కోవలోకీ రాదు… ఓటీటీ అంటే దొరికిన స్క్రాప్ […]
యండమూరి రాక్షసుడు సినిమాలో ఈ ముసలాడు గుర్తున్నాడా మీకు..?
Bharadwaja Rangavajhala………………. రాక్షసుడు ముసలోడి కథ… రుద్రవీణ సినిమాలో చుట్టూపక్కల చూడరా కుర్రవాడా అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు. ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన అపరిచితులు అనే కన్నడ డబ్బింగు సినిమాలోనూ వాసుదేవరావు తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అపరిచిత అనే కన్నడ సినిమాను ఆ […]
Ad Infinitum..! తెలుగు సినిమాయే… ఓ సైన్స్, క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్… కానీ…!?
ఆశ్చర్యం వేసింది… అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది..? మామూలు సోది, సొల్లు చిత్రాలకే బోలెడంత ప్రమోషన్ యాక్టివిటీ ఉంటుంది కదా… ఈ సినిమాను చడీచప్పుడు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు..? సినిమా బాగుంటే జనం చూస్తారు కదా అనే ధీమాయా..? కానీ కనీస స్థాయి పబ్లిసిటీ అయినా అవసరం కదా… నిజమే, ఈమధ్య మీడియా మీట్లు, స్పెషల్ ఇంటర్వ్యూల ‘‘ఖర్చు’’ విపరీతంగా పెరిగింది సరే.., పోనీ, సోషల్ మీడియాను వాడుకోవచ్చు కదా… థియేటర్ల నుంచి ఎప్పుడు […]
బిడ్డ అత్తింటికి దారేది..? ఓ కొత్త కథ… కాదులే, రేషన్ బియ్యానికి పాలిష్ చేశాం…
Gottimukkala Kamalakar…………………….. బిడ్డింటికి బాటేది…? బొమ్మన్ ఇరానీ వాచిపోయిన కాళ్లతో కుంటుతూ కుంటుతూ వెళ్లి రావు రమేష్ ఇంటి తలుపు తట్టాడు.పెళ్లి కాని ప్రదీప్ వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ ” ఎవరూ…?” అని అడిగాడు. “ఇది కోర్టుకెప్పుడూ వెళ్లని లాయర్ రావు రమేష్ గారి ఇల్లే కదండీ..? ఆయనకో హోటల్ ఉంది, అది తాకట్టులో ఉందీ..!” అంటూ మెల్లగా కళ్లద్దాలు తీస్తూ కళ్లు చికిలిస్తూ ఏదో చెప్పబోయాడు బొమ్మన్. “య్యా…! కమిన్” అంటూ షాన్ […]
Yutham Sei…. మిస్కిన్ సినిమా అంటే ఓ రేంజ్… అందరికీ ఎక్కవు… ఎక్కితే దిగవు…
Ashok Vemulapalli…………………. “యుద్దం సెయ్”………. తమిళ దర్శకుడు మిస్కిన్ సినిమా ఇది .. ఆయన మాత్రమే ఇలా తీయగలడు అనిపించుకోగలిగిన వాళ్లలో అతను ఒకడు .. ఆఖరికి వీధి లైట్ కిందే సినిమా షాట్ తీసేస్తాడు .. చీకట్లోంచే కెమేరాని రన్ చేస్తాడు .. మిస్కిన్ కి ఒక ప్రత్యేక కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు.. క్రైం , సైకిక్ స్టోరీ లైన్ తో మిస్కిన్ తీసే సినిమాలు చూడటానికి హాలీవుడ్ లో క్రిస్టఫర్ నాలెన్ సినిమా చూడటానికి […]
సబ్జెక్టు ఒకటే… ఫార్మాట్లు వేరు… ఫైనల్‌గా సినిమాపై వెబ్ సీరీసే గెలిచింది…
జూనియర్ బచ్చనంత పాప్యులారిటీ లేకున్నా ది బిగ్ బుల్ సినిమా కన్నా… ప్రతీక్ గాంధీ నటించిన స్కామ్ 1992 వెబ్ సీరీస్ ఎందుకు బాగుందంటే… వంద కారణాలు కనిపిస్తాయి. రెండింటికీ స్ఫూర్తి బిగ్ బుల్ హర్షద్ మెహతానే. మరెందుకు అభిషేక్ బచ్చన్ ది బిగ్ బుల్ కన్నా… ప్రతీక్ గాంధీ స్కాం 1992కు ప్రశంసలు దక్కుతున్నట్టు…? ఇదే నిజమని… ఇలాగే అందరూ ఆలోచించాలని… అనుకోవాలని కాకుండా ఓ కోణంలో జరిగిన విశ్లేషణగానే చూడాలని కోరుతూ… స్టాక్ మార్కెట్… […]
దేవుడిని నమ్మినప్పుడు… దెయ్యాలున్నాయని కూడా నమ్మాల్సిందే కదా…
Ashok Vemulapalli…………… “THE PRIEST”………. మలయాళ సినిమాల్లో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది ఎక్కడో స్టార్ట్ చేసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో ముగిస్తారు .. చూడగలిగితే ప్రతి సినిమాలోనూ కొత్త విషయం మన ఎంజాయ్ చేయొచ్చు.. అలాంటిదే ఈ సినిమా PRIEST.. తమ చావుకు కారణమైన వారిని వదిలి పెట్టకుండా ఆత్మలు తిరిగి వచ్చి రివెంజ్ తీర్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూస్తుంటాం కానీ కూడా అదే కోవకు చెందిన సినిమానే కానీ ఎన్నో ట్విస్టులతో […]
అరె, ఇదేం సినిమార భయ్…? చివరకు ఆ అంశాల్లోనూ భ్రష్టుపట్టితివా..?
ఈ రాంగోపాలవర్మ అనబడే దర్శకుడు గతంలో కాస్త చెప్పుకోదగిన సినిమాలు తీసి ఉన్నప్పటికినీ… తరువాత కాలంలో తనకుతానే భ్రష్టుపట్టిపోయి… జనం చీదరించుకుని… చివరకు ఆడవాళ్ల తొడలకే అంకితమైన తీరు… లేదా ఏవో దరిద్రపు వివాదాస్పద కథల్ని హడావుడిగా చుట్టేసి జనం మీదకు వదిలిన తీరు అందరికీ విదితమే… అసలు వర్మ అంటేనే ప్రస్తుతం టాలీవుడ్‌కు పట్టిన ఓ దెయ్యం… అది మంచి దెయ్యమా..? చెడ్డ దెయ్యమా అనే మీమాంస, చర్చ, మథనం ఇక్కడ అప్రస్తుతం కావు… ఎందుకనగా… […]
ఫాఫం నాగ్అశ్విన్..! అసలైన ‘జాతిరత్నం’ తనే..! మరీ జబర్దస్త్ తరహా టేస్ట్..!!
ఫాఫం నాగ్ అశ్విన్..! ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తున్న వ్యాఖ్య ఇది… కొండ మీద ఉన్నవాళ్లు హఠాత్తుగా దిగువ ఉన్న బురదలోకి పడిపోవడం అనేది పెద్ద కొత్తేమీ కాదు, అలా చాలామందిని చూశాం… అశ్విన్ అతీతుడేమీ కాదు… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చూశాక తన మీద ఉన్న సదభిప్రాయం కాస్తా జాతిరత్నాలు చూశాక ఆవిరైపోయింది… పోతుంది… పోయేలా చేసుకున్నదీ ఆయనే… అఫ్ కోర్స్, తను ఈ జాతిరత్నాలు అనబడే ఓ పెద్ద జబర్దస్త్ ఎపిసోడ్‌కు నిర్మాత మాత్రమే… […]
వావ్, వకీల్ సాబ్..! ‘పింక్ ఒరిజినల్ రివ్యూ’ అంటే ఇదీ..!!
……. by…. Prasen Bellamkonda………….. ఇవాళెందుకో పింక్ సినిమా గురించి మాట్లాడాలనిపిస్తోంది. పింక్ సినిమాలో ఏమేం ఎందుకు లేవో, అవి లేనందుకు అది ఎందుకు బాగుందో చెప్పాలనిపిస్తోంది. పింక్ లో అమితాబ్ కు పాపం కోర్టులో బల్లలు ఎత్తేయడం కుర్చీలిరగ్గొట్టడం తెలియదు, గడియారాన్ని మారణాయుధం చేయడం తెలియదు.. అయినా బాగుంది. పింక్ లో అమితాబ్ బాత్రూంలనూ మెట్రో ట్రయిన్ లనూ మల్ల యుద్ద భూములుగా మార్చడు.. అయినా అదేంటో మరి, బాగుంది. పింక్ లో అమితాబ్ అనాధల […]
ఆ ఫ్లాష్‌బ్యాక్ కథలో సెట్ కాలేదు… లేకపోతే సినిమా మరో రేంజ్లో ఉండేది…
మనం తరచూ చెప్పుకునేదే… గాంధీ, బుద్ధుడి మీద బయోపిక్ సినిమాలు తీసినా సరే… మన హీరోలు దుడ్డుకర్రలు పట్టాల్సిందే… డాన్సులాడాల్సిందే… అవును మరి, ఎంతటి ఉదాత్తమైన కథైనా సరే, సగటు సినిమా హీరో ఇమేజీకి తగినట్టుగా అది మారాల్సిందే… మారి తీరాల్సిందే..! ఇప్పుడూ అంతే..!! నంబర్ వన్ అమితాబ్ రక్తికట్టించిన కోర్టు డ్రామా… ఆ కథలోని ఎమోషన్, జనానికి కనెక్టయ్యే మెయిన్ ప్లాట్… పింక్ అనే ఆ హిందీ సినిమాకు బలం… కథను నిజాయితీగా ప్రజెంట్ చేశారు… […]
TENET…! ‘టైమ్’లో జర్నీ కొత్తేమీ కాదు… కానీ ఇది అంతకుమించి… అర్థమైతేనే..!!
టెనెట్ సినిమా చివర్లో భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో ప్యాటిసన్… గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో వాషింగ్టన్ తో ఒక మాట అంటాడు… నీ గతానికి గొప్ప భవిష్యత్తు ఉంది.. అంటే నాకు కొన్నేళ్లు క్రితం నీకు కొన్నేళ్ల తర్వాత అన్నమాట అని భవిష్యత్తులోకి వెళ్లిపోతే వాషింగ్టన్ గతంలోకి వెళ్లిపోతాడు.. వర్తమానం అలాగే ఉండిపోతుంది………. నేను రాసిన ఈ నాలుగు లైన్లలో మీకు ఒక్కటైనా అర్థమయితే సినిమా మొత్తం మీకు అర్థమైనట్టే.. ఒక్కొక్కరి పర్సెప్షన్ […]
జక్కన్న రాజమౌళి తాత ఉండేవాడు అప్పట్లో… ఓ కెమెరా బాహుబలి..!
………. By……… Bharadwaja Rangavajhala……………… రవికాంత్ నగాయిచ్ దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం. ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే. తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. స్వీయ దర్శకత్వంలో తొలిసారి పౌరాణిక గాధను నిర్మించాలనుకున్నారు రామారావు. సముద్రాలతో స్క్రిప్ట్ […]
Rekha..! ఇండియన్ ఐడల్ షో హైజాక్ చేసేసింది… రేఖ అంటే రేఖ… అంతే…
రేఖ..! అరవై ఏడేళ్ల ఈ నవయవ్వనవతి గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా రాయాలనుకున్నా సాహసమే… ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చుగాక ఆమె కథ… తన వయస్సును పాతికేళ్లప్పుడే స్తంభింపచేసుకున్నది… అంతే… ఈ తమిళ బిడ్డ భారతీయ చిత్రజగతి కలల సుందరి… ఆమె కథలోకి పోవడం లేదు మనం ఇప్పుడు… కానీ… ఈమధ్య Sony వాళ్ల మ్యూజిక్ కాంపిటీషన్ ప్రోగ్రాం Indian Idol షోకు గెస్టుగా వచ్చింది… అఫ్ కోర్స్, ప్రతి వారం ఎవరో గెస్టును పిలవడం పరిపాటే… వచ్చే గెస్టులు కూడా […]
దుమ్మురేపే ఈ పాట 1952లోనే ఓ పాటల పుస్తకంలోకి ఎక్కింది… ఇదీ ప్రూఫ్…!
నేను ఆ పాటను ముందుగా పాడాను కాబట్టి ఇక నాకే అన్ని హక్కులూ ఉంటయ్, ఇంకెవరైనా మాట్లాడితే మర్యాద దక్కదు, ఆ పాట ఎక్కడైనా సరే నేనే పాడాలి…. అంటూ సాయిపల్లవి సారంగదరియా పాట మీద ఓ జానపద గాయని కొట్లాడింది తెలుసు కదా… దీని మీద కొద్దిరోజులుగా రచ్చ సాగుతూనే ఉంది… ప్రత్యేకించి సుద్దాల అశోక్ తేజ వ్యవహారశైలి మీద కూడా…! నిజానికి ఒక పాట మీద వివాదం ఎందుకులే అనుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల […]
ఆరనీకుమా ఈ దీపం, కార్తీకదీపం..! మరో 1000 ఎపిసోడ్లు ఇలాగే దంచుతారట..!!
తెలుగు టీవీ సీరియళ్లలో ఏదీ మంచిది ఉండదు… కాకపోతే కాస్త గ్రేడ్లు ఎక్కువ తక్కువ… ఇప్పుడు ఆ దరిద్రాల లోతుల్లోకి వెళ్లి చర్చించడం శుద్ధ దండుగ… కానీ ఇప్పటివరకూ టాప్ రేటెడ్, బంపర్ హిట్ సీరియల్ మాత్రం కార్తీకదీపమే… ఓ మళయాళ ఒరిజినల్‌కు కాపీ… కాకపోతే అడ్డదిడ్డంగా రోజుకోరకంగా మార్చేస్తూ మూడేళ్లుగా నడిపించారు దీన్ని… నడుస్తూనే ఉంది… 1000 ఎపిసోడ్ల రికార్డు అంటూ యాడ్స్ ఇచ్చే కంపెనీలకు నిన్న, మొన్న మెసేజులు పంపించి పండుగ చేసుకున్నారు ఈ […]
#WildDog… వాటీజ్ దిస్ నాగ్…? ఎందుకీ సినిమా..? ఏమిటీ ఎంపిక..?
గతంలో… NTR, ANR, Krishna, KrishnamRaju, SobhanBabu ఎట్సెట్రా హీరోలు వెనుక నడుములకు బద్దలు కట్టుకుని, విగ్గులు పెట్టుకుని, వచ్చీరాని స్టెప్పులు వేస్తుంటే… విచిత్రమైన ఫైట్లు చేస్తుంటే… తెలుగు వెండితెర నడుం కూడా వంగిపోయినట్టు కనిపించేది… అప్పుడు చిరంజీవి ఎంట్రీ ఓ పెద్ద రిలీఫ్… తన స్టెప్పులు, తన జోష్, తన ఫైట్లు, యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్కుతో ప్రేక్షకుల్లోకి బలంగా దూసుకొచ్చేశాడు… తరువాత క్రమేపీ వృద్ధ హీరోలంతా కనుమరుగైపోయారు… Venkatesh, నాగార్జున తదితరులు కూడా వెండితెర […]
దగ్గుబాటి రానా..! రీజన్ చెబితే రీజనబుల్‌గా ఉండాలి బాబు గారూ..!
నిజానికి ఇప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీ పోకడల్లో దగ్గుబాటి రానాను చాలా విషయాల్లో మెచ్చుకోవచ్చు… తను హీరో మాత్రమే కాదు.., టీవీ షోల ప్రజెంటర్, నిర్మాత, గ్రాఫిక్స్-స్పెషల్ ఎఫెక్ట్స్‌తో పరిచయం ఎట్సెట్రా చాలా ఉన్నయ్… అన్నింటికీ మించి తనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో తనకు బాగా తెలుసు… వాటివైపే మొగ్గుతాడు… ఘాజి, బాహుబలి, అరణ్య, విరాటపర్వం… ఇలా అన్నీ… తనకు నచ్చిన పాత్రలయితే మనసుపెట్టి వర్క్ చేస్తాడు… లవ్ స్టోరీలు, కామెడీ కథలు గట్రా తనకు […]
ఫ్యానిజం..! బుర్రలు మోకాళ్లలోకి దిగిపోతయ్… థియేటర్లనూ కాలబెడతారు..!!
హీరో అంటే… దైవాంశ సంభూతుడు… ఎహె, కాదు… కాదు… దేవుడే… వ్యక్తిపూజలో భ్రష్టులైన వాళ్లకు ఇక చెప్పేదేమీ ఉండదు… వాళ్లంతే… ఒరేయ్, మీ హీరో పాటలో ఓ వాక్యం మొత్తం పాటే చెడగొట్టిందిరా నాయనా… ఆ గీతరచయిత మేన్షన్ హౌజు హ్యాంగోవర్లో పిచ్చి సాహిత్యం మీమొహాన కొట్టాడురా బాబూ… మీ హీరో స్టెప్పుల చిత్రీకరణలోె కొరియోగ్రాఫర్ ఫలానా తప్పు చేశాడురా… మీ హీరో పాటలోని సెట్టింగులో ఫలానా తప్పుందిరా… మీ హీరో సినిమా టైటిల్స్‌లో ఫలానా అక్షరదోషం […]
- « Previous Page
- 1
- …
- 109
- 110
- 111
- 112
- 113
- …
- 117
- Next Page »