.
మిత్రుడు Sai Vamshi తన పోస్టులో చెప్పినట్టు…. 2019 ఏపీ ఎన్నికలకు ముందు విజయవాడలో…
‘తమ్ముళ్లూ! నేను పిలిచినందుకు ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ మన కోసం వచ్చారు. ఆయనే మనకు ఆదర్శం. ఆయనే మనకు స్ఫూర్తి. బాగా చదువుకున్నవాడు. బాగా పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు జిందాబాంద్ కొట్టండి. కేజ్రీవాల్.. జిందాబాద్’…
Ads
2025లో ఢిల్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో… ‘తమ్ముళ్లూ! ఢిల్లీని చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎక్కడా అభివృద్ధి లేదు. ఎక్కడా పరిశుభ్రత లేదు. పాతనగరంలా పాడుబడిపోయి ఉంది. 1995 ముందు హైదరాబాద్ ఎలా ఉందో అలా ఉంది. ఇదంతా ఈ పదేళ్లలో జరిగింది. ఎవరి వల్ల? కేజ్రీవాల్ చేసిన పరిపాలన వల్ల. ఆయన్ని ఓడించాలి’…
* * * *
ఇంకాస్త మనం చెప్పుకుందాం….
రాజకీయం… అచ్చంగా చంద్రబాబు నిమిషాల్లో, కాదు కాదు… సెకండ్లలో తన స్టాండ్ మార్చేసుకోగలడు… ఏదంటే అది మాట్లాడగలడు… ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచిన చేతులతోనే దండలు వేసి, ఆ లెగసీ హైజాక్ చేసినట్టుగానే…
ఏపీ స్పెషల్ ప్యాకేజీ ఆహా ఓహో అని అర్ధరాత్రి ప్రెస్‌మీట్లు పెట్టి పొగిడిన తనే… తన కవల నాయకుడు వెంకయ్యనాయుడిని కూడా పక్కన పడేసి… నాలుగు రోజులకే మాట మార్చి, యూ టర్న్ తీసుకుని, ప్రత్యేక హోదాపై మోడీ అన్యాయం చేశాడని గగ్గోలు, రచ్చ…
కుసంస్కారంతో పెళ్లాన్నే ఏలుకోలేనోడు దేశాన్ని ఏం ఉద్దరిస్తాడు అని చిల్లర విమర్శలు… మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జతకట్టి, మేఘా డబ్బులు కూడా ఇచ్చాడుట… రాబోయేది సోనియా ప్రభుత్వం అని భ్రమపడ్డాడు ఈ తిక్క చాణక్యుడు…
తరువాత జగన్‌తో కలిసి మోడీ ఏం దెబ్బ తీస్తాడో అని బయపడి, వణికిపోయి, మోడీ కరుణాకటాక్షాల కోసం వెంపర్లాడి, చివరకు కలిసి, ఇప్పుడు మోడీ మీద ఆహారావాలు, ఓహోకారాలు… అప్పట్లో ఖలిస్థానీ కేజ్రీవాల్ ది గ్రేట్… ఎందుకంటే, మోడీ వ్యతిరేకి కాబట్టి…
ఇప్పుడు తనే మోడీ మనిషి కాబట్టి… ప్రపంచంలోకెల్లా అత్యంత చంచల నేతల్లో ఫస్ట్ నితిశ్, సెకండ్ చంద్రబాబు… అందుకే మోడీకి మద్దతు ఎన్నాళ్లు ఉంటుందో కూడా తెలియదు… ఇప్పుడేమో వెళ్లి ఢిల్లీలో ప్యాలెస్ కట్టుకునోడిని ఇంటికి పంపండి, కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీ 1995 నాటి హైదరాబాద్‌లాగా ఉందని కూతలు…
1984 నుంచి మా హైదరాబాద్‌ను ఉద్దరించింది మీ మామే కదా… మీ బాలయ్య, నువ్వు, మీ మామే కదా తెలంగాణ వాళ్లు తెల్లారే నిద్రలేవడాన్ని నేర్పారు, అన్నం తినడం నేర్పారు… ము- కడుక్కోవడం నేర్పారు… మరి 1995లో అంత దరిద్రంగా హైదరాబాద్ ఎందుకుంది..? ఎందుకంటే, 1995 నుంచే ఈ దొరవారి పాలన ప్రారంభమైంది కదా… అందుకని…
అవును సారూ… ప్యాలెసులు కట్టుకున్నోళ్లను తరిమికొట్టాలి, నిజమే… జుబ్లీ హిల్స్‌లోని తమరి ప్యాలెస్ విలువ ఎన్ని వందల కోట్లో, అది ఎన్ని ప్యాలెసులకు సమానమో ఓసారి నిజనిర్ధారణ చేయిద్దామా..? ఒక్కడిని కూడా పిలిచి కప్పు చాయ్ నీళ్లు కూడా పోయలేదు నువ్వు… ఆ రాజరికం అందరికీ కనిపిస్తుందనే కదా… నువ్వు కూడా ప్యాలెసుల గురించి మాట్లాడితే ఎలాగయ్యా మహానుభావా..? ప్యాలెసుల జగన్‌కు నువ్వు ఏం తక్కువ..!!
Share this Article