.
Journalist Kareem ……… అప్పట్లో చంద్రబాబును సస్పెండ్ చేసింది కాంగ్రెస్.., కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థిని కాదని సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో చంద్రబాబు కుతూహలమ్మను చిత్తూరు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు.
అప్పటికి ఆమె చిన్నగొట్టిగల్లులో ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నారు. చంద్రబాబుకు అప్పటి సత్యవేడు ఎమ్మెల్యే/ మంత్రి దాసు సహా జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు మద్దతు ఇచ్చారు. అప్పట్లో జడ్పీ చైర్మన్ కు ఎమ్మెల్యేలు, సమితి అధ్యక్షులు ఓటర్లు.
ఒక్క ఓటు తేడాతో కుతూహలమ్మను చంద్రబాబు గెలిపించుకున్నారు. ఇది ఆయన జీవితంలో అతి పెద్ద విజయం/ మలుపుగా చెప్పుకోవచ్చు. అధిష్టానంతో (పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోన ప్రభాకర్ రావు) సత్సంబంధాలున్న నల్లారి అమర్నాథ్ రెడ్డి (మాజీ సీఎం కిరణ్ తండ్రి) చంద్రబాబు, దాసులను సస్పెండ్ చేయించారు.
Ads
మంత్రిగా ఉన్న అల్లుడు పార్టీ నుంచి సస్పెండ్ కావడాన్ని తీసుకోలేకపోయిన మామ ఎన్టీఆర్ అప్పటి సీఎం అంజయ్యను సంప్రదించారు. (అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న అంజయ్యను కాంగ్రెస్ సీఎంను చేసింది) మంత్రుల సస్పెన్షన్ ఎత్తేయాలంటే దిల్లీలో మాట్లాడాలని అంజయ్య సూచించారు.
అప్పట్లో ఎన్టీఆర్ కు కేంద్రంలో పరిచయాలు లేవు. దీంతో అమితాబ్ బచ్చన్ ను సంప్రదించారు. ఎందుకంటే, అమితాబ్ కు ఇందిరా గాంధీకి మంచి పరిచయం ఉంది. అలాగే రాజీవ్ గాంధీకి మిత్రుడు కూడా. అలా ఎన్టీఆర్ ప్రయత్నం ఫలించి చంద్రబాబు సస్పెన్షన్ ఎత్తేశారు. ఇదంతా 1981 చివర/ 1982 ప్రారంభంలో జరిగింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, చంద్రబాబు టీడీపీ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోవడం, 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు వల్ల వచ్చిన సంక్షోభాన్ని చంద్రబాబు చాకచక్యంగా అధిగమించడం, అల్లుడి తెలివి నచ్చి ఎన్టీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం, చంద్రబాబు పార్టీలో పట్టు పెంచుకోవడం.. అలా అలా జరిగిపోయాయి.
అన్నట్లు చంద్రబాబు కుతూహలమ్మ కోసం పోరాడగా, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. ఏ హోదాలో ఉన్నా ఆమె తన గురువుగా భావించే చంద్రబాబును మాత్రం గౌరవించేది. బహిరంగ సభల్లో కూడా.
చివర్లో ఓసారి మాత్రమే టీడీపీ నుంచి పోటీ చేసింది. 2023 లో మరణించింది. ఆమె కొడుకు హరికృష్ణకు చంద్రబాబు 2019 లో జీడీ నెల్లూరు టికెట్ ఇచ్చినా జగన్ గాలిలో వైసీపీ అభ్యర్థి నారాయణ స్వామి గెలిచారు.
#CBNBirthday #ChandrababuNaidu #75thbirthday #CMCBN
Share this Article