Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…

March 31, 2026 by M S R

.

సాక్షాత్తూ కేంద్రమే విస్పష్టంగా పార్లమెంటులో ప్రకటించింది… కాళేశ్వరానికి పెట్టిన లక్ష కోట్లు నీటిలో కొట్టుకుపోయాయని..! కేసీయార్‌కు ఇంతకుమించిన అధికారిక అభిశంసన మరొకటి ఉండదు..! తనే ప్రధాన బాధ్యుడు కాబట్టి..!

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పిన వివరాలు ముందుగా… ‘‘లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లపాలు… 30 వేల కోట్లు ఖర్చుచేశాక సాంకేతిక అనుమతులు అడిగారు… మేం సాంకేతిక అనుమతులు మాత్రమే ఇచ్చాం… ఆ ప్రాజెక్టు గతేమైందో దేశం మొత్తానికి తెలుసు…

Ads

ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, అనుమతులు, డిజైన్లపై దర్యాప్తు జరుగుతోంది… కానీ ఆ ఏజెన్సీ దర్యాప్తు నెమ్మదిగా జరుగుతోంది… తదుపరి కర్తవ్యం ఏమిటో పరిశీలించాల్సి ఉంది…’’

కాళేశ్వరం



మరి ‘‘ప్రాథమిక అంచనాలకన్నా 80 శాతం ఖర్చు… 1.47 లక్షల కోట్ల ఖర్చు ఆర్థికంగా ప్రయోజనకరం కాదు అని కాగ్ తేల్చి చెప్పింది కదా’’ అని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ అడిగినప్పుడు… కాగ్ వెల్లడించిన అంశాలపై చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మంత్రి చెప్పుకొచ్చాడు…

అవినీతి, అక్రమాల కారణంగా… కాళేశ్వరం పేరిట తెలంగాణ ప్రజాధనం ఇష్టారాజ్యంగా, నిష్ప్రయోజనకరంగా ఖర్చు జరిగిందనేది అటు కాగ్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు  చేసిన కమిషన్, అటు కేంద్ర ప్రభుత్వం అన్నీ తేల్చి చెప్పేసినట్టే..! మరి చర్యలు..? ఇదీ అసలు ప్రశ్న…



kaleswaram

1. గతంలో ప్రధాని కూడా అన్నాడు కాళేశ్వరం ఏటీఎం అని… ఇప్పుడు కేంద్రమే సాక్షాత్తూ పార్లమెంటులోనే ప్రకటించింది అదో పే- ద్ద దుర్వినియోగ ప్రాజెక్టు అని… మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే, ఈరోజుకూ సీబీఐ కేసు ఎందుకు నమోదు చేసుకోలేదు..? ఒకవైపు డొల్ల ప్రాజెక్టు అని తిడుతూనే మరోవైపు కేసీయార్‌తో ఆలింగనాలు, ఆత్మయ సంబంధాలా…? ఓ చిన్న రాష్ట్రంలో లక్ష కోట్లకుపైగా ప్రజాధనం దుర్వినియోగం అయితే… రాజకీయ రహస్య దోస్తీ కోసం బీజేపీ, ఎన్డీయే, కేంద్రం రాజీపడిపోవాలా..?



కాళేశ్వరం



2. గోదావరి అంతర్రాష్ట్ర నదీప్రవాహం… ఏ ప్రాజెక్టయినా సరే, అన్ని రాష్ట్రాలకూ సంబంధం, ప్రభావం ఉంటుంది… మరి అంత నిస్సంకోచంగా తెగించి లక్ష కోట్ల భారీ ప్రాజెక్టు కడుతుంటే… 30 వేల కోట్లు ఖర్చయ్యేదాకా కేంద్రం ఎందుకు చూస్తూ ఉండిపోయింది, పైగా తనే సాంకేతిక అనుమతులు ఎలా ఇచ్చింది..? పక్కా బాధ్యతారాహిత్యం కాదా..?

medigadda



3. ‘కాగ్’ తేల్చిచెప్పిన అక్రమాలపై రాష్ట్రం చర్య తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేయడం ఏమిటి..? ఏదో ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది అంటున్నాడు కేంద్ర మంత్రి… అది ఏ ఏజెన్సీ..? ఆ బరాజులు పనికిరావని డ్యామ్ సేఫ్టీ విభాగం ఏదో చెప్పినట్టు గుర్తు… మరి తదుపరి యాక్షన్ ఏమిటి..? కేంద్ర ప్రభుత్వ  బాధ్యత ఏమిటి..?

kaleswaram



4. విద్యుత్తు అంశానికి సంబంధించి కొత్త విధానాలతో రాష్ట్రాలను కట్టడి చేస్తున్న కేంద్రం మరి అంతర్రాష్ట్ర నదీజలాలకు సంబంధించి కట్టుబాట్లకు ఎందుకు పూనుకోవడం లేదు..? రాష్ట్రాలు అడ్డదిడ్డంగా ప్రజాధనం ఖర్చు చేస్తే కేంద్రం కళ్లప్పగించాల్సిందేనా..? కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన సమయంలోనే ఎందుకు జోక్యం చేసుకోలేదు..?

medigadda



5. ఎఫ్ఆర్బీఎం నిబంధనల కింద… హాఫ్ పర్సంటేజ్ కూడా అదనంగా అప్పులకు అనుమతి ఇవ్వదు కేంద్రం, మరి ఏకంగా ఏమాత్రం ప్రయోజనకరం కాదని, నీళ్లలో కొట్టుకుపోయిందని తనే చెబుతూ… ఏ అనుమతులూ లేకుండానే 30 వేల కోట్ల ఖర్చు అయ్యేవరకు ఎందుకు చూస్తుండి పోయింది… అసలు అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల మీద కేంద్రం బాధ్యత ఏమిటో నిర్వచించుకోవాల్సిన పని లేదా..?



kaleswaram

అన్నింటికీ మించి, అంతా జరిగిపోయాక, అంతా మునిగిపోయాక... ఈ కన్నీళ్లు, ఈ ప్రకటనలకు విలువ ఎంత..? సీబీఐ విచారణ ఎందుకు ఆదేశించడం లేదు..!? అంటే... బయటికి చూస్తే ఇటు ఆక్షేపించాలి, లోలోపల అటు ఆత్మీయంగా వెనకేసుకురావాలి...!! ఈ నిర్వాకం కోసమేనా తెలంగాణ బీజేపీ పదే పదే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది... కాపాడటానికేనా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…
  • కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…
  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?
  • పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions