Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘మాకు అప్పగించండి… ఫోన్ ట్యాపింగ్ అరాచకం కథేమిటో తేల్చేస్తాం..’’

August 7, 2025 by M S R

.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం… ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తున్న బీజేపీ… హైదరాబాద్ కు విచ్చేసిన కేంద్ర హోం శాఖ అధికారులు… ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారులతో చర్చిస్తున్న కేంద్ర మంత్రి

ఉమ్మడి ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ భేటీకి హాజరు… ఎస్ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తున్న బండి సంజయ్…

Ads

కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు నిర్దారించిన పోలీసులు… వాటికి సంబంధించి సేకరించిన ఆధారాలను కేంద్ర మంత్రి ముందుంచిన కేంద్ర నిఘా వర్గాలు…

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయే… ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అనేక ఆధారాలను సేకరిస్తున్న కేంద్ర మంత్రి… రేపటి సిట్ విచారణ సందర్భంగా పలు ఆధారాలను సమర్పించనున్న కేంద్ర మంత్రి…

.

ఇవీ మీడియా స్క్రాలింగ్ పాయింట్స్… నిజమే, ఫోన్ ట్యాపింగ్ అరాచకం మీద ఓ బాధితుడిగా హాజరయ్యే కేంద్ర మంత్రి, అదీ రేప్పొద్దున కేంద్ర హోం పరిధిలోకి గనుక ఈ అంశాన్ని తను కూడా పర్యవేక్షించాలి హోం సహాయ మంత్రిగా… ఇంట్రస్టింగు…

రేపు ఖచ్చితంగా ఓ హడావుడి క్రియేట్ చేస్తాడు తను… బండి సంజయ్ ఉంటే ఆ కోలాహలం వేరు కదా… పనిలోపనిగా పార్టీ తరపున ‘‘ఇది సీరియస్ అంశం కాబట్టి సీబీఐకి సిఫారసు చేయాలి’’ అనే డిమాండ్ కూడా తప్పకుండా పెడతాడు… నిజంగానే ఫోన్ ట్యాపింగ్ విచారణలో బాధ్యులు, పెద్ద తలకాయలు సహకరించడం లేదు, మొండికేస్తున్నారు…

పొలిటికల్ కోణంలో చూస్తే… కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించాలని తెలంగాణ బీజేపీ ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తోంది… బాధ్యులపై సీరియస్ యాక్షన్ రేవంత్ రెడ్డికి చేతకావడం లేదని ఆక్షేపిస్తోంది… సరే, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఎవరి స్ట్రాటజీలు వాళ్లకుంటాయి, సహజం…

కాళేశ్వరం కాకపోతే ఫోన్ ట్యాపింగైనా కేంద్రం చేతికి వస్తే… ఓ కత్తి తమ చేతుల్లోకి వస్తుందని, బీఆర్ఎస్ మెడ మీద వేలాడదీయొచ్చని బీజేపీ ఆలోచన… పైగా ఫోన్ ట్యాపింగు అంశాన్ని రాష్ట్ర సిట్‌కన్నా కేంద్రం గనుక టేకప్ చేస్తే మరింత విస్తృతంగా దర్యాప్తు సాధ్యమవుతుందని, కేసీయార్ అరాచకం ఏ లోతుల్లోకి వెళ్లిందనే, దాని ప్రభావం ఎంతో సరిగ్గా తేల్చగలమనీ బీజేపీ కోణం…

అన్నింటికీ మించి… ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పొలిటికల్ చర్చ జరుగుతోంది కదా… ఒకవైపు బీఎల్ సంతోష్ బీఆర్ఎస్ బీసీ నాయకులు, మాజీ ప్రతినిధులపై బీజేపీలో చేర్చుకునేలా ‘వర్కవుట్’ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి కదా… ఎలాగూ బీజేపీలో కలిసే పక్షంలో మళ్లీ బీజేపీలో చేరడం దేనికనే ప్రశ్న ఆ నేతల్లో రావచ్చు…

సో, సింపుల్… బీఆర్ఎస్‌తో మాకు అంత సయోధ్య ఏమీ లేదు, వచ్చేయండి, బీసీ సీఎం దిశలో కలిసి పనిచేద్దాం అని చెప్పడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగు అంశాన్ని బీజేపీ ఇంకాస్త సీరియస్‌గా టేకప్ చేయడానికి ప్రయత్నిస్తుంది… ఇప్పుడు ఆ రథం నడిపేది బండి సంజయే, డౌటేముంది..?!

కాళేశ్వరం రిపోర్టులో, ప్రాజెక్టు వైఫల్యాలు, అక్రమాల బాధ్యుల్లో ఈటల పేరు ప్రస్తావించడం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తన సన్నిహితుడు రాంచందర్‌రావు నియామకం… దీంతో బండి సంజయ్ అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నాడు రాష్ట్ర బీజేపీలో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ కా దడ్‌కన్ రకుల్‌కు ఏమైంది..? మెడపై ఆ ప్యాచ్ ఏమిటి..?
  • మై డియర్ ఆర్కే… సలహాలు తీసుకునే స్థితిలో వాళ్లున్నారా అసలు..?!
  • మోకాలిలో బుర్ర కాదు గానీ…. మోకాలి కింద మాత్రం గుండె ఉంటుంది..!!
  • అవును, ఈ దర్శకుడు ఓ సూపర్ హీరోయిన్‌తో ఓ ‘కొత్తలోక’ చూపిస్తున్నాడు…
  • మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…
  • జూదం, మద్యం… వీటికన్నా రీల్స్, షార్ట్స్ డేంజరస్… ఇక మీ ఇష్టం…
  • రాజకుటుంబం… బోల్డ్ పాత్రలు, వివాదాలు… ఈమె కథే కాస్త డిఫరెంటు…
  • బ్లాస్టింగ్ కుట్ర కాదు… అసలు కాళేశ్వరం కుట్ర ఏమిటో బ్లాస్టింగ్ నిజాలు…
  • మోహన్‌ లాల్‌లోని ఆ నిజనటుడికి ‘హృదయపూర్వ’క అభినందన..!!
  • తెలుగు ఇండియన్ ఐడల్…! ఈ బుగ్గలు పిండే టాస్కులేంటి థమన్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions