.
నిజంగా టీవీ5 నాయుడిని మించిన మంచి ఓనర్ మరి దొరకడేమో బహుశా… నిన్నో మొన్నో ఆ చానెల్ సీఈవో మూర్తి వీడియో ఒకటి చూడటం తటస్థించింది… మూర్తి స్టయిల్ ఆఫ్ డిబేట్స్, అందులోనే సాంబశివుడి వీరంగాల మీద ఆల్రెడీ ఓ ఐడియా ఉంది, కానీ ఇది పూర్తిగా డిఫరెంట్…
దాదాపు 10 నిమిషాల వీడియోలో తన మీద నమోదైన ఏదో 10 కోట్ల బెదిరింపు వసూళ్ల కేసుకు వివరణ ఇచ్చుకున్నాడు.., 1) తన పర్సనల్ కేసు మీద చానెల్‌లో అంత సుదీర్ఘ వివరణ ఏమిటి అసలు..? అదేదే తన వ్యక్తిగతం, ఇందులో జనానికి, పాత్రికేయానికి లింక్ ఏముంది..? 2) తన కేసును వైసీపీ కుట్ర అనే రంగు పులిమి, ఎక్కడెక్కడికో తీసుకుపోయాడు చర్చను…
Ads
శ్రీరెడ్డి, వేణుస్వామి… ఏ విషయమైనా సరే, మూర్తి వేటాడతాడు… తను సత్యసంధుడిలా కవరింగ్ ఉంటుంది… టీవీ5 కదా, నాయుడు కదా, మీ ఇష్టం, మీదే చానెల్ అన్నట్టుగా వదిలేశాడు… సరే, ఈ తాజా కేసు, దాని పూర్వాపరాలు, అక్రమ బంధాల ఆరోపణలు, వసూళ్ల బెదిరింపులు గట్రా వదిలేద్దాం… కోర్టు కేసు పెట్టమంది, పోలీసులు కేసు పెట్టారు, అదలా నడుస్తుంది…
కానీ ఇదేమీ తన సొంత చానెల్ కాదు, తన మీద కేసుకూ రాజకీయాలకూ సంబంధం లేదు… కాదు, కాదు, ఉందంటాడు మూర్తి… వైసీపీ ఎమ్మెల్సీ కావాలని చేశాడు అంటాడు… సరే, వైసీపీ కుట్రలు చేయాల్సినంత పవర్‌ఫుల్ ప్రత్యర్థిగా తనకు తాను ప్రమోట్ చేసుకోవడం తనిష్టం… ఎటొచ్చీ, ఈ కంచాల గొడవలోకి జగన్‌ను, రోజాను, చిరంజీవిని, కేసీయార్‌ను కూడా లాగడం దేనికి..? అదీ ఇష్టారాజ్యంగా, వెటకారంగా…
ఆమె ఎవరో ఇంటికి వెళ్లాడట, ఏదో వుడెన్ కంచంలో వెజ్ సలాడ్ తిన్నాడట… దాంతో ఎవరి ఎంగిలిపళ్లెంలో ఏం తింటున్నావ్ అని తన మీద ట్రోలింగ్ జరిగిందట… అదీ వైసీపీ కుట్రే, సాక్షి బదనాం క్యాంపెయినే అంటున్న తను ఈ కంచాల లొల్లిని ఎటు తీసుకుపోయాడంంటే..?
‘‘వాళ్లేదో వుడెన్ ప్లేటులో వెజ్ సలాడ్ తెప్పించి పెట్టారు, ఏం, నేను నా సొంత కంచం సంచీలో పెట్టుకుని పోయి ఉండాల్సిందా..? చిరంజీవి జగన్ ఇంటికి వెళ్లినప్పుడు తన ఇంటి నుంచి కంచం తీసుకుపోయాడా..? రోజా ఇంటికి కేసీయార్ తన సొంత పళ్లెం పట్టుకెళ్లాడా..? కేసీయార్ ఇంటికి జగన్ చంకలో కంచం పెట్టుకుని వెళ్లాడా..?’’ ఇలా సాగింది తన వివరణ…
సరే, ఈ కేసులో మెరిట్, డీమెరిట్, నిజానిజాలు వదిలేస్తే… మూర్తి చెప్పిందే నిజమని నమ్ముదాం… కానీ అసలు ఇదేం వివరణ..? ఈ నేతలు- సొంత కంచాల కథలేమిటి..? అసలు చానెల్‌లో పది నిమిషాలపాటు సుదీర్ఘంగా… లైవ్… అదీ ఓ వ్యక్తిగత కేసు…
ఎస్, టీవీ5 నాయుడు నిజంగానే తిరుమల కొండంత అండ… ఎవరూ సొంత చానెల్‌ను అలా పర్సనల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసే, క్లారిటీలు ఇచ్చేలా సిబ్బందికి వదిలేయరు… స్వామీ, నువ్వు తిరుమల కొండవు కావు, తిరుమల స్వామివే..!!
Share this Article