Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిడ్డ పుట్టుక తీరును బట్టి ఇమ్యూనిటీ లెవల్స్ అట… ఓ డౌట్‌ఫుల్ సర్వే…

May 17, 2024 by M S R

ఓ వార్త… కేంబ్రిడ్జి, చైనా శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం అట… విషయం ఏమిటంటే..? బిడ్డ పుట్టే విధానంతో రోగనిరోధక శక్తిలో తేడాలుంటాయట బిడ్డలో… సిజేరియన్ ద్వారా పుడితే తక్కువ ఇమ్యూనిటీ, సహజ ప్రసవం ద్వారా ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందట… మీజిల్ టీకాను వేసినప్పుడు గమనించారట… సరే, వాళ్ల స్టడీని సందేహించేంత జ్ఞానం మనకు లేకపోవచ్చు, ప్రొఫెషనల్స్ ఏమంటారో తెలియదు… కానీ..?

జస్ట్, కామన్ సెన్స్ ఏమంటుందంటే… ప్రతి మనిషికీ ఓ యూనిక్ బాడీ కాన్‌స్టిట్యూషన్ ఉంటుంది… అది జెనెటిక్ కేరక్టర్, దాన్ని బట్టే ఆ బిడ్డ ఆరోగ్యస్థితి కొనసాగుతూ ఉంటుంది, అది పుట్టే విధానాన్ని బట్టి ఉండదు… పైగా ఎన్ని నెలల బేబీ, ఎంత పౌష్టికాహారం లభించింది, అవయవాలన్నీ ఎలా సంపూర్ణ రూపు సంతరించుకున్నాయి, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి పాటలు వింది, ఏం మాట్లాడేది, తన మానసిక స్థితి ఏమిటనేవి కూడా కొంతమేరకు బిడ్డ మీద ప్రభావం చూపించవచ్చు… (బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ‘మంచి శిశువులు’ దిశలో తల్లులకు స్కూల్స్ కూడా ఉన్నాయి…) అలాగే తల్లి పాలతో శిశువుకు ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయంటే నమ్మొచ్చు… తల్లిపాల పవర్ అది… డబ్బాపాలు ఎప్పుడైనా డబ్బా పాలే…

అంతేతప్ప కత్తెరలతో బిడ్డను తీశారా, సహజ కానుపా అనేది బిడ్డ ఇమ్యూనిటీని ప్రభావితం చేయదు… ఏమో, మన శాస్త్రవేత్తలూ దీన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు… కానీ సాధారణ ప్రసవమే బెటర్ అని అందరూ అంగీకరిస్తారు… కానీ మన హాస్పిటల్స్ కసకసా కోసేయడానికే ప్రయారిటీ ఇస్తారు, విషాదం ఏమిటంటే, తల్లులూ అదే కోరుకుంటున్నారు…

Ads

immunity

ఇది చదువుతుంటే మిత్రుడు Sai Vamshi…. పోస్టు కనిపించింది, ఆసక్తికరంగా ఉంది… చదవండి… పైన వార్తకూ దీనికి లంకె లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవడం…



నార్మల్ డెలివరీ మంచిదా.‌. సిజేరియన్ మంచిదా?

సాధారణంగా జరిగే ప్రసవాన్ని ఏ డాక్టర్ కూడా కాంప్లికేట్ చేసి సిజేరియన్ చేయాలని అనుకోరు. అలా అన్నారు అంటే, అక్కడ నిజంగానే ఏదో సమస్య ఉంది అని అర్థం. అన్ని సమస్యలూ చూసేవాళ్లకూ, ఒక్కోసారి తల్లికి కూడా అర్థం కావు. ప్రసవం అని మనం చాలా సహజంగా అంటున్నాం కానీ, ఒక స్త్రీకి తొలి కాన్పు నార్మల్ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలసేపు పడుతుంది. అంతంతసేపు ఎదురుచూడాలంటే కడుపు లోపలి బిడ్డ, బయట తల్లి చాలా ఇబ్బంది పడతారు. పైగా లోపలి బిడ్డకు సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే ప్రాణం పోతుంది. కాబట్టి ఒక బిడ్డకు ఎంత టైం ఇవ్వాలో అంత ఇచ్చేసి, ఆ తర్వాత ఇక కుదరదు అనుకుంటే సిజేరియన్ చేస్తాం. మాకు అంతా బాగానే ఉంది, కాబట్టి నార్మల్ డెలివరీయే చేయాలని పట్టుబడితే బిడ్డ ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది.

‘మా కూతురికి అరగంటలో డెలివరీ అయిపోయింది, నా కోడలికి మాత్రం మూడు గంటలు పట్టింది. లోపల డాక్టర్లు ఏదో మతలబు చేశారు’ అని కొందరు అనుమానపడుతూ ఉంటారు. మనందరి ముఖాలు తేడాగా ఉన్నట్టే, స్త్రీల గర్భసంచిలోనూ తేడాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, ఒంట్లో రక్తం, కడుపులో బిడ్డ బరువు, లోపల బిడ్డ పొజిషన్, ఆ బిడ్డ చుట్టూ ఉమ్మనీరు, బిడ్డకు ఊపిరి అందే స్థితి.. ఇవన్నింటినీ బట్టి ప్రసవం టైంలో తేడా ఉంటుంది. ఆ తేడా గురించి తెలియక చాలామంది ఏదేదో ఊహించుకుని అనుమానపడుతూ ఉంటారు.

‘ప్రసవ వేదన’ అనేది చాలా పెద్ద పదం. దాన్ని చాలామంది ఇష్టం వచ్చినట్లు వాడుతుంటారు. అలా వాడటం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే, ఆడపిల్లలు ప్రసవం అంటే భరించలేని నొప్పి అని భయపడుతున్నారు. కొందరు అమ్మాయిలు తాము తల్లి అవుతున్నాం అని తెలియగానే ‘మాకు నొప్పి వద్దు. నార్మల్ డెలివరీ వద్దు. సిజేరియన్ చేయండి’ అని అడుగుతున్నారు. అలా ఏమీ కాదని ధైర్యం చెప్పాలని చూస్తే వాళ్లు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. చదువుకున్న అమ్మాయిలే అందులో ఎక్కువగా ఉన్నారు. వాళ్లు అలా అడిగితే డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు?

చాలామంది పిల్లలకు తమ పాలు ఇవ్వకుండా ప్యాకెట్ పాలు అలవాటు చేస్తుంటారు‌. మనం ఇవాళ తాగే ప్యాకెట్‌లోని పాలు వారం క్రితం గేదె నుంచి తీసినవి అని మర్చిపోవద్దు. ఎక్కడెక్కడో, ఎలాంటి పరిస్థితుల మధ్యో తయారైన పాలను ఒకచోట చేర్చి, వాటిలో కొవ్వులు తీసేసి ప్యాకెట్లో పోసి మనకు పంపిస్తారు. ఆ గేదెలకు తప్పకుండా ఇంజెక్షన్లు ఇచ్చే ఉంటారు. ఆ పాలు పిల్లలకు పడితే వాళ్లు ఏం కాను? ఆ పాలు వాళ్లకు అలవాటు చేయడం వల్లే వాళ్లలో చిన్నవయసులోనే హార్మోన్లు దెబ్బతింటున్నాయి. జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది.

ఇంకోటి, చాలామంది థైరాయిడ్ సమస్య అని చెప్తుంటారు. దీన్నిబట్టి థైరాయిడ్ మన శరీరంలో ఉంటే సమస్య అని చాలామంది తప్పుగా అనుకుంటారు. మనం గొంతులో ఉండే ఒక భాగం పేరే థైరాయిడ్. అది ‘Thyroxine, Triiodothyronine’ అనే రెండు ప్రధాన హార్మోన్లను తయారు చేస్తుంది. అవి మన శరీరంలో ప్రతి కణం మీద ప్రభావం చూపుతాయి. వాటిలో అసమానతలు ఏర్పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

 

ఉప్పు ఎక్కువ తింటే థైరాయిడ్ సమస్య వస్తుంది. అందునా మనం వాడే అయోడైజ్డ్ ఉప్పు మరింత ప్రమాదకరం. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన అయోడిన్ థైరాయిడే తయారు చేసి ఇస్తుంది. ఎప్పుడైతే మనం కార్పొరేట్ సంస్థల మాట విని అయోడిన్ ఉప్పు వాడటం మొదలుపెడతామో, ఇంక థైరాయిడ్ అలుగుతుంది. మీరే అయోడిన్ తీసుకుంటే నేనెందుకు అని పని చేయడం మానేస్తుంది‌. దీంతో సమస్యలు మొదలవుతాయి. అందుకే కల్లుప్పు వాడమని మేం అందరికీ చెప్తూ ఉంటాం…. (చెన్నైలోని ప్రముఖ డాక్టర్ విజయలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions