ప్రముఖ దర్శకుడు , ఈ చక్రవాకం సినిమాకు దర్శకుడు అయిన విక్టరీ మధుసూధనరావు క్లైమాక్స్ సీనులో పడవ వాడిగా తళుక్కుమని మెరిసారు . బహుశా మరి ఏ సినిమాలో కూడా ఆయన తళుక్కుమనలేదేమో ! మరో విశేషం ఏమిటంటే డి రామానాయుడు ఆయన స్వంత సినిమాల్లో ఏదో ఒక పాత్రలో తళుక్కుమంటారు . కానీ , ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర వేసారు . ఇంకో విశేషం కృష్ణకుమారికి సినిమా మొత్తం మీద ఓ అయిదారు డైలాగులు మాత్రమే ఉండటం .
కోడూరి కౌసల్యాదేవి నవల చక్రవాకం ఆధారంగానే 1974 లో ఈ చక్రవాకం సినిమా వచ్చింది . ఈ సినిమాలో వాణిశ్రీ కట్టిన చీరెల గురించి ప్రత్యేకంగా చెప్పాలి . అవి ఆరగండి వాయిల్ చీరెలు . బంగారు బాబు సినిమా తర్వాత గోల్డ్ స్పాట్ రంగు చీరెలు , వోణీలు తెగ అమ్మారు బట్టల షాపు వాళ్ళు . చక్రవాకం సినిమా తర్వాత చక్రవాకం చీరెలు అని విమల్ వాయిల్ చీరెల్ని కూడా తెగ అమ్ముకున్నారు బట్టల షాపు వాళ్ళు . మాది బట్టల షాపే కదా ! ఈ సినిమాలో వాణిశ్రీ కట్టిన చీరెలు ఓ గొప్ప ఫేషన్ని సెట్ చేసాయి .
ఈ సినిమా కూడా బంగారు కలలు సినిమా లాగానే గూడ్సు బండి . ఆడవారికి కూడా నచ్చలేదు . చక్రవాకం అంటే చక్రవాక రాగం . ఆ రాగంలో వాణిశ్రీ పాడే పాట మాత్రం అద్భుతం . సుశీలమ్మ చాలా గొప్పగా పాడారు . వీణ లోనా తీగె లోనా ఎక్కడున్నదీ రాగము అది ఎలాగైనది రాగము . మిగిలిన పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది , కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలె తొందరా పాటలు బాగుంటాయి . రామకృష్ణ బాగా పాడారు . కె వి మహదేవన్ చక్కటి సంగీతాన్ని అందించారు .
Ads
శోభన్ బాబు తల్లిదండ్రులుగా నాగభూషణం , జి వరలక్ష్మిలు నటించారు . పెద్దన్నగా రామానాయుడు , ఆయన భార్యగా కృష్ణకుమారి , చిన్నన్నగా పద్మనాభం , ఆయన భార్యగా రాజసులోచన నటించారు . ఆమె చెల్లెలుగా చంద్రకళ , ఆమె భర్తగా శ్రీధర్ నటించారు . వాణిశ్రీ తల్లిదండ్రులుగా SVR , అంజలీదేవిలు నటించారు . అల్లు రామలింగయ్య , కె వి చలం ప్రభృతులు నటించారు .
మా నరసరరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తుంటుంది . వాణిశ్రీ వీరాభిమానిని కదా ! కాసేపు చూస్తుంటా . యూట్యూబులో ఈంది . వాణిశ్రీ , శోభన్ బాబు అభిమానులు చూడవచ్చు . Typical family , sentimental movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం
Share this Article