Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమా ఒకటి చేసినట్టు బహుశా చిరంజీవికీ గుర్తుండి ఉండదు..!!

October 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi….. తమిళంలో శివాజీ గణేషన్ నటించిన పాత్రను తెలుగులో చిరంజీవి వేసారు . జ్ఞాన ఓలి అనే టైటిలుతో తమిళంలో శివాజీ , మేజర్ సుందర్ రాజన్ , శారద , విజయనిర్మలలు నటించిన సినిమాను తెలుగులో చక్రవర్తి అనే టైటిలుతో చిరంజీవి తోడల్లుడు డా కె వెంకటేశ్వరరావు చిరంజీవి హీరోగా రీమేక్ చేసారు .

మక్కీకి మక్కీ రీమేక్ కాదు . చిరంజీవి స్టార్డంకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారు . 1972 లో వచ్చిన ఈ తమిళ సినిమా 1978 లో హిందీలోకి కూడా దేవత అనే టైటిలుతో రీమేక్ అయింది . హిందీలో సంజీవ్ కుమార్ , షబానా ఆజ్మీ , రాకేష్ రోషన్ , డేనీ డంజోపాలు నటించారు . రొటీన్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది చిరంజీవి పాత్ర ఈ సినిమాలో .

Ads

పెద్దగా సౌండ్ ఉండదు . ఆడటం కూడా అలాగే సౌండ్ చేసినట్లుగా లేదు . ఏవరేజుగా ఆడింది . సినిమా కధ బాగుంటుంది . ANR నటించిన బీదలపాట్లు సినిమా గుర్తుకొస్తుంది .

చిరంజీవి , ఆయన చెల్లెలు రమ్యకృష్ణ అనాధలు . ఓ గ్రామంలో ఒక స్వామీజీ నిర్వహించే అనాధ శరణాలయంలో పెరుగుతారు . చిరంజీవి చిన్ననాటి స్నేహితుడు మోహన్ బాబు ఇనస్పెక్టరుగా ఆ ఊరే వస్తాడు . అతనికి తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి జరపాలని కోరుకుంటాడు హీరో .

ఆ ఊరికే సంబంధించిన ఓ మోతుబరి అన్న కొడుకుని ప్రేమిస్తుంది . పెళ్లి చేసుకోమని అడిగిన అన్నను అవమానిస్తాడు . మాటామాటా పెరిగి ఘర్షణలో అతను చనిపోతాడు . పోలీసులు అరెస్టు , హీరో పారిపోవడం , గొప్ప డబ్బున్నవాడు కావటం , ఆ ఊరికే చక్రవర్తి పేరుతో తిరిగి రావటం , చనిపోయిన స్వామీజీ కోరికలను తీర్చటం జరుగుతాయి .

పెళ్ళిలో పోలీసు ఇనస్పెక్టరు చిరంజీవిని రెచ్చగొట్టి తానే అంజిని అని చెప్పిస్తాడు . అయితే తాను హత్య చేయలేదని , ఆ హత్యను ఆస్తి కోసం విలన్ బాబాయి సత్యనారాయణే చేసాడని రుజువు చేయడంతో శుభం కార్డు పడుతుంది .

హీరోకి జంటగా భానుప్రియ , చెల్లెలుగా రమ్యకృష్ణ , స్వామీజీగా సోమయాజులు , విలనుగా సత్యనారాయణ , ఇనస్పెక్టరుగా మోహన్ బాబు , ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , అల్లు రామలింగయ్య , రంగనాధ్ , మమత , సుత్తి వేలు , సుధాకర్ , ప్రభృతులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల పాటల్ని వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు పాటల్ని పాడారు . ఏరు పాడేనయ్యా సామి ఊరు ఊయలయ్యేనయ్య సామి అనే పాటలో చిరంజీవి చక్కగా , హుందాగా నటిస్తారు .

భానుప్రియతో డ్యూయెట్లు అన్నీ హుషారుగా ఉంటాయి . సందిట్లో చిక్కిందమ్మా జాబిల్లీ , మొక్క జొన్న తోట కాడ మొన్నటేళా , వన్నెల రాణి కిన్నెరసాని అంటూ సాగే డ్యూయెట్లు బాగుంటాయి . డిస్కో డాన్సర్ అవతారంలో చిరంజీవి ఊపిరి నిండా సాహసమే ఉప్పెనకైనా స్వాగతమే పాట చిరంజీవి లెవెల్లో అభిమానులను అలరిస్తుంది .

గణేష్ పాత్రో డైలాగులు పదునుగా ఉంటాయి . చిరంజీవి , మోహన్ బాబు సైలెంట్ ఘర్షణ సీన్లలో డైలాగులు పోటాపోటీగా ఉంటాయి . ఇద్దరి నటన కూడా పోటాపోటీగానే ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . సినిమా స్లోగా నడుస్తుంది . చిరంజీవి అభిమానులకు నచ్చుతుంది . చూడబులే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం మల్లోజుల… లొంగిపోయిన తుపాకీ అంటే అందరికీ అలుసే…
  • కన్నడ- తెలుగు సంకర భాష… తెలుగుకు ఇదోరకం చేతబడి…
  • ఊదు కాలదు, పీరు లేవదు… ఆ ఎల్లమ్మ కథ ఎటూ తేలదు…
  • మిత్రమండలి..! మనకు మనమే చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాల్సిందే..!!
  • ఈ సినిమా ఒకటి చేసినట్టు బహుశా చిరంజీవికీ గుర్తుండి ఉండదు..!!
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్… ప్రపంచం నేర్పిన పాఠాలు…
  • నాకు నువ్వు- నీకు నేను…!! బీజేపీ- బీఆర్ఎస్ రహస్య స్నేహం..?!
  • ఈ పాట పీక పిసికిన హంతకుడెవరు..? ఈమె ఎందుకు మూగబోయింది..!?
  • లొంగుబాటలో తుపాకీ..! మల్లోజుల బాటలోనే ఆశన్న… మరో దెబ్బ..!!
  • ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions