Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!

November 19, 2026 by M S R

.

‘ధురంధర్’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్ మరో భారీ చారిత్రక చిత్రానికి సిద్ధమవుతున్నాడన్న వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి జీవిత కథతో ఓ భారీ పీరియాడిక్ డ్రామా రూపొందించాలన్నది ఆయన ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఇందులో చంద్రగుప్తుడిగా యశ్, ఆయనకు రాజకీయ గురువైన చాణక్యుడిగా రణ్‌వీర్ సింగ్ నటించవచ్చన్నది తాజా ఊహాగానం.

ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాలేదు. నటీనటుల ఎంపిక కూడా ఖరారు కాలేదు. పైగా ఆదిత్య ధర్ మరో సినిమాకు రణ్‌వీర్‌తో కలిసి పనిచేయనున్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఇదే చారిత్రక చిత్రమా కాదా అన్నదానిపైనా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. కానీ ఈ కాంబినేషన్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది.

Ads

ఒకసారి మన పాత సినిమా గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన ‘చాణక్య చంద్రగుప్త’ గుర్తుందిగా! అప్పట్లోనే అంతటి చారిత్రక కథను తెరపై ఆవిష్కరించడం ఓ ప్రత్యేక ఆకర్షణ. అసలు అక్కినేని చాణుక్యుడి పాత్రను అనితర సాధ్యంగా పోషించారు. ఇప్పుడు అదే చరిత్రను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ నిర్మాణ విలువలతో మరోసారి తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అయితే చాణక్యుడి పాత్ర పోషించడం అంత సులభం కాదు. అది కేవలం గంభీరమైన మాటలు చెప్పే పాత్ర కాదు. అపారమైన రాజకీయ పరిజ్ఞానం, దూరదృష్టి, వ్యూహరచన, శత్రువుల ఎత్తుగడలను ముందే పసిగట్టే తెలివితేటలు.. అన్నీ కలగలిసిన సంక్లిష్టమైన వ్యక్తిత్వం. ఆ పాత్రలోని మేధస్సును, కాఠిన్యాన్ని, పట్టుదలను నటుడు ఎంత బలంగా పలికించగలడన్నదే అసలు పరీక్ష.

అలాగే చంద్రగుప్తుడి ఎదుగుదల, నందుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం, చాణక్యుడి మార్గదర్శకత్వంలో సామ్రాజ్య స్థాపన.. ఇవన్నీ తెరపై ఉత్కంఠభరితంగా చూపించడం దర్శకుడికి మరో పెద్ద సవాలు. చరిత్రను పాఠంలా చెప్పకుండా, ప్రేక్షకుడు కుర్చీ అంచున కూర్చుని చూసేలా కథను నడిపించాలి.

aditya dhar

యశ్‌కు భారీ తెరపై రాజసం, శారీరక హావభావాలతో పాత్రను నిలబెట్టే సామర్థ్యం ఉంది. రణ్‌వీర్‌లో నటుడిగా ఎన్నో కోణాలున్నాయి. కానీ వీరిద్దరి స్టార్‌డమ్ ఒక్కటే సినిమాను నిలబెట్టలేదు. చాణక్యుడి మేధస్సు, చంద్రగుప్తుడి పోరాటం రెండింటినీ సమానంగా ఆవిష్కరించగలిగితేనే అది గొప్ప చారిత్రక చిత్రమవుతుంది.

ప్రస్తుతానికి ఇది వార్తల స్థాయిలోనే ఉన్నా, నిజంగా కార్యరూపం దాలిస్తే మాత్రం భారతీయ సినిమా ప్రేక్షకులకు ఓ ఆసక్తికరమైన భారీ ప్రాజెక్టు దొరికినట్టే!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!
  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
  • సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
  • ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు- రాముడి వారసులు మాత్రం సైలెంట్ !!
  • ఈసారి భద్రతా వ్యవస్థలోనే..! కొనసాగుతున్న అమెరికా *టెక్ కష్టాలు !!
  • ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions