.
29 మార్చి 1982… ఇది తెలుగుదేశం వ్యవస్థాపక దినం… సో కాల్డ్ చంద్రబాబు గ్యాంగ్ జబ్బలు చరుచుకోకండి… అది ఎన్టీయార్ పార్టీ… ఇప్పుడున్న బాబు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ తెలుగుదేశాన్ని పాతాళంలోకి తొక్కి… తన పేరును, తన ఫోటోను, తన వారసత్వాన్ని, తన పార్టీని హైజాక్ చేసింది…
ఐనా సరే, నేను చంద్రబాబును మెచ్చుకోవాలనే అనుకుంటున్నాను… వెన్నుపోటు, నమ్మకద్రోహం రాజకీయ పార్టీల్లో తప్పులు కావు… రొమాన్స్‌లో, యుద్ధంలో ఏదీ తప్పు కాదు… చంద్రబాబు కూడా జస్ట్, పాలిటిక్స్‌లో సొంత మామను వెన్నుపోటు పొడిచి, పార్టీ హస్తగతం చేసుకుని, జనామోదం పొందాడు చూడండీ, అదీ సక్సెస్ అంటే…
Ads
ఎస్, ఒక్క చంద్రబాబు అనుకోగానే సరిపోలేదు కదా… ఎన్టీయార్ కుటుంబసభ్యులు సహా పార్టీ ముఖ్యులంతా చంద్రబాబు నిర్ణయానికి జైకొట్టారు… అంటే అప్పటికే సోకాల్డ్ దుష్టశక్తి మీద పార్టీ అంతా వెక్సప్ అయిపోయి ఉందన్నమాటే కదా… మూర్ఖంగా ముసలితనంలో జతకూడిన పెళ్లాన్ని సమర్థించిన ఎన్టీయార్‌ను పార్టీ, జనం తిరస్కరించినట్టే కదా…
సరే, వెన్నుపోటు… రామోజీరావు ఎట్సెట్రా మీడియా సపోర్టుతో నెమ్మదిగా పార్టీని పూర్తిగా సొంతం చేసుకున్నాడు, ఎన్టీయార్ మొత్తానికే లోకం వీడాడు, ఆ ఫోటోకు తనే దండ వేసి, తనే సొంతం చేసుకుని, ఆ దుష్టశక్తిని తరిమేశాడు… అదీ రాజకీయం అంటే, అదీ చాణక్యం అంటే…
ఇక్కడ చంద్రబాబును మెచ్చుకోవాలి… అసలే ఆ సామాజికవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ… చిన్నాచితకా లీడర్లు కూడా నాకేం తక్కువ అని పుల్లలు పెట్టేరకం… వాళ్లందరినీ కంట్రోల్‌లో పెట్టుకుని, ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి, యావత్ కులాంగీకారం పొంది, ఇన్నేళ్లు… పార్టీని కాపాడుకోవడం, సామాజికవర్గం సపోర్ట్ కాపాడుకోవడం అంత చిన్న విషయం ఏమీ కాదు…
ఇక్కడ చంద్రబాబును మెచ్చుకోవాలి… వోకే, తనకు లక్ష అవలక్షణాలు ఉండనివ్వండి… కానీ రాజకీయంలో ఈరోజుకూ తన పరిణతిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు… తొక్కేవాడిని తొక్కుతున్నాడు, నెత్తిన పెట్టుకునేవాడిని పెట్టుకుంటూనే ఉంటాడు… అన్నీ ఆ రాజకీయ లక్షణాల్లో భాగమే…
రాజకీయాల్లో అవినీతి తీవ్రత ఎవడికి కావాలి ఈరోజుల్లో… మన చంద్రబాబు ఎయిటీస్, నైన్టీస్‌లోనే మొత్తం భారతీయ రాజకీయానికే వాటిల్లో కొత్త పాఠాలు నేర్పి, కొత్త మార్గాలు చూపించాడు తను… పిచ్చి టెక్నాలజీ కూతలు, రోతలు, ఘనతలు ఏదేదో చెప్పుకుంటాడు తను… అవన్నీ జస్ట్, డైవర్షన్స్… ఆ కూతలు తన సుదీర్ఘ కెరీర్‌కు ఏమైనా అడ్డంకులయ్యాయా..?
ఫోన్ కనిపెట్టాడు, కంప్యూటర్ కనిపెట్టాడు, హైదరాబాద్ కట్టాడు… ఎట్సెట్రా పెడపోకడలు, ఏవగింపు మాటలు ఎన్నున్నా సరే, తన పొలిటికల్‌గా నిలబడ్డాడు, అదీ మన తెలుగు ప్రజల అద్భుతమైన ఔదార్యం స్థాయి… పాపం తెలుగూస్… ఎస్, తెలుగు ప్రజలు కీళ్లు తెలిసి వాతలు పెట్టి, బాగుపడ్డవాడు చంద్రబాబు…
సేమ్… చంద్రబాబే ఆదర్శం… ఒక షిండే శివసేనను కైవసం చేసుకుంటాడు, ఒక అజిత్ పవార్ ఎన్సీపిని ఓన్ చేసుకుంటాడు… ఇవన్నీ అంత వీజీ కాదు, బాబు అందరికీ బాటలు చూపించాడు, అది చిన్న సక్సెస్ కాదు… అనుకున్నంత వీజీ కూడా కాదు…
ప్రపంచంలో బహుశా ఇలాంటి సక్సెస్ స్టోరీ మరొకటి లేదు… చివరకు ఆ ప్రశ్నించే పవన్ కల్యాణుడిని కూడా తన వెంట నడిపించుకుంటూ, సోకాల్డ్ పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ జగన్‌ను తొక్కుకుంటూ సాగిపోతున్నాడు… నువ్వు తోపువు చంద్రబాబూ… వర్తమాన రాజకీయ ధోరణులకు నువ్వు ఐకన్… నైతికతలు మన్నూమశానం మనకెందుకు..? మన లక్షల కోట్ల ఆస్తులు, అధికారమే అసలు లక్ష్యం ఐనప్పుడు..? నువ్వు తురుం బాసూ..!!
.
ఒకటి నిజంగా మెచ్చుకోవాలి… జగన్ వైఎస్ కాదు… టీడీపీని, కమ్మలను ఇక లేవకుండా తొక్కాలని మాక్సిమం ట్రై చేశాడు… ఎన్ని కేసులు, ఎన్ని వేధింపులు… చివరకు బాబు అరెస్టు కూడా… ఎన్నో, ఎన్నెన్నో… ఈస్థితిలో కడూా తను గతంలో ద్వేషించిన మోడీతో కాళ్ళ బేరం… Pk ని ఓ తోకగా చేసుకుని ఏం ఆట ఆడావ్ సారూ… గ్రేట్… దటీజ్ పాలిటిక్స్… చివరకు మళ్లీ తన మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడే స్థితి అదృష్టమే కావచ్చుగాక, కానీ తన పార్టీని కాపాడుకుని, మళ్లీ ఓ రాజకీయ వైభవం సంపాదించాడు కదా…
.
43వ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు… అవునూ, ఆ దుష్టశక్తిపై ఏమైనా కేసులు పెట్టే ఆలోచన ఉందా మాస్టారూ..!!
Share this Article