.
ఒక ఫోటో… మొన్నెప్పుడో కనిపించింది… ఇంట్రస్టింగుగా కూడా అనిపించింది…
అది డోకిపర్రు గ్రామంలో చంద్రబాబు, మేఘా కృష్ణారెడ్డి బాపతు ఫోటో… ఆ ఊళ్లో ఓ గుడి కట్టాడు మేఘా ఓనర్… భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం… ఓ గెస్ట్ హౌజు, ఓ కల్యాణమండపం కూడా…
Ads
అంతేకాదు, ఆ ఊరిని కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద 2015లో దత్తత తీసుకుని, పైప్డ్ గ్యాస్ సప్లయ్ ఏర్పాటు చేశాడు… స్మార్ట్ విలేజీగా డెవలప్ చేశాడు…
ఆ గుడికి వచ్చాడు చంద్రబాబు… ఆ గుళ్లో పూజలు చేశాడు… సరే, కృష్ణారెడ్డి, ఆయన భార్య సుధ మర్యాదలతో స్వాగతం పలికారు… ఊరు, గుడి అభివృద్ధిపై వారిని అభినందించాడు చంద్రబాబు… విజన్ 2047లో భాగంగా మొత్తం డోకిపర్రు మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరాడు… సరేనన్న మేఘా దంపతులు… ఇదీ వార్త…
ఆ డోకిపర్రు మేఘా కృష్ణారెడ్డి సొంతూరు… తన రూట్స్ అవే… అదీ సంగతి… అనతికాలంలోనే వేల కోట్లు సంపాదించి, విభిన్నరంగాల్లోకి తన వ్యాపారాన్ని విస్తరించిన మేఘాది ఓ రకం సక్సెస్ స్టోరీ… సరే, అదికాదు ఇక్కడ వార్తాంశం…
ఒకసారి కేసీయార్ స్వయంగా మేఘా కృష్ణారెడ్డిని బహిరంగంగా సత్కరించాడు… అప్పట్లో వాళ్ల సంబంధాలు… ఆర్థికం, హార్దికం… కానీ ఇప్పుడు..? అదే మేఘా మీద కేసు ఎందుకు పెట్టరు..? ఎందుకు అరెస్టు చేయరు అంటాడు కేటీయార్..? ఎక్కడ తేడా కొట్టిందనేదీ వదిలేస్తే.,.?
ఇదే చంద్రబాబు కూడా మేఘాకు కావల్సినవాడే… కాదు, చంద్రబాబుకు కూడా మేఘా కంపెనీ కావల్సినదే… మేఘాకు కేసీయార్ ఎంతో రేవంత్ అంతే… జగన్ ఎంతో, చంద్రబాబూ అంతే… పార్టీలు నడవాలంటే డబ్బులు కావాలి, డబ్బులకు ఇలాంటి కంపెనీలు కావాలి… అది బహిరంగసత్యం…
ఐతే… జగన్ నవయుగ వంటి ‘బాబు అస్మదీయ’ కంపెనీలను తప్పించి మేఘాకు రివర్స్ టెండరింగు అంటూ కంట్రాక్టులు కట్టబెట్టినా సరే, చంద్రబాబు ఒక్కసారి కూడా మేఘా మీద అక్కసు చూపించలేదు… విమర్శించలేదు… జగన్‌ను రాజకీయంగా కౌంటర్ చేసే ప్రయత్నం చేశాడు…
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మేఘాతో అదే సంబంధం… జగన్ మీద కోపాన్ని మేఘా మీద చూపించడు… అదీ పరిణతి… అదీ పొలిటికల్ లౌక్యం… కంపెనీలు- పార్టీలు- విరాళాలు అన్నిచోట్లా ఉన్నవే… మేఘా, టీడీపీ మినహాయింపేమీ కాదు కదా… మొన్నటిదాకా రేవంత్ ఇదే మేఘాతో బాగున్నా… ఎప్పుడైతే ఎఐసీసీ జాతీయ స్థాయిలో మేఘాకు వ్యతిరేకంగా ఓ లైన్ తీసుకున్నాక ఇప్పుడు దూరం మెయింటెయిన్ చేస్తున్నాడు… స్కిల్ వర్శిటీకి మేఘా ఇచ్చిన 100 కోట్ల విరాళమూ వాపస్ ఇచ్చేస్తున్నానన్నాడు…
అవును, మేఘా వంటి కంపెనీలకే కాదు… ఆదానీ, అంబానీ, వేదాంత… ఏ కంపెనీ తీసుకున్నా సరే… అందరూ అందరికీ కావల్సినవారే… కాకపోతే ఆదానీ కథ వేరు… అది పూర్తిగా బీజేపీ కంపెనీ అని కాంగ్రెస్ భావన… అందుకే చాకిరేవు పెడుతోంది ఇప్పుడు… పర్ సపోజ్, రేప్పొద్దున… అరె, ఒకవేళ… కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే… ఇదే ఆదానీ మీద ఇదే వ్యతిరేకతను కనబరుస్తుందా..? ఏమో… కాలం చెప్పాల్సిందే..!!
Share this Article