Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంద్రబాబు గారండోయ్… క్షమించండి మా అజ్ఞానానికి… శపించకండి ప్లీజ్…

November 21, 2025 by M S R

.

నిజానికి ఒక వీడియో చూసేదాకా నాకూ నమ్మబుద్ది కాలేదు… సరే, చంద్రబాబు కంప్యూటర్లు కనిపెట్టాడు, మొబైల్స్ ఆయన సృష్టే… హైదరాబాద్ కట్టింది తనే… సర్వం తానే… అంతెందుకు..? ఆయన మామ తెలంగాణ వాళ్లకు వరి అన్నం అంటే ఏమిటో చూపించి, తినిపించాడు, పొద్దున్నే లేవడం నేర్పాడు…

వర్క్ కల్చర్ నేర్పాడు… కానీ చంద్రబాబు తెలంగాణ గుళ్లను కూడా తనే కట్టాను అన్నాడంటే నమ్మలేకపోయాను… మన పిచ్చి గానీ భద్రాచలం గుడిని శ్రీరామదాసు కట్టాడని అనుకుంటాం కదా, కాదు, చంద్రబాబు… అలాగే కీసర, బాసర, సమ్మక్క- సారలమ్మ… ఒకటేమిటి, చివరకు ఆలంపూర్, యాదగిరిగుట్ట కూడా తనే కట్టాడు…

Ads

ఈ వీడియో బిట్ ఎప్పటిదో గానీ… ఇన్నాళ్లూ మీ ఘొప్పథనాన్ని గుర్తించలేకపోయాం… ఈ చరాచర సృష్టికి కారకులు మీరు, నిర్మాతలు మీరని గుర్తించలేకపోయాం… క్షమించండి మా అజ్ఞానాన్ని… కనీసం ఏబీఎన్ రాధాకృష్ణయినా అప్పుడప్పుడైనా మాకు గుర్తు చేస్తూ ఉంటే బాగుండేది… ప్చ్… పాపం శమించుగాక…

https://muchata.com/wp-content/uploads/2025/11/f8a9208a-edef-4044-85bd-5b06a179f728.mp4

ఇప్పుడు Murali Buddha పోస్టు చదవండి ఇక…

అబద్ధాల్లో ధైర్యం అంటే బాబుదే…
సీఎంలు యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్ళరు అంటే …
ఆసక్తి ఉన్నవాళ్లు బాబు వీడియో మరోసారి చూడండి …

యాదగిరిగుట్ట నేనే కట్టాను . భద్రాచలం నేనే అంటూ బాబు చెబుతున్నప్పుడు అతనిలోని ఆ ధైర్యాన్ని చూడాలి … చెప్పేది అబద్దం అయినా ఆ ధైర్యం అద్భుతం …

93 నుంచి నాకు తెలుసు … ఎంత ప్రయత్నించినా బాబు యాదగిరిగుట్టను సందర్శించినట్టు గుర్తుకు రావడం లేదు … అన్నీ గుర్తుండాలి అనేమీ లేదు … ఏమో, యాదగిరిగుట్టకు వచ్చే ఉంటాడు అని నిర్ధారించుకోవడానికి గ్రోక్ ను అడిగితే ఒక్కసారి కూడా రాలేదు అని చెబుతోంది …

పోనీ గ్రోక్ కు అన్నీ తెలవాలి అని ఏముంది ? అని చాట్ జిపిటీని అడిగితే గుట్టకు రాలేదు కానీ 2020 లో హైదరాబాద్ కు వస్తుండగా ఆ ప్రాంతంలో బాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది అని చెబుతోంది …

గ్రోక్ కు, చాట్ జిపిటీ కి అన్నీ తెలియాలి అని ఏముంది ? అని యాదగిరి గుట్టలో రిపోర్టర్ రాగి సహదేవ్ కు ఫోన్ చేశా … అతను నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు … యాదగిరి గుట్టకు బాబు ఒక్కసారన్నా వచ్చాడా అని అడిగితే నేను 1980 నుంచి యాదగిరిగుట్ట ఆంధ్రభూమి రిపోర్టర్ గా చేస్తున్నాను … 45 ఏళ్ల నుంచి రిపోర్టర్ ను .

ఇప్పుడు ఆ ఆంధ్రభూమి లేదు, ఇప్పుడు మరో పత్రికలో ఉన్నాను . పుట్టింది ఇక్కడే .. పుట్టినప్పటి నుంచి ఇక్కడే… ఒక్కసారి కూడా బాబు యాదగిరిగుట్టకు రాలేదు … 1982 లో టీడీపీ పుడితే 80 నుంచి నేను యాదగిరిగుట్ట రిపోర్టర్ ను అని చెప్పుకొచ్చాడు ….

ఇది రాయడానికి మీడియాకు ధైర్యం ఉండదు కానీ తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా యాదగిరి గుట్టకు వెళ్లని బాబు అంత ధైర్యంగా యాదగిరిగుట్టను నేనే కట్టాను అని చెప్పడం – రాధాకృష్ణ తన్మయత్వం చూసి తరించాలి …

ఉమ్మడి రాష్ట్రం సీఎంగా బాబు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు కదా ? యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్ళలేదు అని ఆశ్చర్యం వేసింది … యాదగిరి గుట్టలోని స్థానికులు , అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ….

చివరకు యాదగిరి గుట్ట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో టీడీపీ మీటింగ్ జరిగితే బాబు ఆ మీటింగ్ కు వెళ్లారు కానీ గుట్ట పైకి వెళ్ళలేదు … స్వామి వారు తెలంగాణ దేవుడు కదా… పైగా …

అవినీతి అక్రమాలకు పాల్పడినవారు గుట్టపైకి స్వామి దర్శనానికి వస్తే స్వామి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అని ఇక్కడ ఓ నమ్మకం ఉంది .. ఈ నమ్మకం వల్ల సీఎంలు స్వామికి దూరంగానే ఉన్నారు ..

1983 లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు …
తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎంగా కెసిఆర్ యాదగిరి గుట్టకు వచ్చి గుట్ట రూపురేఖలు మార్చారు … ధైర్యంగా యాదగిరి గుట్ట పునర్నిర్మాణం చేపట్టారు .

తెలంగాణ ఏర్పడినప్పుడు 2014 లో యాదగిరి గుట్టకు వెళితే అక్కడి అపరిశుభ్రత – గుడి వెనుకే పందుల విహారం చూసి బాధ వేసింది … దీనిని పరిశుభ్రంగా చేస్తే బాగుండు అనిపించింది … ఆ తరువాత ఊహించని విధంగా యాదగిరిగుట్టను కెసిఆర్ అభివృద్ధి చేశారు .

జీవితంలో ఒక్కసారి కూడా యాదగిరి గుట్టకు వెళ్లని – గుట్ట అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని బాబు యాదగిరిగుట్టను నేనే అని నిస్సిగ్గుగా చెప్పడం చూస్తే … ఆ ధైర్యానికి ముచ్చటేస్తుంది …. – బుద్దా మురళి

.

.

  • సింపుల్… బాబు పాలన రాకముందు … తెలంగాణ ఒక సెంటినలీస్ దేవి… తనే ఈ నాగరిక ప్రపంచంలోకి ఈడ్చుకొచ్చాడు… అంతకుముందు తెలంగాణ జనం చెట్లు, గుట్టల వెంబడి ఆకులు అలములు తింటూ దిసమొలలతో తిరిగేవాళ్లు ఫాఫం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు గారండోయ్… క్షమించండి మా అజ్ఞానానికి… శపించకండి ప్లీజ్…
  • ‘ఫ్యూచర్ సిటీ’ వైపు బాటలు చూపే గ్లోబల్ సమ్మిట్… రైజింగ్ తెలంగాణ..!!
  • పవర్‌ఫుల్ చట్టం IFA-2025 … అక్రమ వలసదారులు పరుగో పరుగు…
  • ఓ సాత్విక పెద్ద భార్య… ఓ గయ్యాళి చిన్న భార్య… ఓ జీవన జ్యోతి…
  • పారడాక్స్..! చమురు మార్కెట్‌లో అమెరికాకు ఇండియా ‘లెసన్’…!!
  • బన్నీ క్రేజ్ మామూలుగా లేదు… పుష్ప-2కు ఏడోసారీ రికార్డు వీక్షణలు…
  • వెలగపండు అందుబాటులోకి..! పర్‌ఫెక్ట్ సూక్ష్మ పోషకాల పండు…!!
  • ఎట్టకేలకు రాష్ట్రపతి సర్వాధికారాల్ని సుప్రీంకోర్టు గుర్తించి వెనక్కి తగ్గింది..!!
  • కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్…! ఏం జరుగుతోంది..?!
  • కృత్రిమం కృత్రిమమే… ఏఐతో జర జాగ్రత్త… గుడ్డిగా నమ్మొద్దు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions