చంద్రబాబు కొత్త అలవాటు
రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్
వైఎస్ రాజశేఖర రెడ్డి బాడీ లాంగ్వేజ్..మేనరిజమ్స్ ఒకలా ఉంటే పూర్తిగా కాకపోయినా ఇంచుమించుగా వైఎస్ జగన్ బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది
ముఖ్యంగా నవ్వటంలో
ఇక ఎన్టీఆర్ స్టైల్ ఒకరకంగా ఉంటే చంద్రబాబు స్టైల్ ఇంకో రకంగా ఉంటుంది
ఎన్టీఆర్ జనంలోకి వెళ్ళినప్పుడు నవ్వుతూ కలిసిపోతే చంద్రబాబు మాత్రం గంభీరంగా పెద్దరికంగా ఉంటారు
నవ్వటం కూడా అరుదే
చూసేవాళ్లలో చంద్రబాబులో ఏదో తెలియని హుందా తనం కనపడుతుంది
డ్రెస్ కోడ్ విషయంలో కానీ బ్లాక్ షూ మెయింటెయిన్ చెయ్యటం విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటారు
దానికి తోడు చంద్రబాబు హైట్ ఒక అడ్వాంటేజ్
మొన్న డిల్లీలో పీఎం మోడీ పక్కన కూర్చున్న చంద్రబాబు హుందాగా కనపడితే ఆ పక్కనే కూర్చున్న నితీశ్ కుమార్ తేలిపోయాడు
రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి నేటి వరకు ఆహార్యంలో చంద్రబాబు తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు
మాట్లాడేటప్పుడు హావభావాలు కానీ
నడకలో గంభీరత కానీ
డ్రెస్ కోడ్ విషయం కానీ
చంద్రబాబు మొదట్నుంచీ అవే అలవాట్లు మెయింటెయిన్ చేస్తున్నారు
సరే, ఇవన్నీ మాకు తెలిసినవే కానీ కొత్తగా ఇప్పుడెందుకు చెప్తున్నారు అంటారా ?
అదే చెప్పబోతున్నాను
చంద్రబాబు కి కొత్తగా పదేపదే స్మార్ట్ ఫోన్ చూసుకోవటం అలవాటు అయ్యింది
ఈ రోజు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడుని ఎన్నుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతుండగా చంద్రబాబు తన సీట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ చూసుకోవటం కనిపించింది
మధ్య మధ్యలో టచ్ స్క్రీన్ మీద వేలితో స్క్రోలింగ్ చేయటం కూడా టీవీల్లో చూస్తున్న నేను గమనించా
బహుశా సోషల్ మీడియాలో పార్టీ ట్రెండ్ ను చూస్తున్నారేమో అనుకుంటున్నా
Ads
అన్నట్టు చెప్పటం మర్చిపోయా
రాహుల్ గాంధీకి కూడా స్మార్ట్ ఫోన్ వ్యసనం ఉంది
వేదికల మీద ఉన్నా కూడా ప్రతి పదినిమిషాలకు ఓసారి జేబులోనుంచి మొబైల్ ఫోన్ బయటికి తీసి చెక్ చేసి చూసుకోవటం అలవాటు
పాదయాత్రలో కూడా అదే పరిస్థితి
ఇన్నాళ్లు మొబైల్ ఫోన్లకు మనం మాత్రమే అడిక్ట్ అయ్యాం అనుకున్నా
పర్లేదు మనకు తోడు సెలబ్రిటీలు కూడా ఉన్నారు
అదీ సంగతి
పరేష్ తుర్లపాటి
Share this Article