నాయకులను కీర్తించడం వర్తమాన జర్నలిజంలో కొత్తేమీ కాదు… నిజానికి అది పాత్రికేయంలో ఓ భాగమైపోయింది… జర్నలిస్టులు అంటేనే వందిమాగధులు… కానీ రిపబ్లిక్ టీవీ చేష్టలు విచిత్రంగా ఉన్నయ్… దీనికి మోడీ కీర్తన కొత్తేమీ కాదు, అసలు దాని పనే అది… అది బీజేపీ చానెలే కాబట్టి తప్పులేదు అనుకుందాం కాసేపు… కానీ ఏకకాలంలో మోడీతోపాటు బాబును కీర్తిస్తూ… బీజేపీ- టీడీపీ కలిసిపోవాలని లేదా ఎన్‌డీఏలో టీడీపీ చేరిపోవాలని ఈ టీవీ వెంపర్లాడిన తీరు ఆశ్చర్యంగా ఉంది…
టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మేషన్- ద నీడ్ టు కీప్ ఫైటింగ్ పేరిట ఓ లైవ్ సదస్సు నిర్వహించింది… అందులో చంద్రబాబు డిజిటల్ మార్గంలో పాల్గొన్నాడు… చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు డ్యాష్ డ్యాష్ అనే కొత్త సామెత చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నదే కదా… సేమ్ అలాగే మాట్లాడాడు… మారితే చంద్రబాబు ఎందుకు అవుతాడు…? తన అవసరాన్ని బట్టి విధేయతలు, అభిమానాల్ని నటించడంలో ఇండియాలో నెంబర్ వన్ కేరక్టర్ తను…
రాజకీయాలు వేరట… అభివృద్ధి వేరట… దేశం కోసం మోడీతో కలిసి పనిచేస్తాడట… ప్రపంచంలోకెల్లా అత్యధిక తలసరి ఆదాయమున్నవారిగా ఆంధ్రులను అభివృద్ధి చేయడమే తన జీవిత ఎజెండా అట… మోడీతో కలిసి అభివృద్ధి ఎజెండా ఎత్తుతాడట… ఏదేదో చెబుతూ పోయాడు… జనం పిచ్చోళ్లు అనే భావన కాదా ఇది… ఒక్కసారి బ్రీఫ్‌గా పరికిస్తే… మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేయాలని డిమాండ్ చేసి భంగపడింది చంద్రబాబు కాదా..?
Ads
తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నది తనే కదా..? మోడీతో అంటకాగిందీ తను కాదా..? తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భ్రమపడి, మోడీని విడిచిపెట్టి, ఇష్టారీతిన మోడీపై నోరు పారేసుకున్నది తను కదా..? చివరకు మోడీ భార్యను కూడా ఈ పంచాయితీలోకి లాగి సంస్కారరహితంగా వ్యాఖ్యలు చేసింది తను కాదా..? ఇప్పుడు మళ్లీ మోడీ కావాలట, మోడీ ప్రాపకం కావాలట… దానికి ఇన్ని వేషాలు… బాగోతాలు… ఇప్పుడు అనిపిస్తుంది రిపబ్లిక్ టీవీ ప్రతినిధులు ‘‘టీడీపీ ఎన్‌డీఏలో చేరితే దేశానికి ప్రయోజనకరం’’ అనే ఎజెండాతో అలా వెంపర్లాడేలా చేయబడ్డారు అని..!
ఒక ప్రశ్న చదవండి… మీరు దార్శనికత కలిగిన నాయకుడు… దేశానికి ఇప్పుడు దార్శనికులు కావాలి… ఆల్‌రెడీ ఓ దార్శనిక నేత ఉన్నాడు… మరొక దార్శనిక నేతతో చేతులు కలిపితే మంచిదేగా…. దీనికి చంద్రబాబు అత్యంత తెలివిగా, రాజకీయాలకంటే నాకు దేశం ముఖ్యం అని జవాబు ఇవ్వడం మరో పెద్ద జోక్… ఈ ప్రపంచంలో ఎవరైనా 1000 శాతం హిపోక్రాట్ ఉన్నాడా అంటే సందేహం లేకుండా చంద్రబాబు వైపు వేలు చూపొచ్చు…
ఒకవైపు మోడీకి డప్పు కొడుతూనే… ఎన్‌డీఏలో చేరికను కాలం నిర్ణయిస్తుందంటున్నాడు… బీజేపీతో చేతులు కలుపుతారా అనే ప్రశ్న ఊహాజనితమట… జవాబు చెప్పే వేదిక కాదట… తెల్లారిలేస్తే చాలు, మోడీ చల్లని చూపు కోసం వెంపర్లాడుతూ, ఆ ప్రశ్న ఊహాజనితం అని వ్యాఖ్యానించడం చంద్రబాబుకే చెల్లు… ఈనాడు పబ్లిష్ చేసిన ఈ రిపబ్లిక్ టీవీ కథనంలో చాలా చాలా చంద్రబాబు డప్పు చప్పుళ్లు ఉన్నయ్… ఫాఫం, ఇందులో ఆంధ్రజ్యోతి వెనుకబడిపోయింది… ఇక అసలు సంగతికొద్దాం…
ప్రత్యేక హోదాపై రాజీపడింది తను… ప్యాకేజీకి అంగీకరించింది తను… యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటూ మళ్లీ పాట ఎత్తుకుంది తను… అది జగన్‌కు రాజకీయంగా ఉపయోగపడకూడదని మాత్రమే కాదు, కాంగ్రెస్‌తో అంటకాగడం కోసం ఈ యూటర్న్… ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో ఒకవేళ చేరితే… ఆ దోస్తీ నాలుగు రోజులు ఉంటుందని నమ్మకమేమీ లేదు… మళ్లీ మోడీని తిట్టబోడని గ్యారంటీ లేదు… ఏ రాత్రో ఏదో అంశంపై యూటర్న్ తీసుకుని, మళ్లీ మోడీ భార్యను బజారుకు లాగడని కూడా ఏమీ లేదు… మరెందుకు చంద్రబాబును ప్రేమతో కౌగిలించుకోవాలి… కేసుల భయమో, మన్నో మశానమో జగన్ అణిగిమణిగి ఉంటున్నాడు కదా… జగన్ సరిపోడా… ఈ మాయలమరాఠీని ప్రేమించి మళ్లీ మళ్లీ భంగపడటం అవసరమా..?!
Share this Article