.
ఎవరి గురించైతే ఐఎండీబీ ఎక్కువ సెర్చుతారో వాళ్లే పాపులర్ అని ఆ ప్లాట్‌ఫామ్ పిచ్చి లెక్క… ఆ లెక్కన ఈ సంవత్సరం చంద్రికా రవి అనే నటి నంబర్ వన్ కావాలి…
అవును, ఆమె గురించి నెటిజన్లు తెగవెతికారు… సిల్క్ స్మిత పుట్టినరోజున ఆమె కథానాయికగా గ్లింప్స్ రిలీజ్ చేశారు నిర్మాతలు… సినిమా పేరు సిల్క్ స్మిత – ది క్వీన్ ఆఫ్ సౌత్… అది సిల్క్ స్మిత బయోపిక్ అట…
Ads
ఎహె, ఆల్రెడీ డర్టీ పిక్చర్ తీశారు హిందీలో,.. హిట్ కొట్టారు కదా… అంతటి విద్యాబాలన్ జీవించాక ఇంకా ఆ పాత్రలో ఈ చంద్రికా రవి గొప్పగా ఏం చేయగలదు…? కొత్తగా నిర్మాతలు ఏం చూపించగలరు..? అదే… ఇంకా తెలియని కథ ఏముంది అంటారా..?
అందుకే అన్ టోల్డ్ స్టోరీ అని ట్యాగ్ లైన్ పెట్టారు… ఇంకా ఏమేమో చెబుతారట… నిజానికి డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత స్టోరీలోని వల్గర్ ఎపిసోడ్స్ మాత్రమే టచ్ చేశారు, కమర్షియల్‌గా ఆమే జీవితాన్ని సొమ్ము చేసుకోవడం కోసం… మరి ఏక్తాకపూర్ నిర్మాణ విలువలు అంటే అంతే కదా… 2011లో వచ్చింది ఆ సినిమా…
ఆమె జీవితంలోని ఆమె విషాదాన్ని సరిగ్గా పట్టుకోలేకపోయింది ఆ సినిమా, ఆ ఎమోషన్స్ కూడా వదిలేశారు హిందీ నిర్మాతలు… భిన్నమైన కోణంలో ఆమె గురించి చెప్పలేదు, చూపలేదు… నిజమే, ఈ తెలుగమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేస్తే, చెన్నైకి పారిపోయింది దగ్గర నుంచి… ఆమె ఎందుకు ఫుల్లు డౌన్ అయిపోయి చావును వరించింది దాకా… అనేక డార్క్, పెయిన్‌ఫుడ్ షేడ్స్… అసలు ఏమిటి ఆమె తత్వం..? ఎక్కడ దెబ్బతింది..?
సరే, విద్యాబాలన్ బాగానే చేసింది… మరి ఈ చంద్రికా రవి ఎవరు..? మనకు కొత్త నటి ఏమీ కాదు… బాలకృష్ణతో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ అని డాన్సింది ఈమే… చీకటి గదిలో చితక్కొట్టుడులో దెయ్యమూ ఈమే… మంచి అందగత్తె… స్టన్నింగ్ బ్యూటీ…
నిజానికి ఈమె బ్యాక్ గ్రౌండ్ ఆసక్తికరం… అది తెలుసుకుంటే సిల్క్ స్మిత రోల్ బాగానే పోషించగలదు అనిపిస్తుంది… తల్లిదండ్రులు సింగపూర్‌లో పుట్టారు… ఒకరు మలయాళీ, ఒకరు తమిళ్… చంద్రిక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పుట్టింది… విశ్వవనిత…
మల్టీ టాలెంటెడ్… మోడల్, సంప్రదాయ నృత్యంలో శిక్షణ… కొన్ని అందాల పోటీల్లోనూ మెరిసింది… అమెరికా వెళ్లింది… ఫిలిమ్ మేకింగ్, యాక్టింగ్‌లో శిక్షణ… రేడియో, టీవీ, సినిమా, మోడలింగ్ అన్నింట్లోనూ ఆసక్తి… తమిళ సినిమాపై దృష్టి పెట్టింది,.. 2018లో సెయి అనే సినిమా చేసింది… తరువాత అదే ఇయర్ చీకటి గదిలో చితక్కొట్టుడు ఒరిజినల్ తమిళ్ మూవీ Iruttu Araiyil Murattu Kuththu లో చేసింది…
అంతే… ఇక వేరే సినిమాలేవీ లేవు స్ట్రెయిట్ రోల్స్‌లో,.. సిల్క్ లైఫ్ సరిగ్గా పోట్రే చేయాలంటే సరైన కథ, సరైన స్క్రిప్టు కావాలి… ఆమె గెంతులు, ఊపుళ్లు, ఎత్తొంపుల ప్రదర్శనలు కాదు… వ్యాంప్ తరహా చిత్రీకరణకు పాల్పడితే ఆమె కథకు ద్రోహం చేసినట్టే… అవి బాగుంటే చంద్రికా రవి కూడా క్లిక్కవుతుంది…!!
Share this Article