ఆహా ఓటీటీలో బాగా క్లిక్కయిన రియాలిటీ షో అన్‌స్టాపబుల్… అందులో డౌట్ లేదు, కానీ అదంతా ఫస్ట్ సీజన్ వరకే, సెకండ్ సీజన్ వచ్చేసరికి బాలకృష్ణ ఎంపికలు బాగాలేవు, కంటెంట్ కూడా దారితప్పింది… ఎంటర్‌టెయిన్‌మెంట్ షో కాస్తా పొలిటికల్ షో అయిపోయి చాలామంది వదిలేశారు… దాని తరువాత ప్రేక్షకులు ఆసక్తిగా చూసింది ఇండియన్ ఐడల్ తెలుగు షో…
మనం జీసరిగమప షో చూస్తున్నాం కదా… అనంత శ్రీరాం డాన్సులు, పాటలు పాడుతుంటే వెనుక గ్రూపు డాన్సులు… అది మ్యూజిక్ కంపిటీషన్ షో గాకుండా ఏదో పిచ్చి షోగా తయారైంది… దాంతో పోలిస్తే ఇండియన్ ఐడల్ చాలా చాలా నయం… ఊరికే ప్రతి పాటనూ ఆహా ఓహో అని మెచ్చేసుకుని మేకతోలు కప్పడం గాకుండా కాస్త క్రిటికల్‌గా రన్ చేశారు జడ్జిలు థమన్, కార్తీక్, నిత్య… శ్రీరాంచంద్ర హోస్టింగ్ కూడా బాగుంది…
ఫస్ట్ సీజన్‌లో ఎంపిక చేయబడిన మెజారిటీ కంటెస్టెంట్లు కూడా గతంలో ఏదో ఓ మ్యూజిక్ ప్రోగ్రాంలో పాడినవాళ్లే… విజేతగా నిలిచిన వాగ్దేవి కూడా గతంలో పాడుతా తీయగాలో పాల్గొన్నది… రన్నర్ అప్‌గా నిలిచిన వైష్ణవి, మధ్యలో నిష్క్రమించిన అదితి భావరాజు తదితరులు ఆల్‌రెడీ సినిమాల్లో పాడుతున్నవాళ్లే… బట్, ప్రోగ్రాం బాగా ఆకట్టుకుంది… ఎక్కడా అతి లేదు… అనుకోవచ్చోలేదో గానీ, జడ్జిల మధ్య కూడా మంచి కెమిస్ట్రీ కనిపించింది… ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ధరంశెట్టి, రేణుకుమార్, జయంత్, వాగ్దేవి, వైష్ణవి తదితరులకు సినిమా చాన్సులు కూడా వస్తున్నాయి… రేణుకుమార్ ఇంకేదో టీవీ మ్యూజిక్ షోలో పాల్గొంటున్నట్టు కనిపించింది…
Ads
ఇప్పుడిక సెకండ్ సీజన్… దాంతో చాలామందికి ఆసక్తి ఏర్పడింది… ఆల్‌రెడీ ఆడిషన్ల ప్రకటనను ఇచ్చిన ఆహా ఓటీటీ సంస్థ ఇప్పుడు తాజాగా జడ్జిలను, హోస్టును రివీల్ చేసింది… నిత్యామేనన్ ప్లేసులో గీతామాధురి కనిపించనుంది… కొంత ఆశ్చర్యం… నిత్యాది ప్లజెంట్ ఫేసు, కాస్త స్వర జ్ఞానం ఉండి, అప్పుడప్పుడూ పాడుతుంటుంది కూడా… గీతామాధురి కూడా పర్లేదు, తను రెగ్యులర్ సింగర్… కార్తీక్, థమన్ సరేసరి… కానీ శ్రీరాంచంద్ర ప్లేసులో హేమచంద్ర ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరం…
అంటే శ్రీరాంచంద్ర ఎక్కువనీ, హేమచంద్ర తక్కువనీ కాదు… శ్రీరాంచంద్రలో హోస్టింగ్ ఎబిలిటీస్ కనిపించాయి… హేమచంద్ర హోస్టింగ్ చూడాల్సి ఉంది… ఇద్దరూ మంచి సింగర్లే… కానీ హోస్టింగుకు సింగింగులో ప్రతిభ అక్కర్లేదు… షో ఇంట్రస్టింగుగా రన్ చేసేలా ఉండాలి… బట్ ఓవరాల్‌గా టీం వోకే… అదే పాత ఆర్కెస్ట్రాను తీసుకుంటే బెటర్… ప్రత్యేకించి వయోలినిస్టు అంబడిపూడి కామాక్షి అయితే హైలైట్ గత సీజన్‌లో…
గత సీజన్‌లో ముందుగా బాలకృష్ణను పిలిచి, దాదాపు ఫినాలేగా ఒక ఎపిసోడ్ రన్ చేశారు… ఈలోపు అల్లు అరవింద్ బావ చిరంజీవికి కోపం వచ్చినట్టుంది… దాంతో బాలకృష్ణ ఎపిసోడ్‌ను మామూలు ఎపిసోడ్‌గా చూపించి, ఫినాలేను చిరంజీవికి అంకితం చేశారు… ఇండియన్ ఐడల్‌లో ఒక లోపం కనిపించేది గతంలో… కోరస్ పాడేవాళ్ల మైకులు సరిగ్గా ఉండేవి కావు… దాంతో కోరస్ ప్రధానమైన పాటలు వెలవెలాపోయాయి… మరీ డబ్బు దగ్గర కక్కుర్తి పడకుండా కాస్త మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేయవయ్యా అల్లు అరవిందుడూ…!! అసందర్భం, అప్రస్తుతం గానీ… ఆ గోళ్లు మరీ అంతగా పెంచడం ఏమిటమ్మా గీతమ్మ తల్లీ… మగాళ్లు బవిరి గడ్డాలు పెంచితే ఆడాళ్లు గోళ్లు పెంచడం ట్రెండా ఇప్పుడు..?!
Share this Article