ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు – హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్పులు – ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ కలర్ వేస్తున్న నిర్వాహకులు – విగ్రహంలోని కిరీటంలోని నెమలి పింఛం, కిరీటం వెనుక విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగింపు – ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ – హాజరుకానున్న జూ.ఎన్టీఆర్, సినీరంగ ప్రముఖులు….. ఇదీ ఓ వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన ఓ వార్త…
కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో జరగబోెయే ఈ విగ్రహ స్థాపనపై అనేక విమర్శలు… కోర్టులో పిటిషన్లు… ఈ విగ్రహ ఏర్పాటుకు పూనుకున్న మంత్రి, బంగారు తెలంగాణ లీడర్ పువ్వాడ అజయ్ మీద కూడా బోలెడు విమర్శలు సాగుతున్నయ్… అసలు కృష్ణుడి రూపంలో ఎన్టీయార్‌ను ప్రతిష్టించడం ఏమిటనేది విమర్శకుల ప్రధాన ప్రశ్న… ‘‘ఇదొక నీచమైన చర్య… కోట్ల మంది పూజించే కృష్ణుడికి ఎన్టీయార్ రూపాన్ని ఆపాదించడం ఓ కుట్ర…
ఎన్నికల్లో లబ్దికి ఎన్టీయార్ పోషించిన రాముడి స్వరూపాన్ని వాడుకున్నారు… ఇది దైవద్రోహం, ప్రజాద్రోహం కూడా…’’ అనే విమర్శలు జోరుగా సాగుతున్నయ్ సోషల్ మీడియాలో… దీంట్లోకి కులం కూడా ప్రవేశించింది… కొందరైతే ఎన్టీయార్ బృహన్నల పాత్రను అనితరసాధ్యంగా పోషించాడు కదా, ఆ విగ్రహం పెట్టండి అంటూ వ్యంగ్య విమర్శలకు దిగారు… ఎన్టీయార్‌కు వెన్నుపోటు పొడిచి, పరోక్షంగా ఆయన మరణానికి కారణమై, మళ్లీ ఆయన్నే ఆరాధిస్తూ విగ్రహానికి దండలు వేసే చంద్రబాబు పోకడకూ మంత్రి అజయ్ పోకడకూ తేడా ఏముందనేది ఈ అన్ని విమర్శల సారాంశం…
Ads
నిష్పక్షపాత కోణంలో పరిశీలిస్తే… కృష్ణుడంటే, రాముడంటే ఇతనే అనే రీతిలో చిత్రీకరిస్తూ సాగే ఇలాంటి చర్యలు కరెక్టు కాదు… పైగా ఒక కులం అభిమానం కోసం ప్రజలందరి ఆస్తి అయిన ఓ చెరువు మధ్యలో ప్రతిష్టించడం సదరు నాయకుడి పట్ల జనంలో వ్యతిరేకత పెంచే చర్య… సదరు అధికార పార్టీపై కూడా..! ఈ విగ్రహ ప్రతిష్టాపనకు జూనియర్ ఎన్టీయార్ వస్తుండటం పెద్ద ఆశ్చర్యం కలిగించదు… మంత్రి అజయ్ ఓ కులం పరిమితులు దాటలేని నాయకుడు కాగా, జూనియర్ ఓ కుటుంబం ముద్రల్ని దాటలేని నటుడు… ఇద్దరి నుంచి అంతకుమించిన పరిణతిని ఆశించలేం…
వివాదం కోర్టుకెక్కింది… విచారణ జరుపుతున్న కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు విగ్రహాన్ని ప్రతిష్టించరాదని ఆదేశించింది… ఈ నేపథ్యంలో కృష్ణ విగ్రహం నెమలిపింఛం, పిల్లనగ్రోవి, విష్ణుచక్రం తొలగిస్తున్నారనీ, తద్వారా అది కృష్ణుడి విగ్రహం కాదని చెప్పబోతున్నారనీ వార్తలు వస్తున్నాయి… ఓహో… నెమలి పింఛం, పిల్లనగ్రోవి, విష్ణుచక్రం తీసేస్తే ఇక కృష్ణుడు గాకుండాపోతాడా..? మరి అవన్నీ తీసేసిన తరువాత ఆ విగ్రహం ఎవరిది అనుకోవాలి..? ఈ తొలగింపులు కోర్టు కళ్లుగప్పడానికా..? మభ్యపెట్టడానికా..? విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించే సెక్షన్లు దీనికి సై అనేస్తారా..? మరి ఈ చర్యల్ని ఏమనుకోవాలి..?
అన్నట్టు గుర్తుందా..? రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జిల నడుమ ఇలాగే కృష్ణుడి రూపంలో ఎన్టీయార్‌ను ప్రతిష్టించారు… తరువాత పుష్కరఘాట్‌లో తొక్కిసలాటలో బోలెడు మంది మరణించారు… అనంతరం ఈ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్లు వచ్చాయి… విగ్రహ ఏర్పాటు దుష్ప్రభావంతోనే ఆ ప్రమాదం చోటుచేసుకుందనీ విమర్శించారు చాలామంది… సీపీఐ నారాయణ వంటి నాయకులు సైతం విగ్రహం తొలగింపు డిమాండ్లు చేశారు… ఖమ్మంలో అలాంటి విగ్రహమే ఏర్పాటు చేస్తే అది ఏ దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అంటారా..? ఏమో, అవన్నీ బీటీ బ్యాచ్ మంత్రికి అక్కరలేదు…!! అవునూ, సదరు మంత్రి చర్యకు అధికార పార్టీ ఆమోదం, బీటీ బ్యాచ్‌ను ప్రజలపై నిర్బంధంగా రుద్దే ముఖ్యమంత్రి ఆమోదం ఉన్నట్టే భావించాలా..?!
Share this Article