రేవంత్ చేతిలో పార్టీ ఖతం… అబ్దుల్లా సోహెల్ … ఫస్ట్ పేజీ
కొట్లాటల కాంగ్రెస్… రేవంత్ బేరాలపై విమర్శలు… ఫస్ట్ పేజీ
రేవంత్ తీరు దారుణం… విష్ణవర్ధనరెడ్డి ధ్వజం… ఐదో పేజీ
Ads
రేవంత్ దమ్ముంటే రా, చూసుకుందాం… సుభాష్ రెడ్డి… ఐదో పేజీ
కుక్క నోట్లో రేవంత్ మూతి… పాల్వాయి స్రవంతి… ఐదో పేజీ
రేవంత్ నీ బాగోతం బయటపెడతా… విజయకుమార్‌రెడ్డి… ఐదో పేజీ
రేవంత్ స్వలాభానికి కాంగ్రెస్ నాశనం… ఐదో పేజీ
రేవంత్ దగా చేశాడు… ప్రవీణ్‌రెడ్డి… ఐదో పేజీ
రేవంత్ డౌన్ డౌన్… ఎర్ర శేఖర్… ఐదో పేజీ
రేవంత్ మోసం చేసిండు… సరస్వతి… ఐదో పేజీ
లంబాడీల జాతిద్రోహి రేవంత్ రెడ్డి… ఐదో పేజీ
రేవంత్ రెడ్డి ఓ నియంత… ఎలక్షన్ స్పెషల్ పేజీ
నమస్తే తెలంగాణ… కేసీయార్ మౌత్ పీస్ రేవంత్ జపంతో తరించిపోతోంది… కేసీయార్, కేటీయార్, హరీష్, కవిత పేర్లకన్నా హెడింగుల్లో రేవంత్ పేరు ఎక్కువగా కనిపిస్తోంది… చాలాసార్లు నెగెటివ్ పబ్లిసిటీ కూడా లీడర్లకు పాపులారిటీ తీసుకొస్తుందనే సోయి నమస్తేకు లేనట్టుంది… ఒక వ్యక్తి పేరును పదే పదే తలుచుకుంటున్నారంటే భయం లేదా ఆందోళన బాధపెడుతున్నదని అర్థం… లేకపోతే అసలు తనను పట్టించుకోవద్దు కదా…
అసలు కాంగ్రెస్ నాయకుల ప్రోగ్రామ్స్ కాదు కదా, బీఆర్ఎస్ తప్ప మరో పార్టీ వార్తలు ప్రచురించదు ఇది… కానీ ఈరోజు ఐదో పేజీలో ఏకంగా 9 వార్తలు రేవంత్‌ను తిట్టేవి… ఎస్, రేవంత్‌ను తిట్టేవి కాబట్టి ఆ వార్తలు పబ్లిష్ చేస్తారు, అంతే… ఆ పేజీని ఈరోజు పూర్తిగా రేవంత్‌రెడ్డికి అంకితం చేశారు… బహుశా సాక్షి జగన్ పేరును, చంద్రబాబు పేరును ఇంత తలుచుకోవడం… ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఈ రేంజ్ ఉలిక్కిపాట్లను ప్రదర్శించలేదేమో…
చివరకు ఎలక్షన్ స్పెషల్ పేజీలో కూడా మూడు కాలాల ఒపీనియన్ వ్యాసం… ఫస్ట్ పేజీలో బ్యానర్ స్టోరీతోసహా మరో సింగిల్ కాలమ్ ఇండికేషన్ కూడా రేవంత్ రెడ్డి హెడింగులతోనే..! కాంగ్రెస్ పార్టీలోఉన్న ఇతరులెవరినీ ఇంతగా దూషించదు నమస్తే… రేవంతే టార్గెట్… అఫ్‌కోర్స్, టికెట్లు దక్కని వాళ్లంతా తిడుతున్నది రేవంత్‌నే… ఇప్పుడు బీజేపీతో భయం లేదు, అది మన దోస్త్ పార్టీయే కాబట్టి ఆ నాయకులు జోలికి పెద్దగా పోవడం లేదు బీఆర్ఎస్ క్యాంపు…
ఏవో నాలుగు వార్తలు రాయాలి కాబట్టి రాయడం, అంతే… అవీ కాస్త నెగెటివ్ వాసనతో…! ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే… ఆ పార్టీ జోష్ ఫీల్డ్‌లో కనిపిస్తోంది… దాని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్, పైగా కేసీయార్‌కు మొదటి నుంచీ పడదు… ఇంకేముంది..? రేవంత్ రేవంత్… ఈ పేర్లతోనే హెడింగులు, వార్తలు నిండిపోతున్నాయి… నమస్తే రేవంత్..!!
Share this Article