.
అవును, ఓ మిత్రుడు చెప్పినట్టు… అవి సర్పంచ్ ఎన్నికలు, పార్టీ రహితాలు… ఏ అభ్యర్థికి ఏయే పార్టీలు విడిగా మద్దతునిచ్చాయో, కలిసి మద్దతునిచ్చాయో చెప్పడం కష్టం… అధికారికంగా ఎవరూ ప్రకటించారు… మీడియా ఇష్టం… ఏ మీడియా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి అధిక స్థానాలు ఇచ్చేసుకుని, టేబుల్ కొట్టేయడమే…
ఇందులోనూ బీఆర్ఎస్ ఓవరాతోవరాక్షన్… స్వకుచమర్దనం… వాపూ బలుపూ లేని జబ్బల్ని చరుచుకోవడం… వాళ్లు క్రియేట్ చేసుకున్న స్కోర్ బోర్డు, స్కోర్ చూసుకుని, వావ్, కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీశాం, ఇక రేపోమాపో అధికారం ఖాయం అని వాళ్లలో వాళ్లే మురిసిపోవడం..,
Ads
జస్ట్, ఒక ఎగ్జాంపుల్… కేసీయార్ పార్టీ న్యూస్ చానెల్ టీన్యూస్ ఈ ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు ఓ దశలో తీసిన స్క్రీన్ షాట్ ఇది.,.

- ఎన్నికలు జరిగినవే 12,727… మూడు విడతలూ కలిపి… ఈ స్క్రీన్ షాట్ తీసే సమయానికి రిజల్ట్స్ వచ్చినవి 12,359… వాళ్లు చూపిస్తున్న లెక్కే… కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు కలిపి లెక్కేయండి… 14,384… అంటే, వాళ్లిష్టం స్కోర్ బోర్డు వాళ్లదే, స్కోరూ వాళ్లదే… ఎన్నికలు జరిగిన స్థానాలను మించి, వేల అదనపు సీట్లను కలిపేసి…. బీఆర్ఎస్ కల్పిత వాపును చూపించడానికి ఓ పిచ్చి లెక్క… అత్యుత్సాహం, ఓవరాతోవరాక్షన్… వెరసి అభాసుపాలు…
సరే, నమస్తే తెలంగాణ కాస్త నయం… సొంత పార్టీకి టీన్యూస్‌కన్నా కాస్త తక్కువే స్కోర్ వేసుకుంది పాపం… టోటల్ టేబుల్ లెక్క కూడా పర్లేదు…

ఒకసారి టీన్యూస్, వీ6, టీవీ9,, ఈటీవీ టేబుల్స్ చూడండి ఒకేచోట…

ఉజ్జాయింపుగా బీఆర్ఎస్ గెలిచిన సీట్లను 3300 నుంచి 3500 వరకు చూపించాయి, అంటే కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లలో సగం… ఇదీ రీజనబుల్ లెక్క… కానీ టీన్యూస్ ఎంత వేసుకుందో పైన చెప్పుకున్నాం కదా… కేసీయార్ సొంత పత్రిక, సొంత చానెల్ లెక్కలు మాత్రమే టోటల్లీ డిఫరెంటు… ఊరందరిదీ ఓ దారైతే ఉలిపికట్టెది మరో దారి కదా… ఆ దారిలోనే కేసీయార్ నడిపిస్తాడు కదా పాపం… ఓసారి సాక్షని చూద్దాం…

ఎంత బీఆర్ఎస్ మద్దతు పత్రికే అయినా సాక్షి కూడా కాంగ్రెస్‌కు 7 వేలకు పైగా సీట్లను దఖలు పరిచింది…
సరే, ఓసారి ఈనాడు చూద్దాం… చాలామంది నమ్ముతుంటారు కదా, ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాస్త ప్రొఫెషనల్‌గా ఉంటుందని…

ఈనాడులో కాంగ్రెస్ సీట్లు 7010… సరిగ్గా బీఆర్ఎస్‌కన్నా రెట్టింపు… సరే, రేవంత్ రెడ్డి బాకా ఊదే ఆంధ్రజ్యోతి మాటేమిటంటే… అనగా లెక్క ఏమిటంటే..? ఇదుగో…

దాదాపు సేమ్… 7 వేల చిల్లర… కాకపోతే టేబుల్‌లో ప్రేమగా సీపీఐ, సీపీఎం సీట్లను విడిగా పొందుపరిచారు… నిజానికి ఆ రెండు పార్టీల ప్రభావం, ప్రాధాన్యం ఈ సర్పంచ్ ఎన్నికల్లో పెద్దగా లేదు, అందుకే అందరూ ‘ఇతరుల’ లెక్కలో కలిపేశారు…
మరి కాంగ్రెస్ నాయకుల పత్రిక వెలుగులో లెక్క ఏమిటంటారా..? ఇదుగో…

సొంత పార్టీ కదా పాపం… ఏకంగా 7793 స్కోర్ వేసుకుంది కాంగ్రెస్‌కు… మరీ టీన్యూస్‌లాగా గాకుండా ఓవరాల్ సీట్ల సంఖ్య ఓసారి సరిచూసుకుంది… సో, ఏతావాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే… పార్టీలు, ఆయా పార్టీల మీడియాలను బట్టి… స్కోర్ బోర్డులు వాళ్లిష్టం… స్కోర్లూ వాళ్లిష్టం… ఖండించేవాడు ఉండడు, ఖండించడానికి అధికారిక ప్రకటనలూ ఉండవు… శుభం… స్వస్తి…
Share this Article