Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోత, బూతు, జుగుప్స, వెగటు… కంపుకొడుతున్న తెలంగాణ పాలిటిక్స్..!!

March 18, 2025 by M S R

.

బూతు, రోత, జుగుప్స, నీచ రాజకీయాలు… వ్యక్తిత్వ హననానికి పాల్పడే రాజకీయాలు… ఈ అంశాల్లో ప్రపంచంలో ఏ దేశమూ ఏ ప్రాంతమూ ఏపీ పాలిటిక్స్ రేంజుకు దిగజారలేదు అనే నమ్మకం ఉండేది… కానీ ఎహె, మాకేం తక్కువ,.? మేమేం తక్కువ..? అన్నట్టుగా తెలంగాణ పాలిటిక్స్ వేగంగా ఏపీ పాలిటిక్స్ స్థాయిని దాటేశాయి…

అవును, నిజం నిష్ఠురంగానే ఉంటుంది… కేటీయార్ వర్సెస్ రేవంత్ … (నిజానికి ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కూడా కాదు) ఇద్దరు నాయకుల నడుమ సాగుతున్న పోటీ… ఎవరు ముందు స్టార్ట్ చేశారు, ఎవరు పీక్స్‌కు తీసుకెళ్తున్నారనేది వదిలేస్తే ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు…

Ads

కాకపోతే కేటీయార్‌ను తన నోటితోపాటు తను కోట్లు వెచ్చించి, ఆర్గనైజ్ చేస్తున్న వందల సోషల్ మీడియా వేదికలున్నాయి… జర్నలిస్టులుగా దొంగ ముసుగులేసుకున్న రేవతి వంటి పెయిడ్ అగ్లీ క్యాంపెయినర్స్ ఉన్నారు… రేవంత్ రెడ్డికి మాత్రం ఆ నెట్‌వర్క్ తక్కువే, ఈ పోటీలో దిగదుడుపే, కాకపోతే తన నోరే తనకు ఈ బూతులు, తిట్ల పురాణంలో ప్రధాన బలం…

నిజమే… గతంలో కేటీయార్ మీద ఇదే రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు… డ్రగ్స్, రకుల్, జన్వాడ ఎట్సెట్రా ఆరోపణలు… ఆమధ్య కొండా సురేఖ అయితే ఏకంగా సమంత నటిని కూడా ముడిపెట్టి వెగటు వ్యాఖ్యలు చేసింది… సో, కేటీయార్ కేరక్టర్ అసాసినేషన్ జరిగింది… (నిజానిజాలిక్కడ అప్రస్తుతం… అవి వ్యకిత్వాలు, గుణాలకు సంబంధించినవి, పర్సనల్… ప్రజాజీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు…)

ఇప్పుడు కేటీయార్ ఏమంటున్నాడు..? ‘‘రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ బాగోతాలు మాకు తెలియవా..? సాగర్ సొసైటీ, మైహోం భుజ్‌కు ఉదయమే 5 గంటలకు ఎందుకు వెళ్తాడో మాకు తెలుసు..? ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో రేఖలు, తారలు, వాణిల గురించీ తెలుసు… అవసరమైతే ఫోటోలు కూడా బయటపెడతాం, బీజేపీ వాళ్లూ తక్కువేమీ కాదు… మేం నోరిప్పితే రేవంత్‌కు ఇంట్లో అన్నం కూడా పెట్టరు…’’

తారలతో నాయకుల సంబంధాలు… కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశాలు… రేఖ, తార, వాణి ఎవరో, కేటీయార్ ఏం పేర్లతో హింట్స్ ఇస్తున్నాడో పక్కన పెడితే… అంత పొద్దునే వెళ్లి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు..? ఈ ప్రశ్ననూ వదిలేద్దాం… కానీ కొన్ని అంశాలు, కొన్ని సందేహాలు… ఆ బీజేపీ నేతలు ఎవరని కాదు… కేటీయార్ ఆరోపణల్లో నిజానిజాల గురించి కాదు…

ktr

1. ఇంత డిటెయిల్డ్ సమాచారం, ఫోటోలు కేటీయార్ దగ్గరకు ఎలా వచ్చాయి..? నిజంగానే తన దగ్గర ఉండి ఉంటే..? గతంలోనైతే ఫోన్ ట్యాపింగ్, నిఘా యంత్రాంగం దుర్వినియోగం చేసి రేవంత్ రెడ్డి కదలికలన్నీ వాచ్ చేసి ఉండవచ్చు… మరి ఇప్పుడూ పోలీస్ యంత్రాంగం కేటీయార్‌కు సహకరిస్తోందా..? రేవంత్ కదలికల సమాచారం ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా కేటీయార్‌కు చేరుతున్నదా..?

2. సరే, కేటీయార్ అబద్దాలు చెబుతున్నాడు, కావాలనే రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడు అనుకుందాం… ఇదే కోణంలో ఒక ప్రశ్న… నిజంగా ఒక ముఖ్యమంత్రి ఉదయమే 5 గంటలకు, సొంత డ్రైవింగుతో, వితవుట్ సెక్యూరిటీ, తన వ్యక్తిగత అవసరాలు, అభిరుచుల కోసం ఎక్కడికో వెళ్తాడా..? వెళ్లగలడా..?

3. సీఎం బయటికి వస్తే సెక్యూరిటీ… ఎటు వెళ్లాలన్నా ఓ ప్రోటోకాల్, ముందస్తు ప్లానింగ్ గట్రా చాలా ఉంటయ్… తెలంగాణ వంటి సమస్యాత్మక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఎలా పడితే అలా తిరగడం (వితవుట్ సెక్యూరిటీ) సాధ్యమేనా..?

4. ఇప్పుడు నీకు పెయిన్ గుర్తొస్తుందా, నీ కుటుంబం బాధపడుతోందని ఇప్పుడు అర్థమవుతోందా..? మరి మా కుటుంబాల్ని బజారుకు లాగినప్పుడు మేమెంత పెయిన్ అనుభవించామో తెలుస్తోందా అంటున్నాడు కేటీయార్… ప్రస్తుతం సందర్భం ఏమిటి..?

5. ఏమిటంటే… రేవతి అండ్ బ్యాచ్ ద్వారా ఏవో తుచ్ఛమైన వీడియోల్లో రేవంత్ రెడ్డిని తిట్టించారు కదా బీఆర్ఎస్ టీమ్… రేవంత్‌కు మండింది, అధికారంలో ఉన్నోడాయె… ఈ నాన్ జర్నలిస్టుల తోడ్కల్ తీస్తం, బట్టలిప్పి బజార్ల ఉరికిస్తం అని ఫైరయ్యాడు… ఇప్పుడు కేటీయార్ అంటున్నాడు, నీకు ఇప్పుడు తెలిసొచ్చిందా నొప్పి అని… అంటే, రేవతి అండ్ టీమ్స్ ద్వారా తామే ఇవన్నీ చేయిస్తున్నట్టు ఇన్‌డైరెక్టుగా కన్‌ఫెషన్ అనుకోవాలా..?

6. రేవంత్ రెడ్డి నా మీద కేరక్టర్ అసాసినేషన్‌కు పాల్పడ్డట్టే మేమూ చేస్తున్నాం, తప్పేముంది అనే సమాధానమా..? సవాలా..? సమర్థనా..? అవునూ… ఇంతకీ రేవంత్ రెడ్డి తాలుకు కదలికలు ఈరోజుకూ కేటీయార్ అండ్ టీమ్‌కు ఎలా తెలుస్తున్నాయబ్బా… అసలే పోలీస్ యంత్రాంగం మీద రేవంత్ రెడ్డికి ఈరోజుకూ పట్టు రాలేదు అంటున్నారు అసలే..!!

7. రేవంత్ రెడ్డి గతంలో చేసినట్టుగానే మేమూ ఇదీ ఓ పొలిటికల్ స్ట్రాటజీగా ఎదురుదాడి చేస్తాం అనే కేటీయార్ ధోరణా ఇది..?

…. ష్, ఎవరి అవసరం వాళ్ళది… సర్కారు వైఫల్యాలపై జన్మలో డిస్కషన్ జరగొద్దు… పాత సర్కారు అక్రమాలపైనా డిబేట్ జరగొద్దు… Wow… నడుమ జనం ఎడ్డి బకరాలు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions