తాజా వార్త ఏమిటంటే..? నటి హేమ కథ మళ్లీ మొదటికొచ్చింది… అదేనండీ, బెంగుళూరులో ఓ రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకుందని పోలీసులు కేసు పెట్టారు కదా, ఆమెను అరెస్టు కూడా చేశారు కదా… బెయిల్ తెచ్చుకుంది… ఇప్పుడు ఆ రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు… అందులో హేమను నిందితురాలిగానే చూపించారని టైమ్స్ ఇండియా కథనం చెబుతోంది…
మొత్తం 1086 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేయగా, అందులో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు… ఐతే వారిలో 9 మంది ఆర్గనైజర్లు, మిగతా 79 మంది డ్రగ్స్ తీసుకున్నవాళ్లు… పార్టీలో హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు ఆధారాలున్నాయని, ఆ మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్‌కు జోడించారు పోలీసులు…
ఈ వార్తలు బయటికి రాగానే మళ్లీ హేమ స్పందించింది… అబ్బే, నాకున్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్టులో నెగెటివ్ అని చార్జి షీటులో వేశారు అంటోంది టీవీ ఇంటర్వ్యూలలో… నేను డ్రగ్స్ తీసుకోలేదు అని పాత పాటే… కానీ టైమ్స్ కథనంలో మాత్రం హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు చార్జి షీటులో పేర్కొన్నట్టు, మరో నటి (కృష్ణవేణి?) డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులు చెబుతున్నట్టు రాసుకొచ్చారు… ఆమెను సాక్షిగా చేర్చారు…
Ads
ఆమెనే కాదు, ఆ ఫామ్ హౌజు ఎంప్లాయీస్, పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు గట్రా మొత్తం 82 మందిని సాక్షులుగా చేర్చారు… నిందితుల్లో ఆర్గనైజర్ వాసు, అరుణ్, డెంటిస్ట్ రణధీర్, నాగబాబు, అబూబాకర్, నైజీరియన్ అగస్టీన్ దాదా కూడా ఉన్నారు… ఈ నైజీరియన్ డ్రగ్ సప్లయర్… 79 మంది మీద మాత్రం NDPS Act section 27 (b) – (punishment for consumption of any narcotic drug or psychotropic substance) సెక్షన్లు పెట్టారు…
మొదట్లోనే అబ్బే, నేను రేవ్ పార్టీకే పోలేదు, హైదరాబాదులోనే ఉన్నాను ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేసింది హేమ… ఏవో పచ్చళ్లు పెట్టుకునే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టింది… తరువాత ఆమె ఫోటోలు సహా పోలీసులు రిలీజ్ చేసేసరికి, నో, నో నేను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని చెప్పింది… మా అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేస్తే, నేను డ్రగ్స్ తీసుకోలేదనే నెగెటివ్ రిపోర్టు ఇదుగో అని సబ్మిట్ చేసింది…
దాంతో మా మంచు విష్ణు బాబు ఔదార్యంతో క్షమించేసి, మళ్లీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాడని వార్తల్లో చదివాం… ఇప్పుడూ అదే తంతు… కేసు లీగల్‌గా ఎదుర్కోవాలి… అంతేతప్ప, తప్పించుకోవడానికో, తప్పు కప్పిపుచ్చుకోవడానికో, తప్పుగా జనంలోకి పోకూడదనే భావనతోనో… పదే పదే ఇలా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే అవి బెడిసికొట్టే ప్రమాదముంది… అదీ హేమ తెలుసుకోవాల్సింది…
సరే, పోలీసుల వెర్షన్‌లో మరో అంశం కాస్త ఇంట్రస్టింగు… అరుణ్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది… దాని వేలిడిటీ ముగిసింది, ఈ స్టిక్కర్ ఎక్కడిదని పోలీసులు ప్రశ్నిస్తే తనకు ఇంతకుముందు కౌశిక్ కార్తీక్ అనే డ్రైవర్ ఉండేవాడని, తనే 5000 రూపాయలకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎవరి దగ్గరో కొనుక్కువచ్చి అతికించాడనీ, రెండేళ్ల క్రితం కౌశిక్ చనిపోయాడనీ చెప్పాడు అరుణ్… వావ్… 5 వేల రూపాయలకు కర్నాటక ఎమ్మెల్యే స్టిక్కర్… భలే ఉంది కదా..!!
Share this Article