.
ముందు ఈ వార్త చదవండి… తానాజీ సావంత్ అని మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు… కొడుకు పేరు రిషి రాజ్… సోమవారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కూడి ఓ ఛార్టర్ ఫ్లయిట్ బుక్ చేసుకుని, బ్యాంకాక్ బయల్దేరాడు…
మీరు చదివింది నిజమే… బ్యాంకాక్‌లో ఎంజాయ్ చేయడం కోసం ఆ ముగ్గురి కోసం ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం… పూణె ఎయిర్‌పోర్టు నుంచి అది బయల్దేరింది… కాసేపటికి డీజీసీఏ నుంచి పైలట్‌కు సమాచారం… అప్పటికే అండమాన్ దాకా వచ్చేసింది… కానీ అద్దెకు తీసుకున్న సదరు కథానాయకుడు రిషి రాజ్ కిడ్నాపయ్యాడట… వెంటనే వెనక్కి వచ్చేయాలి అని ఆదేశాలు…
Ads
ఇదే చెబితే విమానంలో గందరగోళం… అందుకని సింపుల్‌గా ఆ మూడు సీట్లకు ఎదురుగా ఉండే నేవిగేషన్ మ్యాపుల మానిటర్లను ఆఫ్ చేసేశారు… వాళ్లకేమీ చెప్పలేదు… కాసేపట్లో బ్యాంకాక్ చేరుకుంటామనే అనుకుంటున్నారు ఆ దోస్తులు, కానీ తిరిగి పూణె ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి విమానం దింపేశాడు పైలట్… సీఐఎస్ఎఫ్ పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు… ఇదీ జరిగింది…
నన్నెవడూ కిడ్నాప్ చేయలేదు, వెనక్కి ఎలా తీసుకొస్తారు అని సదరు రిషి రాజ్ రచ్చ… నిజమే, ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ ఇతరత్రా టెక్నికల్ ఇష్యూస్ అయితేనే ఇలా వాపస్ తీసుకురావాలి, ఏదో క్రైం ఇష్యూస్ ఉంటే అలా వెనక్కి తీసుకురారు… కానీ పైలట్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, విమానం అద్దెకు ఇచ్చిన సంస్థ కూడా రిస్క్ వద్దనుకుంది…
అసలు నిజం ఏమిటంటే..? పూణె నుంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేసి రిషి రాజ్‌ను కిడ్నాప్ చేసి విమానంలో తీసుకుపోతున్నారని సమాచారం ఇచ్చాడు… సేమ్, అదే సమాచారం రిషి రాజ్ తండ్రికీ ఫోన్ కాల్ ద్వారా ఇచ్చాడు… రిషి రాజ్ తండ్రి పోలీసులకు కిడ్నాప్ జరిగిందని కంప్లయింట్ ఇచ్చాడు… పోలీసులు డీజీసీఏ ద్వారా పైలట్‌కు వాపస్ వచ్చేయాలని ఆదేశించారు… ఇదీ జరిగింది…
ఇక్కడ కొన్ని అంశాలు… 1) తండ్రికి తెలియకుండా జస్ట్, ఇద్దరు స్నేహితులతో అద్దె విమానం బుక్ చేసుకుని మరీ బ్యాంకాక్ వెళ్లడం… అంటే రాజకీయ నాయకుల దగ్గర ఖర్చు ఎలా పెట్టుకోవాలో తెలియనంత డబ్బు పోగుపడుతోంది… నాయకుల పిల్లలు అలా తయారవుతున్నారు… బ్యాంకాక్ ఎందుకు పోతారో తెలుసు కదా…
2) అసలు తనను కిడ్నాప్ చేశారంటూ రిషిరాజ్ తండ్రికీ, పోలీసులకు ఫోన్ కాల్స్ చేసింది ఎవరు..? అనామక కాల్స్… ఆకతాయి కాల్స్ కాదు, రిషి రాజ్‌కు పడని స్నేహితులెవరో, తనను తీసుకుపోవడం లేదనే మంటతో కాల్స్ చేసి ఉండొచ్చు… 3) నాయకులు డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నారు, పిల్లల మీద అదుపు ఉండదు, అధికారమదం, ధనమదం, పొగరు, వ్యసనాలతో పిల్లలు అలా తయారవుతున్నారు, ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్..!!
Share this Article