.
రణనీతి అని ఒకటి ఉంటుంది… యుద్ధానికీ కొన్ని పద్ధతులు ఉంటాయి… యుద్ధంలో ఎదురుపడిన శత్రువునైనా సరైన రీతిలో ఎదుర్కోవాలే తప్ప అవమానించడం, ఓడిపోతే కించపరచడం, పట్టుకుని చిత్రహింసలు పెట్టడం సరికాదని యుద్ధనీతి చెబుతుంది…
ఆ యుద్ధ ధర్మాన్ని భారతీయ రాజులు తరతరాలుగా పాటిస్తున్నారు… నిండు సభలో తలవంచి, కరవాలాన్ని విజేత కాళ్లదగ్గర పెట్టి చేతులు జోడిస్తే ప్రాణాలతో వదిలేసిన కథలూ బోలెడు చదివాం… కానీ మొఘల్ పాలకులకు రీతి లేదు, నీతి లేదు…
Ads
ఎన్నో ఉదాహరణలు… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాడులు, సనాతన సంస్కృతీ నిలయాలైన గుళ్లపై ధనం కోసం విధ్వంసం, విద్వేషం, ఊచకోతలు, అత్యాచారాలు… వాళ్లేనా..? చివరకు టిప్పు సుల్తాన్ వంటి పాలకులు కూడా… ఉదాహరణ కావాలంటే ఏ మధ్వ బ్రాహ్మణుడిని అడిగినా చెబుతాడు… వాళ్లు దీపావళి ఎందుకు చేసుకోరో…
అందరినీ మించిన క్రూర పాలకుడు ఔరంగజేబు… మన పాఠ్యపుస్తకాల్లో మొఘల్ పాలకులు ఆహా ఓహో అని చదువుకుని, అవే మన బుర్రల్లోకి ఎక్కించుకున్నాం… ఔరంగజేబు ఎంతటి నీచ తత్వుడో ఒక శంభాజీ కథ చెబుతుంది… అదే ఛాావా సినిమా కథ… ఎవరో అంటున్నారు, సినిమాలో అంత హింస చూపించడం అవసరమా అని…
నిజానికి శంభాజీని ఔరంగజేబు పెట్టిన చిత్రహింసల్ని అదే తీవ్రతతో చూపిస్తే ఇంకెలా ఉండేదో… ఇప్పటికే మరాఠీ ప్రేక్షకులు సినిమా చూస్తూ శోకిస్తున్నారు… నాతో చేయి కలుపు, నీ మతం వీడు అనే ఔరంగజేబు షరతుకు ఓ వెటకారపు, ధిక్కారపు నవ్వు నవ్వి… నీ కూతురి చేయిని నాకు ఇస్తానన్నా నా మతం వీడను అంటాడు శంభాజీ…
నిజంగా తనను ఎన్నిరకాల చిత్రవధకు గురిచేశాడో తెలుసా..?
• మొదటగా, ఛత్రపతి శంభాజీని తక్తా కులాహ్ (ఇరాన్‌లో నేరస్తులు ధరించే టోపీ) ధరింపజేశారు. ఇది ఒక బహుళ వర్ణ వస్త్రం, జోకర్ వేషధారణలా, తలపై భారీ చెక్కపు టోపీతో కూడినది…
• ఒక భారీ చెక్క బ్లాక్‌ను ఆయన మెడకు వేసి, తీవ్రంగా బాధించే విధంగా భారాన్ని పెట్టారు. ఆయన చేతులు కూడా బ్లాక్‌కు కట్టేశారు. ఈ బ్లాక్‌కు గంటలను కూడా కట్టారు.
• ఆయన చేతులకు, శరీరానికి భారీ ఇనుప గొలుసులను వేశారు.
• చుట్టూ ఉన్న జనాలు కూడా మహారాజుపై, కవి కళాశ్‌పై రాళ్లు వేస్తూ వేధించారు.
• ఆ తర్వాత, మహారాజ్‌ను ఒక చిన్న ఒంటెపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అప్పుడు డ్రమ్స్, ఇతర వాయిద్యాలను మోగిస్తూ ఆయనను అవమానించారు.
• మహారాజ్‌ను దర్బార్‌లో ప్రవేశపెట్టినప్పుడు, ఆయన రక్తంలో తడిసిపోయి ఉన్నారు.
• అంతటి బాధను అనుభవించినా, శంభాజీ ఔరంగజేబు ముందు తల వంచలేదు. ధిక్కరించాడు.
• అదే రాత్రి, వేడి చేసిన ఇనుప కడ్డీలను తన కళ్లలోకి దూసి ఆయనను అంధుడిగా మార్చేశారు.
• అనంతరం, ఆయన చేతులను నరికి, కవి కళాశ్ నాలుకను కత్తిరించారు.
• తదుపరి 15- 20 రోజులు మహారాజ్ మానసికంగా, శారీరకంగా భయంకరమైన చిత్రహింసలకు గురయ్యాడు.
• ఆయన చర్మాన్ని వలిచారు.
• ఆపై, తన తలను ఖడ్గంతో నరికివేశారు. తలను వేరు చేసిన తర్వాత, గడ్డి నింపి, శూలంపై పెట్టి నగరంలో ప్రదర్శించారు.
• ఆ తరువాత, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికించమని ఆదేశించారు.
• ఆయన నాశనమైన శరీరాన్ని తులాపూర్ సమీపంలో పడవేశారు…
చదువుతూ ఉంటనే అదోరకమైన ఉద్వేగంగా ఉందా..? ఇన్నాళ్లూ ఈ చరిత్ర మరాఠాలకు మాత్రమే కాస్త తెలుసు… అందుకే సినిమా నటులు, క్రికెటర్లు ఇన్నాళ్లూ ఈ చరిత్రను మన పాఠ్యపుస్తకాలు ఎందుకు చెప్పలేదని నిందిస్తున్నారు… ఛావా దర్శకుడు తనే భయపడి ఆ హింసను చాలావరకు తగ్గించేశాడు…!!
Share this Article