Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

June 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ఆనాటి సతీ సావిత్రి యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్నట్లు ఈనాటి అపర సతీ సావిత్రి ఓ నిర్దోషిని పతిగా చేసుకుని చట్టంతో చెడుగుడు ఆడి రక్షిస్తుంది . పతిగా నటింపజేసి, కాపాడి, తరువాత నిజపతిని చేసుకుంటుంది… కధకు అనుగుణంగా సతీ సావిత్రి నాటకం కూడా ఉంది . హీరో చిరంజీవి , హీరోయిన్ మాధవి యముడిగా , సావిత్రిగా నటిస్తారు . యముడిగా చిరంజీవి బాగుంటాడు .

కధ టూకీగా ఏమిటంటే : హీరో గొప్ప సింగర్ , డాన్సర్ . మరదలు సుమలత , హీరో చిరంజీవి గాఢంగా ప్రేమించుకుంటారు . బాబాయి రావు గోపాలరావు హామీగా నిలబడ్డ తండ్రి ఆస్తిని బకరా చేయడంతో తండ్రి పి యల్ నారాయణ గుండెపోటుతో చనిపోతాడు . ఆస్తి తగాదాలలో తాము చేసిన హత్యలో హీరోని ఇరికించి జైలుకు పంపుతాడు విలన్ .

Ads

అనాధ పిల్లల సంక్షేమార్ధం హీరో ఖైదీగా ఉంటూనే ప్రదర్శనలను ఇస్తుంటాడు . ఆ ప్రదర్శనలను చూసి హీరోయిన్ అతనంటే ఇష్టపడుతుంది . హీరోయిన్ లా విద్యార్ధి , ఆవేశపరురాలు , కరెక్ట్ అనుకుంటే ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంది .

హీరో నిర్దోషి అని తెలుసుకుని అతన్ని ఉరిశిక్ష నుండి కాపాడటానికి అతన్ని తప్పించి , తాళి కట్టించుకున్నట్లు బిల్డప్ ఇచ్చి , ఆ పెళ్ళిని అడ్డం పెట్టుకుని కేసుని తిరగతోడుతుంది . కానీ కోర్టు కన్విన్స్ కాదు .

తాను తల్లిని కావాలని కోరుకుంటున్నాను కాబట్టి తాను తల్లి అయ్యేదాకా ఉరిశిక్షను వాయిదా వేసి భర్తతో సంసారం చేసేలా కరుణించమని రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకుంటుంది . రాష్ట్రపతి అనుమతిని ప్రసాదిస్తారు . విడుదలయిన హీరో దుష్టశిక్షణ చేసి , హీరోయిన్ మాధవితో జీవితాన్ని కొనసాగిస్తాడు .

పరుచూరి బ్రదర్స్ కాన్సెప్టుని బాగానే ఎంపిక చేసుకున్నారు . కానీ , హీరోయిన్ చట్టంతో చెడుగుడు ఆడుకోవటం కన్విన్సింగుగా ఉండదు . బాపయ్య దర్శకత్వంతో , చక్రవర్తి సంగీత దర్శకత్వంలోని పాటలతో , చిరంజీవి హీరోయిజంతో సినిమా బాగానే ఆడింది .

డాన్సరుగా , హీరోగా చిరంజీవి నటన బాగుంటుంది . మాధవి , సుమలత కూడా ఉండటంతో ఖైదీ ఫీల్ వస్తుంది . (ఖైదీ, చట్టానికి కళ్లు లేవు తరహా కథ అనుకుంటాం గానీ, ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీ)…

ఫైర్ బ్రాండ్ లేడీగా మాధవి నటన హైలైట్ . సుమలత చలాకీగా చక్కగా నటించింది . రావు గోపాలరావు విలనిజం చాలా ఎంఫటిక్ గా ఉంటుంది . ఇతర పాత్రల్లో సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , నూతన్ ప్రసాద్ , అన్నపూర్ణ , కాకినాడ శ్యామల , ప్రభాకరరెడ్డి , నర్రా , సుత్తి వీరభద్రరావు , కృష్ణవేణి , మమత , ప్రభృతులు నటించారు . సత్యనారాయణకు భిన్నమైన పాత్ర లభించింది . ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు ఆ పాత్రని .

వేటూరి వారి పాటలు బాగుంటాయి . సతీ సావిత్రి నాటకానికి అందరికీ పరిచయమయిన పద్యాలను వాడటంతో ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు . చిరంజీవి , మాధవి కూడా చక్కగా ఉంటారు , నటించారు . చిరంజీవి స్టేజి మీద ప్రదర్శించే రెండు డాన్సులు బాగుంటాయి . ఒకటి అనూరాధతో , ఇంకోటి మాధవితో .

నేనొక చిలకల కొలికిని చూసాను , పిల్ల పిల్ల పిల్లా పెళ్ళి కాని పిల్లా అంటూ సాగుతాయి ఈ రెండు డాన్సులు .
మాధవితో ఒక డ్యూయెట్ . కంచారే కంచారే కంచా అంటూ సాగుతుంది . చేసేది ఏముంది చెక్క భజన అంటూ సాగే డ్యూయెట్లో చిరంజీవి , సుమలత డాన్స్ బాగుంటుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది .

నరుడా నరుడా ఏమి నీ కోరికా అంటూ సిల్క్ స్మిత అద్భుతంగా డాన్సించింది . క్లైమాక్సులో కదలి రండి కనకదుర్గలై అంటూ గ్రామస్తులను చైతన్యపరిచే సుమలత పాట బాగుంటుంది . పరుచూరి బ్రదర్స్ డైలాగులు పదునుగానే ఉంటాయి . స్క్రీన్ ప్లేని , కధను ఇంకాస్త బిర్రు చేసి , కధను లాజికల్ గా , ప్రాగ్మటిక్ గా నడిపించి ఉంటే పెద్ద హిట్ అయి ఉండేది .

Yet , a watchable one . Action and drama-filled entertainer . చిరంజీవి , మాధవి , సుమలత అభిమానులకు బాగా నచ్చుతుంది . యూట్యూబులో ఉంది . చూడొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions