దాంట్లో ఏం జోక్ ఉందో… రోజమ్మ తెగ నవ్వేస్తూ ఉంటుంది… అనసూయ దాదాపు దొర్లుతున్నట్టుగా పడీ పడీ నవ్వుతుంది… పాపం, మనో… నవ్వకపోతే బాగుండదు, మళ్లీ ఎపిసోడ్‌కు పిలవరు, డబ్బు రాదు అన్నట్టుగా మొహమాటానికి ఏదో నవ్వినట్టు నటిస్తుంటాడు… దాదాపుగా జబర్దస్త్‌లో ఎక్కువసార్లు కనిపించే సీన్లు ఇవే… వారం వారం స్కిట్ల నాణ్యత మరీ ఘోరంగా పడిపోతోంది… అఫ్ కోర్స్, ఆ ప్రోగ్రాం టేస్టు, క్వాలిటీ, ప్రజెంటేషన్ అన్నీ ‘‘పడిపోయిన రేంజే’’… కానీ మరీ హైపర్ ఆది స్కిట్లు చూస్తుంటే తన మీద జాలేయడం లేదు, తన స్కిట్ కోసం వచ్చి బుక్కవుతున్నవాళ్లను చూస్తే జాలేస్తోంది… ఆది పంచులు అంటే ఒకప్పుడు… ఇప్పుడు ఏమీ లేదు, ఆమె హగ్గిస్తుందా, ఈమె కిస్సిస్తుందా అంటూ ఏదో పిచ్చి తాపత్రయ ప్రదర్శన తప్ప..! నిన్నో మొన్నో ఓ స్కిట్… ఫాఫం, సంపూర్ణేష్ బాబు గందరగోళానికి గురైపోయి, ఓ తిక్క డైలాగ్ చెప్పబోయి, ఎడ్డిమొహం వేయాల్సి వచ్చింది… క్యాలీ ఫ్లవర్ అని ఓ సినిమా తీస్తున్నాడుగా… ప్రమోషన్ కోసం వచ్చినట్టున్నాడు… ‘‘నీ క్యాలీ ఫ్లవర్ చూడాలని ఎప్పట్నుంచో వెయిటింగ్’’ అని ఆది ఏదో చెబుతున్నాడు… మామూలుగా ఇప్పుడు ఆది బూతులు తప్ప ఏదీ మాట్లాడటం లేదు కదా, ఇది కూడా ఏదో బూతు కావచ్చు అనుకున్నాడేమో, వెంటనే సంపూ ‘భయ్యా, నాది చిన్న క్యాలీ ఫ్లవర్ భయ్యా’ అని ఏదో సరదాగా అనబోయాడు… ఈ సంభాషణ ఇంకేదో అర్థాలను ధ్వనించి, ఇటు అనసూయ, అటు రోజా మొహాలు దాచుకున్నారు అర్జెంటుగా… చీప్…
సేమ్, పండు వచ్చి సంపూను ‘సంపూ డాడీ’ అని పిలుస్తాడు… (పండు కామెడీలో టైమింగు ఉంటుంది… ఓ టీంకు లీడర్‌ను చేస్తే బెటర్, ఇప్పుడున్న ఆ వెంకీలాంటోళ్లకన్నా చాలా బెటర్… అలాగే రోహిణిని మరో టీం లీడర్‌ను చేయొచ్చు…) వెంటనే సంపూ ‘‘ఏయ్, నాకేం సంబంధం లేదు’’ అని కంగారుపడతాడు… విష్ణుప్రియ అందుకుని ‘‘నాకూ ఏం సంబంధం లేదు, ఒక్కసారి కొబ్బరిమట్ట ఆడిషన్‌కు వెళ్లాను, అంతే’’ అంటుంది… ‘‘ఓహో, ఆ కొబ్బరిమట్ట ఆడిషన్ బాపతు కొబ్బరిచిప్పా ఇది..? నా చిప్పేమో అనుకున్నాను’’ అంటాడు ఆది… మొత్తం అక్రమ సంబంధాల చుట్టే కదా జబర్దస్త్ స్కిట్స్ గిరికీలు కొట్టేది… ఇదీ అంతే… చివరకు గెస్టులను పిలిచినా సరే, వాళ్లనూ ఆ బురదలోకి లాగడమే, పూయడమే…
Ads
అన్నింటికన్నా చిల్లరగా అనిపించింది విష్ణుప్రియ ముక్కు మీద వేసిన పంచులు… బాడీ షేమింగ్కన్నా ఎక్కువ… నిజానికి ఆమె ముక్కు మీద ఇప్పటికే ఓ వేయిసార్లు జోకులు వేశారు కావచ్చు అన్ని స్కిట్లూ కలిపి… ఆమే కాదు, ఇమ్మూ కలర్ మీద, రష్మి మేకప్ మీద కూడా అంతే… గట్టిగా వ్యతిరేకించలేరు… ఆది, సుధీర్, ప్రదీప్ వంటి సీనియర్లకు కోపం రానివ్వకూడదు… ఇంకేం చేయాలి..? భరించాలి..! ‘‘ఎందుకు పెంచుతున్నావ్ ఆ ముక్కును అలా’’ అని ఆది డైలాగ్… ఏమైనా అర్థముందా..? అందులో పంచ్ ఏమిటో తనకే తెలియాలి… చివరకు ఆది అక్కడికి జారిపోయాడు… మరోచోట అంటాడు… ‘‘ముద్దు పెట్టాలంటే నీ ముక్కు అడ్డం వస్తది, హగ్గు చేసుకుందామంటే నా పొట్ట అడ్డం వస్తది, ఇంకేదో చేద్దామంటే కెమెరాలు అడ్డొస్తాయి…’’ ఇందులో నవ్వడానికి ఏముందో అర్థం కాదు.., యాంకరిణి, జడ్జిణి ఎందుకంత పడీ పడీ నవ్వారో మరి…! ఇదంతా ఉదాహరణ కోసం చెప్పిన ఒక స్కిట్… ఇక మిగతావి ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకొండి… గతంలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను స్కిట్లు కాస్త బాగానే ఉండేవి… ఇప్పుడు వాళ్లూ అలాగే తయారయ్యారు.. కామెడీ స్టార్స్, రెచ్చిపోదాం బ్రదర్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్… ఇలా కమెడియన్లకు గిరాకీ పెరిగింది… వాటిల్లో నాణ్యత మరింత రోతరోత అయిపోతోంది…!!
Share this Article